Breaking News Live Telugu Updates: బీఆర్ఎస్ కు ఎందుకు ఓటేయాలి? సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ ప్రశ్నాస్త్రాలు

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 12 Feb 2023 10:48 PM
బీఆర్ఎస్ కు ఎందుకు ఓటేయాలి? సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ ప్రశ్నాస్త్రాలు

బీఆర్ఎస్ కు ఎందుకు ఓటేయాలి?... రూ.5 లక్షల కోట్ల అప్పు చేసినందుకా? కేంద్రం 2.4 లక్షల ఇండ్లు ఇచ్చినా కట్టనందుకు ఓటేయాలా? దళిత బంధుతో దళితులను మోసం చేసినందుకా? కేటాయించిన నిధుల్లో సగం కూడా ఖర్చు చేయనందుకు ఓటేయాలా? అని సీఎం కేసీఆర్ ను బండి సంజయ్ ప్రశ్నించారు. గిరిజన, బీసీలను మోసం చేసినందుకు ఓటేయాలా? ఇచ్చిన హామీలను అమలు చేయనందుకు ఓటేయాలా? మైనర్ బాలికలపై హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నందుకు ఓటేయాలా? పోడు భూములను పరిష్కరించకుండా బాలింతలని చూడకుండా జైలుకు పంపినందుకు ఓటేయాలా? ఇంటికో ఉద్యోగం ఇవ్వనందుకు ఓటేయాలా? పక్క రాష్ట్రం నీళ్లు దోచుకుపోతుంటే వాళ్లతో మిలాఖత్ అయినందుకు ఓటేయాలా? ఉద్యోగులకు జీతాలు సక్రమంగా ఇవ్వనందుకు ఓటేయాలా? రైతుల, నిరుద్యోగుల, ఇంటర్మీడియట్ విద్యార్థుల, ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నందుకు ఓటేయాలా? కరోనా వస్తే పారాసెట్మాల్ వేసుకోమన్నందుకు ఓటేయాలా? నీ ఖేల్ ఖతం దుకాణం బంద్ కాబోతోంది.


-  బీజేపీకి ఓటేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు.. బీజేపీకే ప్రజలు ఎందుకు ఓటేస్తారో తెలుసా?  150 దేశాలకు కరోనా వ్యాక్సిన్ ఎగుమతి చేసింది.  80 కోట్ల మందికి ఉచిత బియ్యం ఇస్తున్నం... 3 కోట్ల మందికి ఇండ్లు కట్టించినం... 30 కోట్ల మందికి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చినం. 11 కోట్ల మందికి టాయిలెట్లు కట్టించినం... లక్ష కోట్లతో తెలంగాణలో రోడ్లు వేసినం.. కేంద్రం ఇస్తున్న నిధులవల్లే పంచాయతీలు నడుస్తున్నయ్... తెలంగాణకు  కేంద్రం అన్ని విధాలా సహకరిస్తున్నందుకు ప్రజలు ఓట్లేసేందుకు సిద్ధంగా ఉన్నారు.


-  నీ మాటలు నమ్మడానికి జనం సిద్ధంగా లేరు. నీ పార్టీ నుండి తెలంగాణ పదాన్నే తీసేసిన నీతో ప్రజలకు బంధం తెగిపోయింది. నువ్వో పెద్ద డిఫాల్టర్ సీఎంవి. అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు చెప్పినందుకు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి.


-  80 వేల ఉద్యోగాల భర్తీకి రూ.5 వేల కోట్లు కావాలి. బడ్జెట్ లో వెయ్యి కోట్లు కేటాయిస్తవా? ఉద్యోగులకు నెలకు రూ.10 వేలతో సరిపెడతవా? నీ కొడుకు, కుటుంబం బాగుపడితే రాష్ట్రమంతా బాగుపడ్డట్లేనా?  గ్రీన్ కార్డులతో దావత్ చేసుకుంటున్నరా? అంతా ఐటీ వాళ్లే. పోయినోళ్లలో 80 శాతం తెలంగాణవాళ్లే.. 


-  నువ్వు నిజంగా ఉపాధి కల్పిస్తే...తెలంగాణ నుండి లక్షలాది మంది పొట్టకూటి కోసం గల్ఫ్ దేశాలకు ఎందుకు పోతున్నరు? పాలమూరు నుండి బొంబయికి ఎందుకు పెద్ద ఎత్తున వలసలు పోతున్నరు? నీ వేములవాడ ఎమ్మెల్యే జర్మనీకే వలస పోతుండు కదా? ఎందుకు? అని ప్రశ్నించారు.

తెలంగాణలో ఏ వర్గం కూడా  హ్యాపీగా లేరు.. ఎమ్మెల్యే ఈటల

తెలంగాణలో ఏ వర్గం కూడా  హ్యాపీగా లేరని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు.
ఉద్యోగులు సంతోషంగా ఉన్నారా? ఇప్పటి వరకు కూడ జీతాలు రాలేదు.
2.90 లక్షల బడ్జెట్ పెట్టినా 12 వతేదీ వరకు జీతాలు రాలేదు. 


సభలో సంఖ్యా బలంతో గంటలసేపు అధికార పార్టీ వారు మాట్లాడుతున్నారు. ప్రజలను మభ్య పెట్టి మాయ చేయాలని చూశారు.
ఎన్నికల సంవత్సరం కాబట్టి ఎన్నో మాటలు చెప్పారు. అయినా ప్రజలు నమ్మరు.
రుణమాఫీ అయ్యిందా..రైతులకు తెలియదా? 
తన వైఫల్యాలు కప్పి పుచ్చుకోవడానికి మోడీ మీద విమర్శలు చేశారు. 
మళ్ళీ దేశానికి ప్రధాని మోడీ నే. 
సగానికి పైగా సీఎం చెప్పిన లెక్కలు తప్పు.  
140 కోట్ల ప్రజలు గౌరవించే వ్యక్తి మోడీ అని ఈటల రాజేందర్ అన్నారు.


నేను పార్టీ మారలేదు, వాళ్లే నన్ను గెంటివేశారు. 
గెంటివేసిన వాళ్ళు మళ్లీ పిలిచినా పోను అని ఈటల రాజేందర్ అన్నారు. 


రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీ అధికారంలోకి వస్తుంది.
ఈటల చరిత్ర తెలిసిన వాళ్ళు నా గురించి తక్కువ ఆలోచన చేయలేదు..
 ఈటెల పార్టీ మారుతున్నారు అని, ys హయాంలో కూడా ఇలాగే ప్రచారం చేశారు. ఇవాళ సీఎం నా పేరు ప్రస్తావన చెప్పగానే పొంగిపోను..
నా మద చేసిన దాడి మరిచిపోను అని ఈటల రాజేందర్ అన్నారు..

BJP Office: బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం

  • నాంపల్లి లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం

  • బీజేపీ ఆఫీస్ ముట్టడికి యత్నించిన  ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు

  • అడ్డుకున్న బీజేపీ నాయకులు, కొద్ది సేపు ఉద్రిక్త వాతావరణం

  • ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రంలో అవినీతి పాలన కొనసాగిస్తూ సిబిఐ, ఈడితో అక్రమ కేసులు బనాయిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపణలు

  • ప్రధాని మోదీ అదానీ మెగా స్కామ్‌పై వివరణ ఇవ్వాలని ఆమ్ ఆద్మీ పార్టీ కోర్ కమిటీ సభ్యుడు సుధాకర్  డిమాండ్

  • మోదీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు

  • ఆందోళన చేస్తున్న వారిని అరెస్ట్ చేసి స్టేషన్ కి తరలించిన అబిడ్స్ పోలీసులు

Banda Prakash: శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ గా బండా ప్రకాశ్

శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ గా బండా ప్రకాష్ ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. బండా ప్రకాశ్ కు సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు. ఆయన్ను ఛైర్మన్ సీట్లో కూర్చొబెట్టారు. బండా ప్రకాశ్ విద్యార్థి నాయకుడిగా పేరు సంపాదించారని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. తక్కువ సమయంలోనే ఆయన విద్యాధికులుగా ఎదిగారని,  కేసీఆర్ అన్నారు. ఆయన సామాజిక వర్గం అయిన ముదిరాజ్ వర్గానికి కూడా బాగా పని చేశారని అన్నారు.

KTR On TS B Pass: టీఎస్ బీపాస్ ఎక్కడా లేదు - కేటీఆర్

టీఎస్‌ బీపాస్‌ దేశంలోనే ఎక్కడా లేదని మంత్రి కేటీఆర్‌ శాసనమండలిలో ఆదివారం అన్నారు. తమిళనాడు సీఎం కూడా దీన్ని మెచ్చుకున్నారని అన్నారు. 21 రోజుల్లోనే భవన నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నామని గుర్తు చేశారు. శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్‌ సమాధానం ఇచ్చారు. ఒకవేళ పర్మిషన్‌ రాకుంటే ఆటోమేటిక్‌గా ఇచ్చినట్టే పరిగణించాలని తెలిపారు. టీఎస్‌ బీ పాస్‌తో నిబంధనల మేరకే భవన నిర్మాణాలు ఉంటాయని అన్నారు. గృహ నిర్మాణ శాఖ రద్దుచేసి రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని అన్నారు. ప్రజల కోరిక మేరకు జీవో 111 స్థానంలో జీవో 69 తీసుకొచ్చామని తెలిపారు. హిమాయత్‌ సాగర్‌ కాలుష్యం కాకుండా చర్యలు చేపడతామని చెప్పారు.

Karimnagar Accident: కరీంనగర్ - వరంగల్ రహదారిపై ఘోర ప్రమాదం, 50 మీటర్లు ఈడ్చుకెళ్లిన టాటా ఏస్!

కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్ - వరంగల్ ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‎ను టాటా ఏస్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే చనిపోయాడు. బైక్ ఢీకొట్టిన అనంతరం టాటా ఏస్ వాహనం యువకుడిని 50 మీటర్ల వరకు ఈడ్చుకొని వెళ్లింది. దీంతో తీవ్రగాయాలైన యువకుడు వాహనం ఈడ్చుకెళ్లడంతో చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు శ్రీకాంత్ మిషన్ భగీరథలో పంపు ఆపరేటర్‎గా పోలీసులు గుర్తించారు.

Background

దక్షిణ బంగాళాఖాతంలో, శ్రీలంకకు దిగువన బలమైన మేఘాలు, తేమ గాలులు కేంద్రీక్రుతం అయ్యాయి. వీటివల్ల తెలుగు రాష్ట్రాలపై ఎలాంటి ప్రత్యేక ప్రభావం పడబోదని వాతావరణ నిపుణులు తెలిపారు. ఉత్తర భారతం నుంచి వస్తున్న పొడి గాలుల ప్రభావంతో తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం లేదని తెలిపారు. ఉత్తర వాయువ్య దిశ నుంచి వస్తున్న పొడిగాలుల వల్ల పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని అంచనా వేశారు. వచ్చే మూడు రోజులు రాత్రి వేళ ఉష్ణోగ్రతలు తగ్గడంతో పాటు పగటిపూట వేడి పెరుగుతుందని అంచనా వేశారు. 


నేడు తెలంగాణలో కొన్ని జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ విభాగం ఎల్లో అలర్ట్ అలర్ట్ జారీ చేసింది. ఇక గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో పొడి వాతావరణం ఉంటుండగా, అదే కొనసాగుతుందని రెండు రాష్ట్రాల వాతావరణ కేంద్రాల అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌తో పోల్చుకుంటే తెలంగాణలో చలి తీవ్రత కాస్త ఎక్కువగా ఉండబోతుంది.


కొద్ది రోజులుగా తెలంగాణలో చలి సాధారణంగా ఉండగా, ఇప్పుడు కాస్త పెరిగింది. రాష్ట్రంలో తెలంగాణలోని 7 జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ విభాగం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఎల్లుండి ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. సాధారణంగా 5 నుంచి 10 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందనిపిస్తే వాతావరణ విభాగం ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేస్తుంది. 11 నుంచి 15 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంటే ఎల్లో అలెర్ట్ జారీ చేస్తుంటారు. రాబోయే ఐదు రోజులకు సంబంధించి తెలంగాణ వాతావరణ విభాగం నమోదు కానున్న ఉష్ణోగ్రతల అంచనాలను వెదర్ బులెటిన్‌లో వివరించింది.


ఎల్లో అలర్ట్ ఈ 7 జిల్లాల్లో
ఆదిలాబాద్, కుమ్రుం భీమ్‌, మంచిర్యాల, నిర్మల్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. వచ్చే 5 రోజులు రాత్రిపూట చలి పెరుగుతుందని, పగటిపూట ఎండ కూడా పెరుగుతుందని వెదర్ బులెటిన్ లో వివరించారు. తెలంగాణ ప్రాంతంలో ఎలాంటి వర్ష సూచన లేదు.


ఇక ఆదిలాబాద్ లో గరిష్ణ ఉష్ణోగ్రత నమోదు అయింది. 36 డిగ్రీలు నమోదైనట్టు వాతావరణ విభాగం తెలిపింది. అత్యల్ప ఉష్ణోగ్రత పటాన్ చెరులో 11.2 డిగ్రీలు ఆదిలాబాద్‌లో నమోదైంది. ఇవాళ అత్యధిక ఉష్ణోగ్రత 30 డిగ్రీల కన్నా ఎక్కువగా ఉంటుందని, అత్యల్పం 15 డిగ్రీలుగా ఉంటుందని అంచనా అధికారులు వేసింది.


‘‘ఆకాశం పాక్షికంగా మేఘాలుపట్టి ఉంటుంది. నగరంలో పొగ మంచు ఉదయం సమయంలో ఏర్పడుతుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 34 డిగ్రీలు, 17 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఈశాన్య దిశ నుంచి గాలులు గాలి వేగం గంటకు 4 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 34.4 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 16.8 డిగ్రీలుగా నమోదైంది.


ఏపీలో ఇలా
ఆంధ్రప్రదేశ్‌ వాతావరణ విభాగం తెలిపిన వివరాల మేరకు ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపోస్ఫిరిక్ స్థాయిల్లో ఈశాన్య, తూర్పు దిశలలో గాలులు వీస్తున్నాయని వెదర్ బులెటిన్ లో పేర్కొన్నారు.


ఈ వాతావరణ పరిస్థితుల వల్ల ఏపీలోని ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటనలో తెలిపింది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో కూడా పొడి వాతావరణమే ఉండనుంది. రాయలసీమలో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉండనుంది.


ఇక క్రమంగా ఎండాకాలం
‘‘రాష్ట్రంలో వాతావరణం మళ్లీ మారనుంది. ఇక మెల్లగా చలి కాలం నుంచి ఎండా కాలానికి మారనుంది. సాధారణంగా ఫిబ్రవరి మొదటి రెండు వారాల్లో అంతగా ఎండ ఉండదు, కానీ ఈ సారి మాత్రం వేసవి కాలం కాస్త ముందుగా, మరింత జోరుగా మొదలవ్వనుంది. మరో ఐదు రోజుల వ్యవధిలో ఉష్ణోగ్రతలు 4-5 డిగ్రీలు రాష్ట్ర వ్యాప్తంగా పెరగనుంది. అనంతపురం నుంచి నెల్లూరు మధ్యలో, నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు ఉష్ణోగ్రతలు ఒక సారిగా వేడికానుంది. ఇప్పుడే 40 డిగ్రీలు రావు కానీ 37 డిగ్రీల వరకు పలు ప్రాంతాల్లో నమోదవ్వనుంది. ముఖ్యంగా విజయవాడ - గుంటూరు ప్రాంతం, అలాగే నంధ్యాల జిల్లాలో రాష్ట్రంలోని మిగిలిన భాగాలకంటే వేడిగా ఉండనుంది. మరోవైపున చలి కూడా ఉంటుంది. రాత్రి వేళల్లో చల్లగా ఉండే వాతావరణం ఉంటుంది.’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.