Breaking News Live Telugu Updates: తెలంగాణలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ పర్యటన

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 15 Feb 2023 11:41 PM
తెలంగాణాలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ పర్యటన

రేపు తెలంగాణాలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ పర్యటన


ఇవాళ రాత్రి హైదరాబాద్ కు చేరుకోనున్న పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్.


సీఎం కేసీఆర్ తో కలిసి రేపు సిద్దిపేట జిల్లా సందర్శించనున్న పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్.


కొండపోచమ్మ సాగర్ తో పాటు కూడవెళ్లి వాగుపై నిర్మించిన చెక్ డాంలను పరిశీలించనున్న ఇద్దరు సీఎంలు.


సిద్దిపేట జిల్లాతోపాటు, గజ్వేల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల పరిశీలన.


ఏర్పాట్లు చేస్తున్న అధికారులు.

సీఎం కేసీఆర్ కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మరో లేఖ

సీఎం కేసీఆర్ కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మరో లేఖ


తెలంగాణలో విమానాశ్రయాల ఏర్పాటుకు సహకరించాలని విజ్ఞప్తి


అన్ని అనుమతులున్న ఆదిలాబాద్, జక్రాన్ పల్లి, వరంగల్ విమానాశ్రయాల నిర్మాణానికి ముందుకు రావాలని సూచన 


గతంలో విమానయాన శాఖ మంత్రి, లేఖ రాసినా, తాను లేఖ రాసినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదన్న  కేంద్రమంత్రి కిషన్ రెడ్డి


కేంద్రప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి

15 నెలల్లో 1110 పైగా చిన్నారులకు గుండె ఆపరేషన్: వైవీ.సుబ్బారెడ్డి

తిరుపతి : టిటిడి ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి మీడియా పాయింట్స్..


రాష్ట్రంలోనే తొలి సారిగా హార్ట్ ట్రాన్స్ ప్లాంటేషన్  శ్రీ పద్మావతి చిల్డ్రన్ హార్ట్ సెంటర్ డాక్టర్లు బృందం విజయవంతం అయ్యారు..


వారికి నా ప్రత్యేక అభినందనలు..


సీఎం జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా 2021 అక్టోబర్ 11 నాడు ఈ హాస్పిటల్ ప్రారంభించారు..


15 నెలలు కాలంలో 1110 పైగా చిన్నారులకు గుండె ఆపరేషన్ లు చేసి పునర్జన్మ ప్రసాదించారు..


గుండె సంబంధిత చిన్నారులకు పైసా ఖర్చు లేకుండనే ఆరోగ్య శ్రీ ద్వారా మెరుగైన వైద్యం ఇక్కడ అందిస్తున్నాం..


గుండె మార్పిడి చేయించుకున్న విశ్వేశ్వర్  అన్నమయ్య జిల్లా చిట్ వేలు మండలం కే. ఎస్.ఆర్ అగ్రహారం గ్రామానికి చెందిన వాడు..


పూర్తి స్థాయిలో కోలుకున్నాడు, వారం రోజుల్లో డిశ్చార్జి చేస్తారు..


తిరుపతి సీఎం జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా శ్రీ పద్మావతి  మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి 300 కోట్లతో నిర్మిస్తున్నాం..


ఇక్కడ హెలి లిఫ్టింగ్ అందుబాటులో విధంగా ఈ హాస్పిటల్ లో పైన హెలిప్యాడ్ నిర్మిస్తున్నాం..

సీఎం జగన్ కు సంక్షేమానికి, ఉచితాలకు తేడా తెలియదు: ఎంపీ లక్ష్మణ్

ఓబీసీ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎంపీ లక్ష్మణ్ అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. సేవాలాల్ జయంతి ఉత్సవాలలో పాల్గొన్న బీజేపీ నేత లక్ష్మణ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ రెడ్డికి సంక్షేమానికి, ఉచితాలకు తేడా తెలియకుండా పోవటంతో ఆంధ్రప్రదేశ్ సంపదను విచ్చలవిడిగా ఖర్చుచేస్తున్నారని ఆరోపించారు. నిన్నటి వరకు మూడు రాజధానుల గురించి మాట్లాడిన రాష్ట్ర ప్రభుత్వం నేడు విశాఖ మాత్రమే రాజధానిగా చెబుతున్నారని ప్రశ్నించారు.

పురానాపూల్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ఇంకా అదుపులోకి రాని మంటలు

హైదరాబాద్‌: కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని పురానాపూల్‌లో ఓ గోదాములో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని ఆరు ఫైరింజన్లతో మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ గోదాములో కూలర్ల తయారీకి సంబంధించిన సామగ్రి నిల్వ చేసినట్టు తెలుస్తోంది. ఎక్కువగా ప్లాస్టిక్‌ సామగ్రి ఉండటంతో దట్టమైన పొగతో పాటు మంటలు కూడా భారీగా ఎగసిపడుతున్నాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.

Kondagattu: కొండగట్టు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం, సీఎం పర్యటనకు కొద్ది దూరంలోనే

కొండగట్టు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు - లారీ ఢీకొని కండక్టర్‌ మృతి చెందగా ఎనిమిది మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిని హుటాహుటిన జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జగిత్యాల నుంచి వరంగల్‌ వెళుతున్న బస్సు  ప్రమాదానికి గురికాగా.. బస్సులో 8 మంది ప్రయాణికులు ఉన్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ రోజు సీఎం కేసీఆర్‌ కొండగట్టు పర్యటన ఉండగా, దానికి కొద్ది దూరంలోనే ఈ ప్రమాదం జరిగింది. మృతి చెందిన కండక్టర్ ను కొడిమ్యాల మండలం శ్రీరాములపల్లి కి చెందిన సత్తయ్యగా గుర్తించారు.

CM KCR in Kondagattu: కొండగట్టు అంజన్న దర్శించుకున్న సీఎం కేసీఆర్

సుప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయస్వామిని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు దర్శించుకున్నారు. బుధవారం జేఎన్టీయూ కళాశాలలో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్ నుండి ఆలయానికి వచ్చిన సీఎం కేసీఆర్ కు ఆలయ అధికారులు, పూజారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆంజనేయ స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. సీఎం వెంట మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు రవిశంకర్, సంజయ్, విద్యాసాగర్ రావు, దాసరి మనోహర్ రెడ్డి, కోరు కంటి చందర్ తోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు

YS Sharmila in Palakurthy: కల్లు గీతకార్మికులతో వైఎస్ షర్మిల, నీరా రుచి చూసి

  • నీరా రుచి చేసిన వైఎస్ షర్మిల 

  • పాలకుర్తి నియోజక వర్గంలో కొనసాగుతున్న వైఎస్ షర్మిల పాదయాత్ర

  • లక్ష్మీనారాయణ పురం స్టేజి వద్ద కల్లు గీత కార్మికుని కోరిక మేరకు నీరా రుచి చూసిన షర్మిల 

  • YSR తెలంగాణ పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే కల్లు గీత కార్మికులకు పెద్ద పీట వేస్తామని హామీ

Kuthuhalamma: తుది శ్వాస విడిచిన ఏపీ మాజీ మంత్రి గుమ్మడి కుతూహలమ్మ

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, మాజీ డిప్యూటీ స్పీకర్‌ గుమ్మడి కుతూహలమ్మ (73) తీవ్ర అస్వస్థతకు గురై బుధవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో కుతూహాలమ్మ బాధ పడుతున్నారు. వృత్తి రిత్యా వైద్యరాలైన కుతూహాలమ్మ చిత్తూరు జడ్పీ ఛైర్‌పర్సన్‌గా తన రాజకీయ అరంగేట్రం చేశారు. కుతూహాలమ్మ అనతికాలంలోనే ప్రజల మనస్సులను దోచుకున్న రాజకీయ నాయకురాలుగా పేరు పొందారు. అంతే కాకుండా తన రాజకీయ జీవితంలో ఎక్కువ కాలం కాంగ్రెస్‌లో పని చేసారు. ఇక  2014లో కాంగ్రెస్ పార్టిని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే కొన్ని అనివార్య కారణాలతో కుతూహాలమ్మ టిడిపి పార్టికి రాజీనామా సమర్పించారు. 1979లో కాంగ్రెస్ పార్టి ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన ఆమె చిత్తూరు జిల్లా యూత్ కాంగ్రెస్ కార్యకర్తగా పని చేశారు. 1980-85 సమయంలో చిత్తూరు  జిల్లా జెడ్పి ఛైర్మన్ గా, కో-ఆప్షన్ సభ్యురాలుగా పని చేసారు. అటుతర్వాత కుతూహలమ్మ 1985లో గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని వేపంజేరి నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. అటుతర్వాత కుతూహాలమ్మ అదే స్థానం నుంచి 1989, 1999, 2004లోనూ ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. దివంగత మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి హయాంలో వైద్యారోగ్యం, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా సేవలందించిన ఆమె, 2007లో ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సేవలందించారు. 1994లో కాంగ్రెస్‌ సీటు నిరాకరించడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2009లో జీడీనెల్లూరు ఎమ్మెల్యేగా కాంగ్రెస్‌ తరఫున గెలిచిన ఆమె, రాష్ట్ర విభజన తర్వాత 2014లో ఆమె తెదేపాలో చేరి జీడీనెల్లూరు నియోజకవర్గంలో నారాయణ స్వామికి ప్రత్యర్ధిగా పోటీ చేసి ఒటమిని చవి చూసారు. అటుతర్వాత రాజకీయాల నుండి పూర్తి స్ధాయిలో దూరంగా ఉంటూ వచ్చిన ఆమె తన చిన్న కుమారుడు హరికృష్ణను రాజకీయ ప్రవేశం చేయించారు.

Revanth Reddy Padayatra: తొమ్మిదవరోజు మొదలైన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర

  • తొమ్మిదవరోజు పాలకుర్తి నియోజక వర్గంలో మొదలైన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర

  • దేవరుప్పుల నుంచి ప్రారంభమైన యాత్ర

  • కొత్త కాలనీ, దేవరుప్పుల తండా, ధర్మపురం, మాల్యా తండా, మైలారం మీదుగా మధ్యాహ్నం 1 గంటకు లంచ్ పాయింట్ విసునూరు చేరుకోనున్న యాత్ర

  • భోజన విరామం అనంతరం విసునూరు నుంచి కాపులగడ్డ తండా మీదుగా పాలకుర్తి రాజీవ్ గాంధీ చౌరస్తా వరకు సాగనున్న యాత్ర

  • పాలకుర్తి రాజీవ్ గాంధీ చౌరస్తాలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్

Background

ఉత్తర భారతం నుంచి వస్తున్న పొడి గాలుల ప్రభావంతో తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం లేదని తెలిపారు. ఉత్తర వాయువ్య దిశ నుంచి వస్తున్న పొడిగాలుల వల్ల పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని అంచనా వేశారు. వచ్చే మూడు రోజులు రాత్రి వేళ ఉష్ణోగ్రతలు తగ్గడంతో పాటు పగటిపూట వేడి పెరుగుతుందని అంచనా వేశారు. 


నేడు తెలంగాణలో సగానికిపైగా జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ విభాగం ఎల్లో అలర్ట్ అలర్ట్ జారీ చేసింది. ఇక గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో పొడి వాతావరణం ఉంటుండగా, అదే కొనసాగుతుందని రెండు రాష్ట్రాల వాతావరణ కేంద్రాల అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌తో పోల్చుకుంటే తెలంగాణలో చలి తీవ్రత కాస్త ఎక్కువగా ఉండబోతుంది.


కొన్ని ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రత 2 - 4 డిగ్రీలు: ఐఎండీ
తెలంగాణలో చలి నేడు రేపు 2 నుంచి 4 డిగ్రీల మధ్యలో కూడా కొన్ని ప్రాంతాల్లో నమోదవుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో నేడు 2 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సాధారణంగా 5 నుంచి 10 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందనిపిస్తే వాతావరణ విభాగం ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేస్తుంది. 11 నుంచి 15 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంటే ఎల్లో అలెర్ట్ జారీ చేస్తుంటారు. రాబోయే ఐదు రోజులకు సంబంధించి తెలంగాణ వాతావరణ విభాగం నమోదు కానున్న ఉష్ణోగ్రతల అంచనాలను వెదర్ బులెటిన్‌లో వివరించింది.


హైదరాబాద్ లో ఇలా
‘‘ఆకాశం నిర్మలంగా ఉంటుంది. నగరంలో పొగ మంచు ఉదయం సమయంలో ఏర్పడుతుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 33 డిగ్రీలు, 15 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఈశాన్య దిశ నుంచి గాలులు గాలి వేగం గంటకు 4 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 32.8 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 15.1 డిగ్రీలుగా నమోదైంది.









 


ఏపీలో ఇలా
ఆంధ్రప్రదేశ్‌ వాతావరణ విభాగం తెలిపిన వివరాల మేరకు ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపోస్ఫిరిక్ స్థాయిల్లో ఈశాన్య, తూర్పు దిశలలో గాలులు వీస్తున్నాయని వెదర్ బులెటిన్ లో పేర్కొన్నారు.


ఈ వాతావరణ పరిస్థితుల వల్ల ఏపీలోని ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటనలో తెలిపింది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో కూడా పొడి వాతావరణమే ఉండనుంది. రాయలసీమలో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉండనుంది.


ఇక క్రమంగా ఎండాకాలం
‘‘తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఎండలు బాగా పెరగనున్నాయి. మరో మూడు రోజుల వ్యవధిలో ఉభయ గోదావరి జిల్లాలు, ఖమ్మం, భద్రాద్రి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వేడి 38 డిగ్రీల వరకు ఉండనుంది. ఇందులో విజయవాడ​, ఏలూరు, రాజమండ్రి ఉండటం వలన నగర వాసులు తగినంత నీటిని తాగుతూ జాగ్రత్త పడగలరు. మరోవైపున రాయలసీమ​, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల​, కొనసీమ​, విశాఖ, అనకాపల్లి, కాకినాడ​, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో వేడితో పాటు ఉక్కపోత కూడ ఉండనుంది. కానీ రాత్రి, అర్ధరాత్రి, వేకువజామున మాత్రం చల్లగా ఉండనుంది. తెలంగాణ వ్యాప్తంగా చల్లగా, ముఖ్యంగా హైదరాబాదులో 11 నుంచి 15 డిగ్రీల మధ్యన రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు ఉండనున్నాయి’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.