Game Changer Pre Release Event Highlights: 'గేమ్ చేంజర్'తో బాక్సాఫీస్ బద్దలు కావాలి, చరణ్‌కు భారీ హిట్ రావాలి - ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్

Game Changer Pre Release Event LIVE Updates: ఏపీ డిప్యూటీ సీఎం అయ్యాక తొలిసారి పవన్ కళ్యాణ్ ఓ సినిమా వేడుకకు వస్తున్నారు. అదీ రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు. ఆ లైవ్ హైలైట్స్...

Satya Pulagam Last Updated: 04 Jan 2025 09:39 PM
ఏపీని చిన్నచూపు చూడకండి - దిల్ రాజుకు పవన్ సూచన

తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి దిల్ రాజుకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక సూచన చేశారు. తమ రాష్ట్రాన్ని చిన్నచూపు చూడవద్దని ఆయన కోరారు. రెండు రాష్ట్రాలలో చిత్ర పరిశ్రమల అభివృద్ధి చేయాలని తెలిపారు. చిత్ర సీమలో వివిధ శాఖలలో యువత నైపుణ్యం సాధించేలా ఏపీలో స్టంట్ స్కూల్స్ పెట్టాలని, రాజమౌళి త్రివిక్రమ్ లాంటి దిగ్గజ దర్శకులతో స్క్రీన్ ప్లే‌ - స్క్రిప్ట్ వాకింగ్ క్లాసులు తీసుకోవాలని, కీరవాణి - తమన్ వంటి సంగీత దర్శకులతో అవగాహన పెంపొందించాలని పవన్ కోరారు.

బాక్స్ ఆఫీస్ బద్దలు కావాలి, భారీ విజయం సాధించాలి - పవన్

'గేమ్ చేంజర్' సినిమాతో బాక్సాఫీస్ బద్దలు కావాలని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. తన సినిమాలకు‌ ఆ విధంగా చెప్పడం తనకు నచ్చదని, రామ్ చరణ్ సినిమా భారీ విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు.‌ 

కూటమి ప్రభుత్వానికి వివక్ష లేదు... మద్దతు తెలపని వారికి రేట్లు పెంచాం - పవన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి ఎవరి మీద వివక్ష లేదని పవన్ స్పష్టం చేశారు. తమ కూటమికి మద్దతు తెలపని హీరోల సినిమాలకు సైతం టికెట్ రేట్లు పెంచినట్లు ఆయన వివరించారు. చిత్రసీమను చిత్ర సీమగా మాత్రమే చూస్తామని, సినిమాల్లో రాజకీయాలను తీసుకురామని పవన్ కళ్యాణ్ సుస్పష్టంగా తెలిపారు. సీనియర్ ఎన్టీఆర్ తనకు వ్యతిరేకంగా సినిమాలు చేసిన కోటా శ్రీనివాసరావు, ఘట్టమనేని కృష్ణతో చక్కగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయని, ఆ విలువలను తాము కొనసాగిస్తున్నామని పవన్ తెలిపారు.

టికెట్ రేట్లు పెంచడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది - పవన్

సినిమా టికెట్ రేట్లు పెంచడం పట్ల చాలా మందిలో అపోహలు ఉన్నాయని, బ్లాక్ లో టికెట్టు కొని సినిమా చూడడం వల్ల అది ఎవరెవరి జేబుల్లోకి వెళుతుందో తెలియదని, టికెట్ రేటులో పెంచిన ప్రతి రూపాయి మీద ప్రభుత్వానికి 18 శాతం జీఎస్టీ రూపంలో ఆదాయం వస్తుందని పవన్ తెలిపారు. కోట్లకు కోట్ల రూపాయల నిర్మాణ వ్యయంతో సినిమాలో తీసే నిర్మాతలకు టికెట్ రేట్లు పెంచడం వల్ల కొంత సహాయం అందుతుందన్నారు.

హీరోల అందరికీ చరణ్ మిత్రుడు... అందరూ సినిమా చూడాలి - పవన్

మెగా అభిమానులు అని చెప్పడం తమకు ఇష్టం లేదని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రతి ఒక్క అభిమాని సినిమా చూడాలని, ఇవాళ ఇక్కడికి వచ్చిన వారిలో ఇతర హీరోల అభిమానులు కూడా ఉంటారని పవన్ పేర్కొన్నారు. హీరోలు అందరికీ చరణ్ మిత్రుడు అని, సినిమాను అందరూ చూడాలని పవన్ కోరారు.

జనసేనకు ఇంధనం దిల్ రాజు ఇచ్చిన డబ్బులే - పవన్

గేమ్ చేంజర్ చిత్ర నిర్మాత దిల్ రాజు గురించి ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ కళ్యాణ్ గొప్పగా చెప్పారు. తనకు మార్కెట్ ఉందో లేదో తెలియని సమయంలో వకీల్ సాబ్ సినిమా దిల్ రాజు ప్రొడ్యూస్ చేశారని, తన దగ్గర పేరు తప్ప డబ్బులు సమయంలో జనసేన పార్టీని నడపడానికి అవసరమైన డబ్బులు దిల్ రాజు సినిమా చేయడం వల్ల వచ్చాయని పవన్ తెలిపారు. ఆ సమయంలో జనసేనకు ఇంధనం దిల్ రాజు ఇచ్చిన డబ్బులేనని పవన్ గుర్తు చేశారు.

శంకర్ సినిమా టికెట్లు బ్లాక్ లో కొనుక్కుని చూశా - పవన్

శంకర్ దర్శకత్వంలో వచ్చిన ప్రేమికుడు సినిమా చూడడానికి తనకు ఎవరూ తోడు లేకపోతే అమ్మమ్మను తీసుకువెళ్లాలని పవన్ తెలిపారు. తాను నటుడు కావాలని అనుకోని సమయంలో, అసలు సినిమాలలో అడుగులు వేస్తానని ఊహించన తరుణంలో శంకర్ తీసిన జెంటిల్మెన్ సినిమాను బ్లాక్ లో టికెట్ కొనుక్కుని మరీ చూశానని పవన్ కళ్యాణ్ తెలిపారు.

ఒక తల్లి కడుపున జన్మించకపోయినా చరణ్ నాకు తమ్ముడు - పవన్

తాను ఇంటర్ చదువుతున్న సమయంలో అన్నయ్య చిరంజీవి గారికి అబ్బాయి జన్మించారనే విషయం తెలిసిందని పవన్ చెప్పుకొచ్చారు. చిరంజీవి తనకు పితృ సమానులు అని, తన వదిన సురేఖ మాతృమూర్తి అని, చరణ్ తనకు తమ్ముడితో సమానమని పవన్ తెలిపారు.

తండ్రి మెగాస్టార్ అయితే తనయుడు గ్లోబల్ స్టార్ కాకుండా ఏమవుతాడు - పవన్

గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ వేడుకలో అన్నయ్య మెగాస్టార్ చిరంజీవిని పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు. తన ఇంట్లో ప్రతి ఒక్కరు వినయ విధేయతలతో ఉండడం గనుక చిరంజీవి గారి కృషి ఎంతో ఉందని చెప్పుకొచ్చారు. అన్నయ్య ఎంతో కష్టపడి ఉన్నత స్థాయికి వచ్చారని చెప్పారు. రామ్ చరణ్ కూడా చిన్న వయసు నుంచి ఎంతో కష్టపడ్డారని ఆయన వివరించారు. తనకు బాగా గుర్తు అని, తమ్ముడు సినిమాలో హీరోలా సోఫాలో తాను నిద్రిస్తే, ఏడేళ్ల వయసులో హార్స్ రైడింగ్ నేర్చుకోవడం కోసం చరణ్ ఉదయాన్నే లేచి వెళ్లేవాడని పవన్ గుర్తు చేశారు. తండ్రి మెగాస్టార్ అయితే తనయుడు గ్లోబల్ స్టార్ కాకుండా ఏమవుతారని పవన్ చెప్పారు.

రామ్ చరణ్ పేరు మా నాన్నగారు పెట్టారు - పవన్ కళ్యాణ్

''రామ్ చరణ్ అనే పేరు మా నాన్నగారు పెట్టారు. మా ఇంటి దైవం హనుమంతుడు. రాముడి పాదాల దగ్గర... అంటే చరణాల దగ్గర ఉండేది హనుమంతుడు గనుక ఆ పేరు పెట్టారు. పేరుకు తగ్గట్టు చరణ్ వినయ విధేయతలతో ఉంటాడు'' అని పవన్ కళ్యాణ్ అన్నారు.

పవన్ కళ్యాణ్ ని చూసి రాసిన క్యారెక్టర్ చేశా - రామ్ చరణ్

''సినిమా పేరు గేమ్ చేంజర్. శంకర్ గారు ఆ పేరు ఎందుకు పెట్టారో తెలియదు. ఈ సినిమాలో నేను చేసినది గేమ్ ఛేంజింగ్ రోల్ కావచ్చు. కానీ, ఇప్పుడు ఏపీలో కాదు, ఇండియన్ పాలిటిక్స్ కి ఉన్న ఏకైక నంబర్ వన్ గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తి పక్కన నిలబడటం నా అదృష్టంగా భావిస్తున్నాను. జనాల కోసం ఇంత తపనపడే, ఆలోచించే వ్యక్తి పక్కన ఉన్నందుకు, అదే కుటుంబంలో జన్మించినందుకు సంతోషంగా, అదృష్టంగా ఉంది. శంకర్ గారు ఈ క్యారెక్టర్ ఎవరిని చూసి రాశారో మీ అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని చూసి రాసిన క్యారెక్టర్'' అని రామ్ చరణ్ చెప్పారు.  

రామ్ చరణ్ నటించలేదు... సహజంగా చేశారు - దర్శకుడు శంకర్

రామ్ చరణ్ సినిమాలో నటించలేదని, ఆయన చాలా సహజంగా చేశారని శంకర్ చెప్పారు. కలెక్టర్ క్యారెక్టర్ బ్యాక్ స్టోరీ ఉంటుందని ఆయన వివరించారు. సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికీ ఆయన థాంక్స్ చెప్పారు. 

తెలుగు ప్రజలకు నేను ఇచ్చే గౌరవం 'గేమ్ చేంజర్' - దర్శకుడు శంకర్

''నేను 30 ఏళ్ళల్లో 14 సినిమాలు చేశారు. అందులో ఒక్క స్ట్రెయిట్ తెలుగు సినిమా లేదు. కానీ, ఆ సినిమాలు అన్నిటికీ తెలుగు ప్రేక్షకులు మంచి ఆదరణ ఇచ్చారు. నేను తెలుగు ప్రజలకు గౌరవం ఇవ్వడం కోసం స్ట్రెయిట్ తెలుగు సినిమా చేయాలని చాలా రోజుల ఎదురు చూస్తున్నా. అది 'గేమ్ చేంజర్'తో నెరవేరింది. ఇది స్ట్రెయిట్ తెలుగు సినిమా. ఒక కలెక్టర్, మంత్రికి మధ్య జరిగే యుద్ధమే సినిమా. ఇందులో తెలుగు కల్చర్ ఫుల్లుగా ఉంటుంది'' అని దర్శకుడు శంకర్ చెప్పారు. 

తెలుగు రాష్ట్రాల్లో జరిగిన అంశాలు సినిమాలో ఉన్నాయి - 'దిల్' రాజు

రామ్ చరణ్ జాతీయ అవార్డు వచ్చే స్థాయి పెర్ఫార్మన్స్ కనబరిచారని నిర్మాత దిల్ రాజు చెప్పారు. 'గేమ్ చేంజర్' సినిమాలో తెలుగు రాష్ట్రాల్లో జరిగిన పరిణామాలు ఎన్నో ఉన్నాయని ఆయన వివరించారు. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారు రావడం ఎంతో సంతోషంగా ఉందని, టికెట్ రేట్లు పెంచడంలో తమకు కళ్యాణ్ గారు, దుర్గేష్ గారు ఎంతో సపోర్ట్ చేశారని దిల్ రాజు చెప్పారు. 

కూటమి ప్రభుత్వం రావడానికి పాత్రధారి, సూత్రధారి పవన్ - మంత్రి కందుల దుర్గేష్

పేదవాడి కంటతడి రాకుండా చూడటమే ధ్యేయంగా పని చేస్తున్న నాయకుడు, ఏపీలో కూటమి ప్రభుత్వం రావడంలో కృషి చేసిన పాత్రధారి, సూత్రధారి పవన్ కళ్యాణ్ అని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఏపీలో చిత్రసీమలో అభివృద్ధికి ప్రత్యేక పాలసీ తీసుకు రావడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన వివరించారు. 

పవన్ కళ్యాణ్ నా థాట్ ప్రాసెస్ మార్చారు - ఎస్.జె. సూర్య

తన థాట్ ప్రాసెస్ మార్చిన ఇద్దరు వ్యక్తులు ఏఆర్ రెహమాన్, పవన్ కళ్యాణ్ అని ఎస్.జె, సూర్య చెప్పారు. ఆయన మాట్లాడుతూ ''నేను 'ఖుషి' కథ చెప్పినప్పుడు అందులో 'ఏ మే రాజహ' సాంగ్ యాడ్ చేశారు. ఇప్పటికీ ఆయన రాజ్యం ఇది. చాలా ఏళ్లుగా ఆయన్ను చూశా. ఒక ఒక విజన్ ఉన్న మనిషి. ఇచ్చిన మాటకు కట్టుబడిన వ్యక్తి. పదవి కోసమో, మరొక దాని కోసమో రాలేదు. ప్రజల కోసం ఆయన రాజకీయాల్లోకి వచ్చారు'' అని చెప్పారు.

చరిత్రలో నిలిచే ఈవెంట్... పవన్ గారు రావడం స్పెషల్

'గేమ్ చేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌ చరిత్రలో నిలిచిపోతుందని దర్శకుడు, నటుడు ఎస్.జె. సూర్య చెప్పారు. పవన్ కళ్యాణ్ రావడంతో ఈ ఈవెంట్ స్పెషల్ అని ఆయన చెప్పారు. చాలా రోజుల తర్వాత తన స్నేహితుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని చూశానని, ఇప్పుడు తనకు మాటలు రావడం లేదని సూర్య చెప్పారు.

'గేమ్ చేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పవన్ కళ్యాణ్ వచ్చేశారు

ఏపీ ఉప సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'గేమ్ చేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చేశారు. వైట్ అండ్ వైట్ డ్రస్ వేశారు.



కొండ దేవర... స్టేజి మీద సాంగ్ లైవ్ పెర్ఫార్మెన్స్

'గేమ్ చేంజర్' సినిమాలో కాసర్ల శ్యామ్ రాసిన 'కొండ దేవర...' పాటను ప్రీ రిలీజ్ ఈవెంట్ లో లైవ్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు తమన్. దీనిని శ్రావణ భార్గవి పాడారు. ఇది ఫ్లాష్ బ్యాక్ సాంగ్ అని తమన్ తెలిపారు.



రామ్ చరణ్ లుక్కు... కిర్రాకు

రామ్ చరణ్ ఇటీవల ఎక్కువగా బ్లాక్ కలర్ డ్రస్ లో కనిపించారు. స్వామి మాలధారణలో ఉన్నప్పుడు బ్లాక్ డ్రస్ వేస్తారు. ఆ తర్వాత కూడా ఆయన ఎక్కువగా బ్లాక్ వేశారు. కానీ, ఇప్పుడు స్టైల్ మార్చారు. 'గేమ్ చేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ లుక్కులో సందడి చేశారు.

భార్యతో కలిసి వచ్చిన దర్శకుడు శంకర్

'గేమ్ చేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ దగ్గరకు భార్యతో కలిసి వచ్చారు దర్శకుడు శంకర్


బొబ్బిలి మోపిదేవి వచ్చేశారు... అదేనండీ సూర్య!

'గేమ్ చేంజర్' సినిమాలో బొబ్బిలి మోపిదేవి పాత్రలో ఎస్.జె. సూర్య నటించారు. ఈ ఈవెంట్ లో ఆయన ఈ లుక్ లో సందడి చేయనున్నారు.

సినిమాలో నా పేరు, మా అమ్మ పేరు ఒక్కటే - అంజలి

'గేమ్ చేంజర్' సినిమాలో తన క్యారెక్టర్ పేరు పార్వతి అని, తన తల్లి పేరు కూడా అదేనని అంజలి తెలిపారు. ఆడియో లాంచ్ లేదా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ విషయం చెప్పాలని ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నానని అంజలి చెప్పారు.

రాజమండ్రిలో ఈవెంట్ చేస్తే వచ్చే కిక్ వేరప్పా - అంజలి 

''గేమ్ చేంజర్' కోసం చాలా ఈవెంట్స్ చేశాం. అయితే, రాజమండ్రిలో ఈవెంట్ చేస్తే వచ్చే ఆ కిక్ వేరప్పా. నేను ఇక్కడి నుంచి వెళ్లి యాక్టర్ అయ్యి, తిరిగి ఇక్కడికి వచ్చి 'గేమ్ చేంజర్'లో మంచి రోల్ చేయడం చాలా హ్యాపీగా ఉంది'' అని అంజలి అన్నారు. పవన్ కళ్యాణ్ గారు అంటే తనకు ఎంతో గౌరవం అని, ఆయనతో కలిసి 'వకీల్ సాబ్' సినిమాలో యాక్ట్ చేశానని, అప్పటికి ఇప్పటికి ఆయన ఎంతో ఎత్తుకు ఎదిగారని, ఆయనకు మరిన్ని విజయాలు రావాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. 

'గేమ్ చేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో శ్రీకాంత్

శతాధిక చిత్ర కథానాయకుడు, సీనియర్ హీరో శ్రీకాంత్ 'గేమ్ చేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ దగ్గరకు చేరుకున్నారు. ఆయనతో పాటు అంజలి, నటుడు నవీన్ చంద్ర ఒక వరుసలో కూర్చుకున్నారు.   

నిర్మాత 'దిల్' రాజును చూశారా?

'గేమ్ చేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత దిల్ రాజు

శంకర్ దర్శకత్వంలో చిరంజీవి, పవన్ నటించినట్టు - సాయి మాధవ్ బుర్రా

శంకర్ దర్శకత్వంలో చిరంజీవి గారు నటిస్తే చూడాలని తనకు ఒక కల ఉండేదని రచయిత సాయి మాధవ్ బుర్రా చెప్పారు. అయితే... 'గేమ్ చేంజర్' చూసిన తర్వాత శంకర్ దర్శకత్వంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ కలిసి నటించినట్టు ఉందని ఆయన చెప్పారు. డ్యూయల్ రోల్ లో రామ్ చరణ్ అద్భుతంగా నటించారని ఆయన చెప్పారు. 

గోదావరి పక్కకు సముద్రం వచ్చింది - అనంత శ్రీరామ్

లిరిక్ రైటర్ అనంత శ్రీరామ్ మాట్లాడుతూ... ''గోదావరి సముద్రంలో కలుస్తుందని తెలుసు. కానీ, గోదావరి పక్కకు సముద్రం వస్తుందని అభిమానుల్ని చూస్తే తెలిసింది. 'రంగస్థలం'లో 'ఆ గట్టున ఉంటావా, ఈ గట్టున ఉంటావా' అని రామ్ చరణ్ పాడారు. కానీ, ఈ రోజు ఆ గట్టున ఈ గట్టున చరణ్ బాబాయ్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. సినిమాకు వస్తే అందరి అంచనాలు మించి ఉంటుంది. ఇవాళ రాజమండ్రిలో పండగ వాతావరణం నెలకొంది. జనవరి 10న థియేటర్లలో పెద్ద పండగ వస్తుంది'' అని అన్నారు. 

ఈవెంట్‌కు వచ్చేసిన అంజలి... చీరలో చక్కగా ఉంది కదూ!

సినిమాలో ఒక కథానాయికగా నటించిన తెలుగు అమ్మాయి అంజలి. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ వరకు ఆమె కనిపించనున్నారు. ఈవెంట్ దగ్గరకు ఆవిడ ఆల్రెడీ వచ్చారు. చీరలో చక్కగా ఉన్నారు.

ఎన్నికలకు ముందు వస్తే... ఆ 11 వచ్చేవి కావు - పృథ్వీ

'గేమ్ చేంజర్'లో తానూ ఒక క్యారెక్టర్ చేసినట్లు పృథ్వీ చెప్పారు. ఎస్.జె. సూర్య పక్కన తన క్యారెక్టర్ ఉంటుందని చెప్పారు. 'గేమ్ చేంజర్' విడుదలైన తర్వాత ఏపీలో చాలా మార్పులు వస్తాయని ఆయన తెలిపారు. ఎన్నికలకు ముందు గనుక 'గేమ్ చేంజర్' వస్తే... ఆ పదకొండు సీట్లు (వైసీపీని ఉద్దేశిస్తూ) కూడా వచ్చేవి కాదని పృథ్వీ వ్యాఖ్యానించారు. 

పవన్ కళ్యాణ్ మా దేవుడు... ఆయన గేమ్ చేంజర్

జనసేనాని పవన్ కళ్యాణ్ మా దేవుడు అని నటుడు పృథ్వీ చెప్పారు. ఏపీ పాలిటిక్స్ లో పవన్ గేమ్ చేంజర్ అన్నారు ఆయన. చంద్రబాబును కూడా గేమ్ చేంజర్ గా పేర్కొన్నారు. 

జనసేనకు జై కొట్టిన పృథ్వీ... జగన్ రెడ్డి ఇమిటేషన్

జనసేనకు జై కొట్టి తన స్పీచ్ స్టార్ట్ చేశారు నటుడు పృథ్వీ. అంతే కాదు... దానికి ముందు స్పీచ్ స్టార్ట్ చేసే ముందు ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మైక్ కొట్టినట్టు కొట్టి ఇమిటేషన్ చేశారు. ఇటీవల ఒక సినిమాలో అపోజిషన్ రోల్ చేశానని, అందులో 'ఇప్పుడు పవర్ లో లేము. 11 వచ్చాయి' అని సెటైర్ వేసినట్లు పృథ్వీ చెప్పారు. 

గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ ఇక్కడ చూడండి

రాజమండ్రిలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ మొదలు అయ్యింది. ఆ లైవ్ ఇక్కడ చూడండి. 


ముంబై నుంచి చార్టెడ్ ఫ్లైట్ లో రాజమండ్రి వచ్చిన చరణ్

ముంబైలో 'గేమ్ చేంజర్' ప్రెస్ మీట్ ముగిసిన తర్వాత రామ్ చరణ్ స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్ లో రాజమండ్రి వచ్చారు. ఆయనతో పాటు సినిమా టీం కూడా ఉన్నారు. 





ఐదు లక్షల మందితో 'గేమ్ చేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్

'గేమ్ చేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఐదు లక్షల మందికి పైగా అభిమానులు వచ్చే అవకాశం ఉందని చిరు ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ స్వామి నాయుడు చెప్పారు. ఎక్కువ మంది రావడం వల్ల కాస్త ఇబ్బంది అయినప్పటికీ... ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ చేస్తామని ఆయన తెలిపారు. ఏబీపీ దేశంతో ఆయన ఇంటర్వ్యూ ఇక్కడ చూడండి. 


'గేమ్ చేంజర్' కోసం వేమగిరిలో చేసిన ఏర్పాట్లు చూశారా?

'గేమ్ చేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం రాజమండ్రిలోని వేమగిరి వేదిక అయ్యింది. అక్కడ ఏర్పాట్లు ఎలా చేశారో ఏబీపీ దేశం గ్రౌండ్ రిపోర్టులో చూడండి. 


డిప్యూటీ సీఎం అయ్యాక తొలిసారి సినిమా ఈవెంట్‌కు పవన్

'గేమ్ చేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. అయితే... ఏపీ డిప్యూటీ సీఎం అయ్యాక పవన్ అటెండ్ అవుతున్న మొదటి సినిమా ఈవెంట్ ఇదే కావడం విశేషం. అబ్బాయ్ కోసం బాబాయ్ వస్తున్నారు. 


Also Read: 'గేమ్ చేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం పవన్ కళ్యాణ్‌ను కాకుండా తమిళ హీరోలను ఇన్వైట్ చేశారా? అసలు నిజం ఏమిటి?

రాజమండ్రిలో ఈవెంట్‌కు ముందు ముంబైలో

రాజమండ్రిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగడానికి కొన్ని గంటల ముందు... శనివారం ఉదయం ముంబైలో ప్రెస్ మీట్ నిర్వహించింది 'గేమ్ చేంజర్' టీమ్. రామ్ చరణ్ సహా ఎస్.జె. సూర్య, నిర్మాత 'దిల్' రాజు తదితరులు అందులో పాల్గొన్నారు.

Background

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా నటించిన పాన్ ఇండియా సినిమా 'గేమ్ చేంజర్' (Game Changer). 'ఆర్ఆర్ఆర్'తో ఆయన ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్లారు. అయితే... సోలో హీరోగా ఆయన ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆల్మోస్ట్ ఐదేళ్లు. అందుకని, 'గేమ్ చేంజర్' కోసం మెగా ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాజమండ్రిలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు జరిగాయి.


ముఖ్య అతిథిగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
'గేమ్ చేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ (Game Changer Pre Release Event) ముఖ్య అతిథి ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ను ఇన్వైట్ చేశారు. ఆయన కలిసేందుకు 'దిల్' రాజు ప్రత్యేకంగా ఏపీ వెళ్లారు. ఈ వేడుకకు ఆయన ఒక్కరే ముఖ్య అతిథి. ఈ విషయంలో సోషల్ మీడియాలో డిస్కషన్స్ చాలా జరుగుతున్నాయి. తమిళ హీరోలను ఆహ్వానించినట్టు ప్రచారం జరిగింది. అందులో నిజానిజాలు తెలుసుకోవడం కోసం కింద లింక్ క్లిక్ చేయండి.


Also Read: 'గేమ్ చేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం పవన్ కళ్యాణ్‌ను కాకుండా తమిళ హీరోలను ఇన్వైట్ చేశారా? అసలు నిజం ఏమిటి?


'గేమ్ చేంజర్'కు కియారా అడ్వాణీ డుమ్మా... నో హీరోయిన్!
ఇప్పటి వరకు జరిగిన 'గేమ్ చేంజర్' ప్రచార కార్యక్రమాలు చూస్తే... అసలు కియారా అద్వానీ (Kiara Advani) ఎక్కడా కనిపించలేదు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో నటించిన అంజలి మ్యాగ్జిమమ్ ఈవెంట్లలో సందడి చేశారు. సల్మాన్ ఖాన్ హోస్ట్ చేసిన 'బిగ్ బాస్ 18'లో రామ్ చరణ్, కియారా అడ్వాణీ పాల్గొన్నారు, అంతే. రాజమండ్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం కియారా రావడం లేదు. ఆవిడ ఎందుకు డుమ్మా కొట్టారు? ఆమె పీఆర్ టీం ఏం అంటోంది? అనేది తెలుసుకోవడం కోసం కింద లింక్ క్లిక్ చేయండి.


Also Read: కియారా అడ్వాణీ ఎందుకు రావడం లేదు? ముఖ్యంగా రాజమండ్రిలో 'గేమ్ చేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌ డుమ్మా కొట్టడానికి రీజన్ ఏమిటో తెలుసుకోండి


'గేమ్ చేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చేది ఎవరు? అంటే... సినిమాలో నటించిన వారిలో ఎస్.జె. సూర్య, శ్రీకాంత్, సునీల్ వంటి స్టార్స్ హాజరు కానున్నారు. నిర్మాత 'దిల్' రాజు, ఆయన సోదరుడు శిరీష్, దర్శకుడు శంకర్ తప్పకుండా హాజరు అవుతారు. సంగీత దర్శకుడు తమన్ ఏదైనా స్పెషల్ పెర్ఫార్మన్స్ ఇస్తారా? లేదా? అనేది చూడాలి. అంజలి మిస్ అయ్యే ఛాన్స్ లేదు. ఆవిడది రాజోలు. గోదావరి జిల్లా అమ్మాయి. రాజమండ్రికి దగ్గర ఊరు. పవన్ కళ్యాణ్ హీరోగా 'ఓజీ' తీస్తున్న దర్శకుడు సుజీత్ కూడా అటెండ్ అవుతున్నారు. ఆల్రెడీ మెగా ఫ్యాన్స్ అంతా రాజమండ్రి చేరుకున్నారు. భారీ ఎత్తున జన సైనికులు, మెగా అభిమానులు ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ చేస్తామని చెబుతున్నారు.


- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.