Rave Party in Konaseema District | న్యూ ఇయర్ వేడుకల్లో అశ్లీల నృత్యాలు... సొషల్ మీడియాలో వీడియోలు హ‌ల్‌చ‌ల్‌


మొన్న ఏలూరులో జనసేన పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు పుట్టినరోజు పేరున రేవ్ పార్టీ నిర్వహించడం దుమారం రేపింది. తాజాగా అంబేడ్క‌ర్ కోన‌సీమ జిల్లా మండపేటలో నూతన సంవత్సర వేడుకల పేరిట రేవ్‌ పార్టీ చేయడం కలకలం రేపుతోంది. మహిళల చేత అశ్లీలంగా నృత్యాలు చేయించారని ఆరోపణలు వస్తున్నాయి. పైగా భారీ లైటింగు డిజె సౌండ్లు పెట్టుకుని ఓ లేఔట్ లో చేసిన నృత్యాల వీడియోలు ఇప్ప‌డు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. అయితే ఇంత జ‌రిగినా పోలీసుల క‌ళ్ల‌కు ఈ దృశ్యాలు క‌నిపించ‌లేదా అంటూ విమ‌ర్శ‌లు వస్తున్నాయి.  


సోషల్ మీడియాలో వీడియోలు హల్చల్..
 కొంతమంది మహిళలతో అర్ధనగ్న డాన్సులు చేయిస్తూ వారి మధ్య మందు కొడుతూ సంబరాలు చేసుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. కొంత‌మంది పెద్దలు కూడా వారితో స్టెప్పులు వేస్తూ ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఈ వీడియోలు సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు  చేస్తున్న‌ట్ల తెలిసింది.  ఇంత బ‌హిరంగంగా మ‌హిళ‌ల‌తో అశ్వీల నృత్యాలు చేయిస్తే  పోలీసుల‌కు తెలియ‌దా అంటూ విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. వారి కను సన్నల్లోనే జరిగాయ‌న్న ఆరోప‌ణ‌లు గుప్పిస్తున్నారు.  


Also Read: Sajjala Ramakrishna Reddy: సజ్జల మళ్లీ ఇరుక్కున్నట్టేనా!- అటవీ భూముల ఆక్రమణ ఆరోపణలపై సర్కారు సీరియస్‌ 


ఒక అధికారి అన‌ధికార అనుమతులు ఇవ్వడంతో ఒంటి మీద బట్టలు లేకుండా  రెచ్చిపోయారని స్థానికులు చెప్పుకుంటున్నారు. ఇదిలా ఉంటే అన్నీ తానే గా వ్యవహారిస్తూ దొర అనే వ్య‌క్తి ఫుల్ జోష్ నింపారంటూ విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతుండ‌గా రేవ్‌ పార్టీలో ఉన్నవారిలో మేడిద పుల్లాజీ, ముత్తు, యర్రంశెట్టి సర్వేశ్, గురుమళ్ళ ఈశ్వరరావు, వేల్పూరు ముత్తు, దార్ల నాగు ఉన్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎక్కువ శాతం జనసేన పార్టీ కుర్రాళ్లు ఉన్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలాంటి వాటిపై ఏ చర్యలు తీసుకుంటారని చర్చ జరుగుతోంది.