Nampally court granted regular bail to Allu Arjun: సంధ్యా ధియేటర్ తొక్కిసలాట కేసులో హీరో అల్లు అర్జున్ కు ఊరట లభించింది. నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. రూ. 50వేల రెండు పూచికత్తులు సమర్పించాలని ఆదేశించింది. ఇప్పటికే హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ పై అల్లు  అర్జున్ ఉన్నారు. విచారణకు సహకరించాలని కోర్టు ఆదేశించింది. 


బెయిల్‌ను వ్యతిరేకించని పోలీసులు                     


ఫుష్ప 2 ప్రీమియర్ సంందర్భంగా  సంధ్య థియేటర్ లో తొక్కిసలాట ఘటన జరిగింది. ఈ ఘటన తర్వాత చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ను ఏ11గా చేర్చుతూ కేసు నమోదు చేశారు. వారం రోజుల తర్వాత అరెస్టు చేశారు. అప్పటికే అల్లు అర్జున్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలుచేశారు. అరెస్టు చేసిన రోజునే  తెలంగాణ హైకోర్టు నాలుగువారాల మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో అల్లు అర్జున్ కు ఊరట లభించింది.  రెగ్యులర్ బెయిల్ కోసం దిగువ కోర్టులో పిటిషన్ వేసుకోవాలని సూచించింది. గత వారం అల్లు అర్జున్ తరపు లాయర్లు రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. వాదనలు కూడా పూర్తయిన తర్వాత తీర్పును రిజర్వ్ చేశారు. ఇవాళ ప్రకటించారు. 


ఊపిరి పీల్చుకున్న టాలీవుడ్               


పోలీసులు  అల్లు అర్జున్ బెయిల్ పై దాఖలు చేసిన అఫిడవిట్ లో  బెయిల్ ను వ్యతిరేకించలేదు.  ఒకవేళ బెయిల్ ఇస్తే మాత్రం విచారణకు సహకరించేలా ఆదేశాలు ఇవ్వాలని నాంపల్లి కోర్టును కోరారు. దీంతో అల్లు అర్జున్ కు బెయిల్ రావడం సులభంగా మారిందని న్యాయవర్గాలు చెబుతున్నాయి. అల్లు అర్జున్ కు రెగగ్యులర్ బెయిల్ లభించడంతో టాలీవుడ్ ఊపిరి పీల్చుకుంది. అయినప్పటికీ ఆయన ఒక రోజు రాత్రి చంచల్ గూడ జైల్లో గడిపారు. మళ్లీ జైలుకు వెళ్లాల్సివస్తే ఆయన తదుపరి చేయబోయే సినిమాలపై చాలా ఎఫెక్ట్ పడేదని.. అదే సమయంలో టాలీవుడ్ కూడా డిస్ట్రబ్ అయ్యేదన్న అభిప్రాయం వినిపించింది. 


ఇక వివాదం సద్దుమణిగినట్లే                     


అల్లు అర్జున్ వ్యవహారం టాలీవుడ్ లో సంచలనం సృష్టించింది. సినీ పరిశ్రమను ప్రభుత్వం టార్గెట్ చేస్తోందన్న ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో అల్లు అర్జున్ వ్యవహారశైలిపైనా విమర్శలు వచ్చాయి. అయితే తర్వాత సినీ ప్రముఖులంతా ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో సీఎంను కలవడంతో చాలా వరకూ సమస్యలు పరిష్కారమయ్యాయని భావిస్తున్నారు. సంధ్యా ధియేటర్ తొక్కిసలాటలో నష్టపోయిన కుటుంబానికి సినీ ఇండస్ట్రీ నుంచి భారీ సాయం అందింది. పుష్ప టీం రూ. రెండు కోట్ల వరకూ ఇచ్చింది.        



Also Read: Reels Contest: మీకు రీల్స్ చేసే అలవాటుందా? లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ పట్టేయండి - మరో బంపరాఫర్ సైతం