PM Kissan Yojana: ప్రధానమంత్రి కిసాన్ యోజన సమ్మాన్ నిధులను కేంద్ర ప్రభుత్వం త్వరలోనే విడుదల చేయనుంది. ఫిబ్రవరిలో రైతుల ఖాతాల్లో నేరుగా నగదు  జమ అయ్యే అవకాశం ఉంది.


ఆర్థికసాయం
రైతులకు ఆర్థిక చేయూత అందించడమేగాక...పెట్టుబడి సొమ్ము అందించేందుకు కేంద్రప్రభుత్వం పీఎం కిసాన్ యోచన సమ్మన్ పథకం కింద రూ.6వేల సాయం అందిస్తోంది. మొత్తం మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో ఈ సొమ్ము జమ చేస్తున్నారు. ఇప్పటికే  18 విడతల్లో రైతుల ఖాతాల్లో రూ.2వేలు చొప్పున జమ కాగా....ఇప్పుడు  19వ విడత విడుదలకానున్నాయి. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి కేంద్రం నిధులు విడుదల చేస్తుంది. గతేడాది అక్టోబర్‌లో నిధులు విడుదలయ్యాయి. కాబట్టి ఈ విడత సొమ్ము ఫిబ్రవరిలో జమ చేసేఅవకాశం ఉందని రైతులు ఆశిస్తున్నారు.


మీ పేరు ఉందో లేదో చూసుకోండి
రెండు హెక్టార్లలోపు సాగు భూమి ఉందా..? అయితే మీరు పీఎం కిసాన్ యోజన పథకానికి అర్హులే. ఇప్పటి వరకు మీరు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోలేదా..? అయితే వెంటనే త్వరపడండి. ఒకవేళ ఇప్పటికే మీరు ధరఖాస్తు చేసుకున్నారా..? అయినప్పటికీ  మీ ఖాతాలో నగదు జమ కావడం లేదా..? అయితే  ఒకసారి జాబితాలో మీరు పేరు ఉందో లేదో సరిచూసుకోండి. 


పీఎం కిసాన్‌కు దరఖాస్తు చేసుకోండి ఇలా...
ముందుగా www.pmkisan.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లండి
New Farmer Registration ను  తెరవండి
అందులో ఆధార్‌ సహా వివరాలన్నింటినీ నమోదు చేయండి
అంతే మీరు పీఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకున్నట్లే


జాబితాలో పేరు ఉందో లేదో సరిచూసుకోండి
ముందుగా www.pmkisan.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లండి
Beneficiary List ఓపెన్ చేయండి
చిరునామా వివరాలు ఎంటర్‌ చేసి Get Report పై క్లిక్ చేశారా క్షణాల్లో జాబితా మీముందు ఉంటుంది.


కేంద్రం ఇచ్చే నిధులకు తోడు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం కొంత నిధులు జోడించి రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం రూ.20వేలు రైతుల ఖాతాల్లోకి వేస్తామని తెలపగా....ఏపీ ప్రభుత్వం సైతం రైతులకు ఎన్టీఆర్ రైతు భరోసా నిధులు అందించనుంది. పంటలు వేసే సమయంలో రైతులకు పెట్టుబడి సాయం అందించడమే లక్ష్యంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఆర్థికసాయం అందిస్తున్నాయి. మూడు విడతల్లో రైతుల  అవసరాలకు  అనుగుణంగా  ఎప్పటికప్పుడు  వారి ఖాతాల్లో నగదు జమచేస్తున్నాయి. వేడినీళ్లకు చన్నీళ్లు తోడులాగా రైతులకు ఈసొమ్ము  ఎంతో ఉపయోగకరంగా ఉంటోంది.


ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 13 కోట్ల మంది రైతులకు  ప్రయోజనం అందుతోంది.అయితే  ఈ-కేవైసీ చేయించుకోని రైతులకు ఈ ప్రయోజనాలు అందవు. కాబట్టి వీలైనంత త్వరగా రైతులంతా ఈ-కేవైసీ చేయించుకోవాలని  అధికారులు సూచిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో  e-kyc, ఆధార్‌ మరియు ఎన్‌పీసీఐలను అందించాలని నిర్ణయించింది. ఇందుకోసం పంచాయతీల్లో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేశారు. మరికొన్ని చోట్ల ఇంటింటికి  వెళ్లి వివరాలు తీసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ అర్హులైనవారందరికీ ఈ అవకాశం అందించాలని  రైతులు కోరుతున్నారు. ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి సమస్యలు  తొలగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో కొందరి పేర్లు తొలగించారని వారందరికీ ఇప్పుడు న్యాయం చేయాలంటున్నారు.