Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode కార్తీక్ లాకెట్ గురించి దీపతో చెప్తాడు. జ్యోత్స్న కోసం కలువ పువ్వులు తీసుకురావడానికి కోనేటిలోకి దూకితే ఓ అమ్మాయి వచ్చి కాపాడిందని చెప్తాడు. కార్తీక్ చెప్పుకుంటే అది తనే అని దీప ఎమోషనల్ అవుతుంది. కార్తీక్ ఆ రోజు దీప వేసుకున్న డ్రస్ నుంచి రిబ్బన్లు మొత్తం చెప్తాడు. దీప చాలా సంతోషిస్తుంది. అంత గుర్తు పెట్టుకున్నారా అని దీప అనుకొని ఏడుస్తుంది.
దీప: మనసులో నేను చిన్నతనంలో కాపాడిన కార్తీక్ ఈ కార్తీక్ ఒకరే అని నాకు తెలీదు బాబు.
కార్తీక్: మళ్లీ కలుద్దాం అంటే సైకిల్ ఎక్కేసింది మళ్లీ కలుద్దాం అంటే నమ్మకం లేదు అంది తర్వాత గుర్తొచ్చింది ఆ అమ్మాయి పేరు అడగటం మర్చిపోయా అని.
దీప: మనసులో ఆ అమ్మాయి పేరు దీప.
కార్తీక్: తర్వాత కారులో వెళ్తుంటే చూశా నా జేబులో లాకెట్ ఉంది. తన కోసం అప్పటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నా దీప.
దీప: ఆ అమ్మాయే మీ భార్య అయింది బాబు. నేను మీ ప్రాణాలు కాపాడినట్లే మీరు నా ప్రాణాలు కాపాడారు. ప్రాణాలు కాపడటమే కాదు జీవితంకూడా కాపాడారు. ఆ ప్రాణదాతని నేనే అని చెప్పాలా.
కార్తీక్: ఏంటి దీప నా కథ విని నువ్వు కన్నీళ్లు పెట్టుకుంటున్నావేంటి
దీప: ఏం లేదు కార్తీక్ బాబు ఆ రోజు తను వేసిన బట్టలతో సహా అన్ని గుర్తుపెట్టుకుంటే ఎమోషనల్ అయిపోయా. తను ఇప్పుడు నా ప్లేస్‌లో నిల్చొంటే ఏం మాట్లాడుతారు.
కార్తీక్: జన్మనిచ్చిన అమ్మతో ఏం మాట్లాడుతాం దీప చేతులెత్తే మొక్కే దేవతతో ఏం మాట్లాడుతాం. నా ప్రాణం తప్ప తను ఏం అడిగినా ఇచ్చేస్తా. ఎందుకంటే ఇప్పుడు ఆ ప్రాణం నా భార్యది అంటే నీది. ఆ లాకెట్ ఇవ్వు దీప.
శౌర్య: నాన్న ఆ లాకెట్ నాకు బాగా నచ్చింది ఇచ్చేయ్ నాన్న.
కార్తీక్: ఇది నాది నేను అయితే ఎవరికీ ఇవ్వను. నేను ముసలి వాడినైనా సరే ఇది నాతోనే ఉంటుంది.
దీప: పెద్దగా ఏడుస్తూ ఇప్పుడు నేను ఏం చేయాలి అది నాలాకెట్ మా అమ్మ గుర్తుగా మానాన్న నా మెడలో వేసిన లాకెట్. అది పోయిందని ఎంతో బాధ పడ్డాను. అది మీ దగ్గరకు చేరింది అని కానీ అది నాది అని మీకు ఎలా చెప్పను. నేను సుమిత్రమ్మని అప్పుడే చూశాను కానీ గుర్తు చేసుకోలేకపోయాను. అందుకే మొదటి సారి గుడి దగ్గర చూసినప్పుడు ఎక్కడో చూశానని అన్నాను. ఇప్పుడు ఆ ప్రాణదాత నేనే అని తెలిస్తే ఇంకా ఎక్కువ ప్రేమిస్తారు ఇంకాస్త ఎక్కువ దగ్గరవుతారు. అది నేను కోరుకోవడం లేదు కదా మరి నేను ఏం కోరుకుంటున్నా నా కారణంగా మీ రెండు కుటుంబాలు దూరం అయ్యావి, నా వల్ల మీరు నిరుపేదలా బతుకుతున్నారు. మీరు ఇలా ఉండకూడదు బాబు. మీరు తలెత్తుకొని నిలబడాలి. తాతయ్య గారే కార్తీక్ నా మనవడు అని చెప్పుకోవాలి. మీ రెండు కుటుంబాలు కలిసి పోయి ఆనందంగా ఉన్న రోజున మీ కళ్లలో ఆనందం చూసిన రోజున అప్పుడు చెప్తా కార్తీక్ బాబు నేను మీ ప్రాణదాతని అని.
కార్తీక్ దీపలు రోడ్డు మీద సరుకులు పట్టుకొని వెళ్తుంటే పారిజాతం చూసి ఇది కదా వైభోగం ఇది కదా రాజసం అని వెటకారం చేస్తుంది. దీపని పారిజాతం నువ్వు దరిద్రం, నువ్వు పక్కనుంటే దరిద్రం, దారుణం, విధ్వంసం అని తిడుతుంది. పుట్టగానే తల్లిని మింగేసింది తర్వాత తండ్రిని అని పారిజాతం అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: మందారం బతికే ఉందా.. మరి రాజు తీసుకొచ్చిన శవం ఎవరిది? అసలేంటీ ట్విస్ట్!?