Meghasandesam Serial Today Episode:   గగన్‌, భూమి ఫోటోలు తీస్తుంటే నక్షత్ర ఫ్రెండ్‌ అపూర్వ దగ్గరకు వెళ్లి ఆయన భూమి ఫోటోలు తీస్తూనే ఉన్నారు. ఇక ఫోన్‌ ఎలా కొట్టేయాలని చెప్తుంది. అయితే పిన్ని ఈ అమ్మాయితో నువ్వు వెళ్లు ఎలాగైనా ఫోన్‌ కొట్టేయండి అని సుజాతను పంపిస్తుంది. ఇద్దరూ కలిసి వెళ్తారు. మరోవైపు వంశీ వాళ్ల రూంలో అందరూ వెయిట్‌ చేస్తుంటారు.


రమేష్‌: ఇంత టైం అవుతుంది. ఎవ్వరూ ఇంకా రాలేదేంటి..? అదిగో వచ్చారు.


మీరా: అన్నయ్య గారు.. వదిన ఏదో ఇంపార్టెంట్‌ విషయం మాట్లాడుతుంది. కొంచెం వెయిట్‌ చేద్దాం.


బామ్మ: మనం తప్ప ఆమెకు అన్ని ఇంపార్టెంటే.. వియ్యంకుల వారిని ఎంత సేపు వెయిట్‌ చేయిద్దాం.


రమేష్‌: పోనీలేమ్మా.. ఏర్పాట్లు చూస్తున్నారేమో.. ఇవ్వాల్సినవి ఇస్తానంటే మేము ఎంత సేపైనా వెయిట్‌ చేస్తాం.


అపూర్వ: ఆ ఏంటి చెప్పండి..


మీరా: అదే వదిన వీళ్లకు ఇస్తానన్న కట్నం ఇంకా ఇవ్వలేదు. అది గుర్తు చేద్దామని..


అపూర్వ: ఇంత చిన్న విషయానికి కూడా నన్ను పిలవాలా మీరా అక్కడే ఒక మాట చెబితే సరిపోయేది కదా.. రంగా నేను దగ్గరుండి ప్యాక్‌ చేయించాను కదా అవి తీసుకొచ్చి వీళ్లకు ఇచ్చేయ్‌.


అని చెప్పగానే రంగ రెండు బ్యాగులు తీసుకొచ్చి వాళ్ల ముందు పెడతాడు. బ్యాగులు తీసుకుని రమేష్‌, సౌందర్య మాట్లాడుతకుంటుంటే.. తీసుకున్నారు కదా ఇంకా మాటలేంటి అని అపూర్వ అడుగుతుంది. ఏం లేదని చెప్తాడు రమేష్‌. బ్యాగులు తీసుకుని అందరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. మరోవైపు గగన్‌ దగ్గరకు  వెళ్తుంది నక్షత్ర.


నక్షత్ర: బావా వెళ్లిపోతున్నావా..?


గగన్‌: వెళ్లిపోక ఇక్కడే ఉండి పోమ్మంటావా..?


నక్షత్ర: అంతకంటే సంతోషమా..?


గగన్: నేను ఉంటే నీకు సంతోషం కానీ నాకు విషాదం కనిపిస్తుంది. నేను ఉంటే నీ ఫోటో మీ అమ్మ ఫోటో గోడ మీదకు ఎక్కుతాయి. వాటికి దండలు పడతాయి.


నక్షత్ర: నువ్వు ఎంత అన్నా నాకు సంతోషంగానే ఉంటుంది. సరే భోజనం చేశావా..? నాకు కేక్‌ తినిపించావు కదా..? నేనంటే నీకు ఇష్టం లేకపోయినా మనసుల్ని కలుపుకుందాం. తర్వాత అవే కలిసిపోతాయి.


భూమి తమను గమనిస్తుందని గగన్‌ నక్షత్రతో ప్రేమగా మాట్లాడతాడు. భూమి ఇరిటేటింగ్‌ గా ఫీలవుతుంది. దీంతో నక్షత్ర హ్యాపీగా భోజనం తీసుకురావడానికి వెళ్తుంది. భూమి దగ్గరకు వచ్చి గగన్‌ ను తిడుతుంది. మీకేంటి దానితో మాటలు అంటూ మీరు ముందు ఇక్కడి నుంచి వెళ్లండి అంటుంది. గగన్‌ వెళ్లిపోతుంటే.. సుజాత, నక్షత్ర ఫ్రెండ్‌ వచ్చి గగన్ ఫోన్‌ కొట్టేస్తారు. ఫోన్‌ తీసుకుని అపూర్వ దగ్గరకు వెళ్తారు.


సుజాత: అమ్మాయి ఈ పిల్ల భలేగా ఫోన్‌ కొట్టేసింది. దొంగతనం చేయడంలో పీహెచ్‌డీ చేసినట్టు ఉంది. ఎంటలా చూస్తున్నావు నీ టాలెంట్‌ మెచ్చుకుంటుంటే సంతోషించు..


అపూర్వ: పిన్ని దొంగ అంటే ఎవరికైనా కోపం వస్తుంది.


సుజాత: అవునులే నీకు కూడా వస్తుందిగా..


అపూర్వ: పిన్ని..


సుజాత: అయ్యో కంగారులో నిజం బయటకు వచ్చేసింది.


అపూర్వ:  పిన్ని హద్దులోనూ సరదాలోనూ ద అనే అక్షరం కామన్‌ గా ఉంది కదా అని మాట్లాడొద్దు. కూడితే కూడికలోంచి నువ్వు తీసివేయబడతావు. నక్షత్రను రూంలోకి పంపిస్తాను నువ్వు విండో దగ్గర రెడీగా ఉండు.


 అని చెప్పి కిందకు వెళ్తుంది అపూర్వ. కింద ప్లేట్‌లో వడ్డించుకుంటున్న నక్షత్ర దగ్గరకు వెళ్లి వెనక నుంచి జ్యూస్‌ పోస్తుంది సుజాత. అపూర్వ వచ్చి సుజాతను తిట్టి నువ్వు వెళ్లి డ్రెస్‌ మార్చుకుని రాపో అని రూంలోకి పంపిస్తుంది అపూర్వ. నక్షత్ర రూంలోకి వెళ్లి డ్రెస్‌ మార్చుకుంటుంటే.. బయట విండో నుంచి గగన్‌ ఫోన్‌ నుంచి వీడియో తీస్తుంది గాయత్రి. వీడియో తీస్తున్న గాయత్రిని భూమి చూస్తుంది. ఇంతటితో  ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  


 


ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!