Ammayi garu Serial Promo Today Episode అమ్మాయిగారు సీరియల్ మంచి మంచి ట్విస్ట్‌లు టర్న్‌లతో ఎంతో అలరిస్తుంది. సీఎం కూతురు ఓ సామాన్య వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఎన్నో ప్రయత్నాల తర్వాత తండ్రిని ఒప్పించి ఒకటవడం జరుగుతుంది. ఇద్దరూ భార్యాభర్తలు సంతోషంగా ఉన్నారు ఇక ఎప్పటికీ విడిపోరు అనే టైంలో మందారం చనిపోవడంతో ఇద్దరూ శాశ్వతంగా దూరం అయిపోతారు. ఈ తరుణంలో తాజా ప్రోమో చాలా ఆసక్తికరంగా మారింది. ఎవరైతే చనిపోయారు రూప రాజులు విడిపోవడానికి కారణమయ్యారో ఆ మందారం తాజాగా బతికి ఉన్నట్లు తెలుస్తుంది. ఇంతకీ ప్రోమోలో ఏముందంటే..

" రూప మందారం ఫోటో దగ్గరకు వెళ్లి దండం పెట్టుకుంటుంది. మందారం నన్ను క్షమించు నువ్వు ఎక్కడున్నా నీ ఆత్మ శాంతించాలి అని రూప దండం పెట్టుకుంటుంది. దాంతో ఓ చోట మందారం బతికే ఉన్నట్లు విరూపాక్షి మీద నిందలకు కారణం అయిన రాఘవ మందారాన్ని బతికించినట్లు చూపిస్తారు. బెడ్ మీద ఉలుకు పలుకు లేకుండా పడుకొని ఉన్న మందారంతో రాఘవ మందారం సమయానికి నేను వచ్చి నిన్ను చూశాను కాబట్టి నువ్వు బతికావ్ అని అంటాడు. నువ్వు ఎంత త్వరగా కళ్లు తెరిస్తే అంత త్వరగా నిజం బయట పడదామని అంటూ మందారం నోట్లో నాటు పసరు వేస్తాడు. దాంతో మందారం కళ్లు తెరుస్తుంది. దాంతో రాఘవ సంతోషంతో మందారాన్ని తీసుకొని సూర్య ప్రతాప్ ఇంటికి పరుగులు తీస్తూ అయ్యా గారు అని పిలుస్తాడు. దాంతో సూర్య ప్రతాప్ రూప వాళ్లు బయటకు వచ్చి మందారాన్ని చూసి షాక్ అయిపోతారు. దీంతో ప్రోమో ముగుస్తుంది." 

గతంలో సీఎం సూర్యప్రతాప్‌పై జీవన్, గౌతమ్ వాళ్లు సిటింగ్ ఎమ్మెల్యేలను కొని అవిశ్వాస తీర్మానం పెడతారు. ఆ కుట్రలో మందారం భర్త దీపక్, అత్త విజయాంబికకు భాగం ఉందని మందారం తెలుసుకొని వాళ్ల వెంట పడి గోవా తరలిస్తున్న ఎమ్మెల్యేలను దాచి పెట్టిన చోటు తెలుసుకుంటుంది. ఆ విషయాన్ని రాజు రూపలకు చెప్తే వాళ్లు అక్కడికి వెళ్తారు. అదే సమయంలో రాఘవని ఎక్కడ దాచిపెట్టారో కూడా తెలియడంతో రాఘవని పట్టుకుంటే తన తల్లిదండ్రులు కలుస్తారని రూప రాజుని రాఘవని తీసుకురమ్మని చెప్తుంది. రాజు వెళ్తూనే మందారానికి ప్రాణహాని ఉందని జాగ్రత్తగా చూసుకోమని రూపతో చెప్తాడు. అయితే ఎమ్మెల్యేలను తరలించకుండా ఆపమని మందారం రూపని పంపేస్తుంది.

రూప వెళ్లిపోయిన తర్వాత మందారాన్ని అత్త సమక్షంలో భర్త కత్తితో పొడిచి చంపేస్తాడు. తర్వాత రాజు రాఘవని తీసుకొని అక్కడికి వచ్చే సరికి మందారం చనిపోయి ఉంటుంది. రాఘవ కూడా మిస్ అయిపోతాడు. రాజు మందారం శవాన్ని తీసుకొని రూప ఇంటికి వచ్చి పెద్ద గొడవ చేస్తాడు. రూపే హంతకురాలు అని చెప్పి రూపని అసహ్యించుకొని తెగతెంపులు చేసుకొని మందారం బాడీ తీసుకొని వెళ్లిపోతాడు. ఆ దూరం పెరిగి ఏళ్లు గడిచినా రూప, రాజులు కలవరు. రూపకి బిడ్డ కూడా పుడతాడు. అయితే విజయాంబిక కుట్రతో ఆ బిడ్డని రౌడీలకు ఇచ్చి చంపేయమంటే రాజు తీసుకొని తన బిడ్డే అని తెలుసుకుంటాడు. రూప తన బిడ్డ చనిపోయాడని అనుకుంటుంది.

రాజు రూపనే తన బిడ్డని చంపేయమని చెప్పిందని రాజు తప్పుగా అర్థం చేసుకుంటాడు. తాజాగా రూప తన కొడుకు అయిన బంటీకి స్నేహితురాలు అవుతుంది. అయితే చనిపోయిందనుకున్న మందారం బతకడం సీరియల్ మీద ఆసక్తి పెంచుతోంది. మందారం బతికే ఉంటే ఆ రోజు రాజు తీసుకొచ్చిన శవం ఎవరిది? ఒక వేళ రాజు తీసుకొచ్చినప్పుడే మందారం కోమాలో ఉంటే మరి దహన సంస్కారాలకు తీసుకెళ్లడం ఏంటి? ఇప్పుడు మందారాన్ని రాఘవ కాపాడటం ఏంటి? ఇవన్నీ తెలియాలి అంటే సీరియల్ పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే. 

Also Read: అమ్మాయి గారు సీరియల్: రాజు, రోహిణిలకు పెళ్లైందని కుప్పకూలిపోయిన రూప.. మళ్లీ గొడవ అవుతుందా!