Breaking News Live Telugu Updates: విశాఖ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ముందు 180 పరుగుల లక్ష్యం ఉంచిన టీమిండియా

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 14 Jun 2022 08:21 PM
వరుసగా వికెట్లు కోల్పోయిన టీమిండియా

పది ఓవర్ల వరకు దూకుడుగా కనిపించిన టీమిండియా ఒక్కసారిగా చతికిల పడింది. విశాఖ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో పరుగులు రాబట్టే క్రమంలో వరుసుగా నాలుగు వికెట్లు కోల్పియింది. 97 పరుగుల వద్ద రుతురాజ్‌ వికెట్‌ పడింది. అక్కడ నుంచి ఇండియన్ బ్యాటర్లు ఏమాత్రం నిలదొక్కునే ప్రయత్నం చేయలేదు. పరుగులు కూడా రాబట్టుకోలేదు. సునాయాసమైన క్యాచ్‌లు ఇచ్చి పెవిలియన్ చేరారు.  

విశాఖ టీ20లో మ్యాచ్‌లో తొలి వికెట్ కోల్పోయిన భారత్

విశాఖలో జరుగుతున్న మూడో టీట్వంటి మ్యాచ్‌లో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. 57 పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్‌ మొదటి వికెట్‌గా వెనుదిరిగాడు. 97 పరుగుల వద్ద భారత్‌ తన మొదటి వికెట్‌ కోల్పోయింది. పది ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు ఒక వికెట్ నష్టానికి 97పరుగులు చేసింది. 

విశాఖ టీ20లో మ్యాచ్‌లో తొలి వికెట్ కోల్పోయిన భారత్

విశాఖలో జరుగుతున్న మూడో టీట్వంటి మ్యాచ్‌లో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. 57 పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్‌ మొదటి వికెట్‌గా వెనుదిరిగాడు. 97 పరుగుల వద్ద భారత్‌ తన మొదటి వికెట్‌ కోల్పోయింది. పది ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు ఒక వికెట్ నష్టానికి 97పరుగులు చేసింది. 

Supreme Court: సహజీవనంలో పుట్టిన బిడ్డలకు కూడా ఆస్తిలో హక్కు- సుప్రీంకోర్టు కీలక తీర్పు

చాలా కాలం పాటు సహజీవనం చేసే జంటకు పెళ్లైనట్టే భావించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. అలా సహజీవనం చేస్తున్నప్పుడు పుట్టిన పిల్లలకు వారసత్వ ఆస్తిలో హక్కు ఉంటుందని పేర్కొంది. కేరళ జంట కేసులో విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు ఈ తీర్పు చెప్పింది.

CM Jagan News: మన పథకాలు పక్క రాష్ట్రాలు ఫాలో అవుతున్నాయి - సీఎం జగన్

‘‘మన రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను చూసి పక్క రాష్ట్రాలు ఫాలో అవుతున్నాయి. కేంద్రం కూడా ఇక్కడి పథకాలను అధ్యయనం చేస్తోంది. ఇప్పటి వరకూ పంట బీమా కింద రూ.6,684 కోట్ల ను రైతులకు అందించాం. టీడీపీ ఐదేళ్లలో బీమా సొమ్ము కింద ఇచ్చింది రూ.3,411 మాత్రమే. 2021 ఖరీఫ్ లో నష్టపోయిన 15 లక్షల మంది రైతులకు రూ.2,977 కోట్ల ను అందించాం. మన పాలనలో రిజర్వాయర్లు, చెరువులు అన్నీ నిండుగా ఉన్నాయి.’’ అని వైఎస్ జగన్ మాట్లాడారు.

CM Jagan Speech: రైతుల కోసం మరో మంచి కార్యక్రమం

రైతుల కోసం ఈ రోజు మరో మంచి కార్యక్రమం జరుగుతోందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. 15.61లక్షల మంది రైతులకు రూ.2,977.92 కోట్లను అందిస్తున్నాం. ఒకప్పుడు అనంతపురం కరువు జిల్లా అని అన్నారు. ఇవాళ దేవుడి దయ వల్ల నీళ్లు కూడా పుష్కలంగా అందుబాటులోకి వచ్చాయని అన్నారు. గతంలో రైతులకు ఇస్తామన్న బీమా సొమ్మును చంద్రబాబు ఇవ్వకుండా పోయారని గుర్తు చేశారు. అప్పటికి ఇప్పటికీ మార్పును గమనించాలని కోరారు.

CM Jagan: శ్రీ సత్యసాయి జిల్లాలో సీఎం జగన్ పర్యటన

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీ సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లిలో పర్యటించనున్నారు. 2021 ఖరీఫ్‌ పంటల బీమా పరిహారాన్ని లబ్ధి దారుల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. అక్కడ జరుగుతున్న బహిరంగ సభలో మాట్లాడుతున్నారు.

Basar IIIT వద్ద ఉద్రిక్తత






నిర్మల్ జిల్లాలో ఉన్న బాసర ట్రిపుల్ ఐటీ వద్ద బీఎస్పీ నేతలు మంగళవారం ఉదయం ఆందోళన చేశారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని మెయిన్ గేటు వద్ద ధర్నాకు దిగారు. అయితే, బీఎస్పీ నేతలను లోపలికి అనుమతించేందుకు అధికారులు నిరాకరిస్తున్నారు. ట్రిపుల్ ఐటీని అస్తవ్యస్తంగా మార్చి విద్యార్థులను వేధిస్తున్నారని ఆందోళనకారులు ఆరోపణలు చేస్తున్నారు.





Shamshabad Fire Accident: శంషాబాద్‌లో అగ్ని ప్రమాదం

శంషాబాద్‌లో పెను ప్రమాదం తప్పింది. శంషాబాద్‌ పరిధిలోని రామాంజపూర్‌లో ఓ టింబర్‌ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున టింబర్‌ కంపెనీలో మంటలు చెలరేగాయి. క్రమంగా విస్తరించడంతో పెద్దఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ టింబర్‌ కంపెనీలో అగ్నిప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Telangana Covid Cases: తెలంగాణలో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు, నిన్న 126 మందికి కొవిడ్

తెలంగాణలో క్రమంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 13,015 మందికి కరోనా పరీక్షలు చేయగా, 126 మందికి పాజిటివ్‌ అని తేలింది. అత్యధికంగా హైదరాబాద్‌లో 75, రంగారెడ్డిలో 27 పాజిటివ్‌ కేసులను గుర్తించారు. భద్రాద్రి కొత్తగూడెం గద్వాల, ఖమ్మం, సిద్దిపేట, మంచిర్యాల, మెదక్‌, మేడ్చల్‌, నల్గొండ, సంగారెడ్డి, హన్మకొండ జిల్లాల్లో కూడా కొవిడ్ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,116కు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం 15,206 మంది కరోనా వ్యాక్సిన్స్ తీసుకున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటనలో వెల్లడించింది.

Background

ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు చాలా ఆలస్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించాయి. ఏపీలోని రాయలసీమలో పూర్తి స్థాయిలో విస్తరించిన రుతుపవనాలు తెలంగాణలో మహబూబ్‌నగర్‌లో సోమవారం ప్రవేశించగా.. మరికొన్ని గంటల్లో రాష్ట్రం మొత్తం వ్యాపించనున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. నైరుతి రుతుపవనాల రాకతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం కాస్త చల్లబడింది. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో సోమవారం రాత్రి నుంచి మంగళవారం వేకువజాము వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఎండలతో సతమతమవుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు భానుడి ప్రతాపం నుంచి ఉపశమనం లభించింది. ఈ నైరుతి రుతుప‌వ‌నాల ప్రభావంతో ఏపీ, తెలంగాణతో పాటు యానాంలో మరో మూడు రోజుల పాటు వ‌ర్ష సూచ‌న ఉన్నట్లు అధికారులు ప్రక‌టించారు. 


ఇవాళ ఏపీ, తెలంగాణలోని కొన్ని చోట్ల తేలిక‌పాటి నుంచి మోస్తరు వానలు పడతాయని అధికారులు తెలిపారు. చాలా చోట్ల మంగళ, బుధవారాల్లోనూ వానలు కురుస్తాయని అధికారులు అంచనా వేశారు. ఉత్తర అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలకు, కొంకణ్ లోని మిగిలిన ప్రాంతాల్లోకి, గుజరాత్ లోని కొన్ని ప్రాంతాలు, మరాఠ్వాడాలోని పలు ప్రాంతాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని మరికొన్ని ప్రాంతాలు, బంగాళాఖాతంలోని కొన్ని భాగాల్లోకి, మొత్తం ఉప హిమాలయన్ పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఝార్ఖండ్, బిహార్ లోని కొన్ని ప్రాంతాలలోకి నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈశాన్య బంగాళాఖాతం నుంచి నైరుతి బంగాళాఖాతం వరకు ఉన్న అల్పపీడన ద్రోణి ప్రస్తుతం ఈశాన్య బంగాళాఖాతం నుంచి బంగాళాఖాతం మధ్య ప్రాంతాల వరకు సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్లు, 5.8 కిలోమీటర్ల ఎత్తు మధ్యలో ఉంది. 


ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో ఇలా..
ఏపీలో పలు జిల్లాల్లో 40 డిగ్రీల వరకు పగటి ఉష్ణోగ్రతలు నమోదు కాగా, నైరుతి రుతుపవనాల ఆగమనంతో మొదలైన వర్షాలతో నిన్న రాత్రి ఉపశమనం కలిగింది. తొలకరి జల్లుల కోసం ఎదురుచూస్తున్న అన్నదాతలకు వాతావరణ కేంద్రం శుభవార్త అందించింది. నేటి నుంచి మూడు రోజులపాటు ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, యానాంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఆంధ్రప్రదేశ్, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో ఏపీలో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవనుండగా.. మరికొన్ని చోట్ల వేడి, ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడతారు. ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. 


దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
రాయలసీమలో పూర్తి స్తాయిలో వ్యాపిస్తున్న నైరుతి రుతుపవనాలు మరికొన్ని గంటల్లో రాష్ట్రం మొత్తం వ్యాపించే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు. ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కొన్ని చోట్ల వడగాలులు వీచే అవకాశం ఉంది. ఈ ప్రాంతాల్లో గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచనున్నాయి. సీమలోని ఉమ్మడి అనంతపురం, కర్నూలు, చిత్తూరు, కడప జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి.  దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయి. కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతాయని చల్లని వార్త చెప్పారు.


తెలంగాణలో వర్షాలు
నైరుతి రుతుపవనాల ఆగమనంతో తెలంగాణలో తొలకరి జల్లులు పడ్డాయి. గత ఏడాది జూన్ తొలి వారంలో వచ్చిన రుతుపవనాలు ఈ ఏడాది రెండో వారం తరువాత తెలంగాణలో ప్రవేశించాయి. హైదరాబాద్‌లో సోమవారం రాత్రి నుంచి మంగళవారం వరకు పలుచోట్ల భారీ వర్షం కురిసింది. నేటి నుంచి మరో మూడు, నాలుగు రోజుల వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. యాదాద్రి భువనగిరి, జనగామ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, మంచిర్యాల ,రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దమల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురుగాలులు వీస్తాయి. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.