Breaking News Live Telugu Updates: హైదరాబాద్‌లో దారుణం, రద్దీ రోడ్డుపైనే మహిళపై పెట్రోల్ పోసి నిప్పు

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 11 Apr 2023 04:09 PM
Lakshmi Parvathi: నారా లోకేశ్ పాదయాత్రపై లక్ష్మీ పార్వతి సెటైర్లు

నారా లోకేష్ పాదయాత్రపై తెలుగు అకాడమీ ఛైర్మన్ ‌లక్ష్మీ పార్వతీ సెటైర్లు వేశారు.. మంగళవారం తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. లోకేష్ పాదయాత్ర రోజుకో కామెడీ అవుతుందని, ప్రతిపక్ష పార్టీ రోజు రోజుకు దిగజారి పోతుందని ఆమె విమర్శించారు.. అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏమి చేశారో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.. ఏమీ రాని దద్దమ్మ, ఒక్క చోట గెలవని వ్యక్తి సీఎం జగన్ ను విమర్శిస్తున్నారని ఆమె మండిపడ్డారు.. ప్రభుత్వ వైఫల్యాలను మీరు చెప్పలేని స్థితి, బూతులు తిట్టడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు.. అమరావతిలో ఇన్సైడర్ పేరుతో మోసాలు చేశారని, పోలవరం పేరుతో మీ ప్రభుత్వ హయాంలో మోసాలు చేశారని విమర్శించారు.. 98 శాతం ఇచ్చిన హామీలు అమలు చేసిన ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమే అని ఆమె చెప్పారు.

Tirupati News: తిరుపతిలో కేంద్రమంత్రి హార్దిప్ సింగ్ పూరి పర్యటన

శ్రీ పద్మావతి చిన్న పిల్లలు హాస్పిటల్, బర్డ్ హాస్పిటల్‌లో వైద్య సేవల్ని పరిశీలించిన కేంద్ర మంత్రి హర్ధిప్ సింగ్, టీటీడీ ఈవో ధర్మా రెడ్డి


శ్రీ పద్మావతి హృదయాలయంలో చిన్న పిల్లల ఆసుపత్రిలో అందుతున్న వైద్యంపై రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీని ప్రశంసించిన కేంద్ర మంత్రి హర్దిప్ సింగ్ పూరి


మోకాలు రీప్లేస్ మెంట్, ఆర్ధో సమస్యలపై మెరుగైన వైద్యం బర్డ్ హాస్పిటల్ లో అందిస్తున్నారు.


మరో ఏడాదిలోపు చిన్నారుల అస్ప్రత్రి అందుబాటులోకి రాబోతుంది. మరింత మెరుగ్గా వైద్య సేవలు


- హర్దిప్ సింగ్ పూరి, కేంద్రమంత్రి

Dharmapuri Sanjay: నిజామాబాద్ మాజీ మేయర్ ఇంటిపై వ్యక్తి దాడి

  • మాజీ మేయర్ సంజయ్ ఇంటిపై దాడికి పాల్పడ్డ సందీప్ వర్మ అలియాస్ చోర్ బబ్లూ

  • తెల్లవారు జామున 6 గంటలకు సంజయ్ ఇంటి గేటు వద్ద తన కారుతో హంగామా చేసిన చోర్ బబ్లూ

  • సిబ్బందిపై దాడికి పాల్పడ్డ సందీప్ వర్మ (అలియాస్ చోర్ ) బబ్లూ 

  • గతంలోనూ నిజామాబాద్ లో ప్రముఖుల ఇళ్లపై దాడికి పాల్పడిన వ్యక్తి 

  • పోలీసులకు సమాచారం ఇచ్చిన సిబ్బంది, పోలీసులు రావడంతో పరారీ 

  • మాజీ మేయర్ సంజయ్ ఇంటి వద్ద హంగామా చేసిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ 

  • హైదరాబాద్ పార్క్ హయత్ వద్ద బౌన్సర్ లపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన కేసులో అతను నేరస్థుడు 

  • నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి లోని నడిపల్లి లో సర్పంచ్ కారును పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన కేసులో నేరస్థుడిగా గుర్తింపు

Bhainsa Fake Notes: భైంసాలో నకిలీ నోట్ల కలకలం

నిర్మల్ జిల్లా భైంసాలో నకిలీ నోట్లు కలకలం రేపాయి. భైంసా పట్టణంలోని మార్కెట్ లో ఓ బాలుడు ప్రవీణ్ అనే కూరగాయల వ్యాపారి దగ్గర 500 రూపాయల నోటు ఇచ్చి 20 రూపాయల కూరగాయలు కొనుగోలు చేసి 480 రూపాయలు తీసుకెళ్ళాడు. అతడు మళ్ళీ కాసేపటికే మరో 500 రూపాయల నోటు తీసుకొని వచ్చి మళ్ళీ కూరగాయలు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. అయితే ఆ కురగాయాల వ్యాపారికి 500 రూపాయల నోటు పై అనుమానం వచ్చి బాలుడుని ప్రశ్నించే లోపు ఆ బాలుడు పరారయ్యాడు. ఆ బాలుడిచ్చిన 500 రూపాయల నోట్లపై అనుమానం వచ్చి కురగాయల వ్యాపారీ ప్రవీణ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు 500 రూపాయలను పరిశీలించి ఆరా తీస్తున్నారు.

Cricket Betting: అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు

  • అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు చేసిన సైబరాబాద్ పోలీసులు

  • IPL బెట్టింగ్ నిర్వహిస్తున్న కీలక వ్యక్తి అరెస్ట్

  • హైదరాబాద్ కేంద్రంగా IPL బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా

  • ల్యాప్ టాప్‌లతో పాటు భారీగా నగదు స్వాధీనం చేసుకున్న సైబరాబాద్ పోలీసులు

  • మరికాసేపట్లో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలు తెలపనున్న సైబరాబాద్ సీపీ

Indrakeeladri: ఇంద్రకీలాద్రి అమ్మవారికి అగ్గిపెట్టెలో పట్టే చీర బహూకరించిన తెలంగాణ భక్తుడు

ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గమ్మ వారికి తెలంగాణకు చెందిన భక్తుడు అగ్గిపెట్టెలో పట్టే పట్టు చీరను సమర్పించారు. బంగారం, వెండి, పట్టు దారాలతో కేవలం 100 గ్రాముల బరువు ఉండే విధంగా ఈ చీరను నేసినట్లు ఆయన తెలిపారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారికి తెలంగాణ రాష్ట్రం సిరిసిల్ల గ్రామానికి చెందిన భక్తుడు విజయ్ అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీరను సమర్పించారు. ఐదు గ్రాముల బంగారం 10 గ్రాముల వెండితో పూర్తి పట్టు దారాలతో కలబోసి నేసిన చీరను అగ్గిపెట్టె లో ఉంచి అధికారులకు అందజేశారు. ఈ చీరను 45 వేల రూపాయల వ్యయంతో 100 గ్రాముల బరువుతో రూపొందించినట్లు విజయ్ వివరించారు. ఆయనకు దేవస్థాన అధికారులు అమ్మవారి దర్శనం చేయించి, ప్రసాదాలు అందజేశారు. చేనేత కళ మరుగున పడిపోకూడదని అమ్మవారిని కోరుకున్నట్లు విజయ్ తెలిపారు.

YS Jagan Tour: రేపు సీఎం వైఎస్‌ జగన్‌ ప్రకాశం జిల్లా మార్కాపురం పర్యటన

వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం లబ్ధిదారుల ఖాతాల్లో సీఎం జగన్ రేపు నగదు జమ చేయనున్నారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 9.55 గంటలకు మార్కాపురం చేరుకుంటారు. 10.15 – 12.05 గంటలకు ఎస్‌వీకేపీ డిగ్రీ కాలేజ్‌ గ్రౌండ్స్‌లో బహిరంగ సభా వేదిక వద్ద వివిధ అభివృద్ది పనులకు శంకుస్ధాపనలు, బహిరంగ సభలో ప్రసంగం, అనంతరం ఈబీసీ నేస్తం లబ్ధిదారులకు నగదు జమచేయనున్న సీఎం, కార్యక్రమం అనంతరం 12.40 గంటలకు అక్కడినుంచి బయలుదేరి 1.35 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Hyderabad: హైదరాబాద్‌లో దారుణం, రద్దీ రోడ్డుపైనే మహిళపై పెట్రోల్ పోసి నిప్పు

హైదరాబాద్‌లో కిరాతకమైన ఘటన జరిగింది. రాజేంద్రనగర్ పరిధిలో ఓ మహిళపై పెట్రోల్ పోసి దుండగులు నిప్పు అంటించారు. అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 133 దగ్గర ఈ ఘటన జరిగింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Background

తూర్పు నుండి వీచే గాలులలో ఏర్పడిన ద్రోణి ఈరోజు ఉత్తర కేరళ నుండి అంతర్గత కర్నాటక మరియు మధ్య మహారాష్ట్ర మీదుగా విధర్భ వరకు సగటు సముద్ర మట్టంకి 0.9 కిలో మీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో, ఆగ్నేయం నుండి కింది స్థాయిలో గాలులు వీస్తున్నాయి.


తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ విశ్లేషణ, వాతావరణ హెచ్చరికలు: 
తెలంగాణ రాష్ట్రంలో తదుపరి మూడు రోజులు పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది. రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు  సాధారణం కంటే 2 నుండి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు పెరిగే అవకాశం ఉంది. 


Telangana Weather Warnings: వాతావరణ హెచ్చరికలు
నేడు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎలాంటి వాతావరణ హెచ్చరికలు జారీ చేయలేదు.


హైదరాబాద్ లో ఇలా
‘‘హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో సాయంత్రం లేదా రాత్రి సమయంలో ఉరుములతో కూడిన మేఘాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 36 డిగ్రీలు, 23 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఆగ్నేయ దిశ నుంచి గాలులు గంటకు 4 నుంచి 6 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 35.7 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 24 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 30 శాతం నమోదైంది.









 


ఏపీలో వర్షాలు ఇలా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (Andhra Pradesh State Disaster Management Authority-APSDMA) మంగళవారం 32 మండలాల్లో వేడిగాలులు వీస్తాయని హెచ్చరించింది. ముఖ్యంగా అనకాపల్లి, అల్లూరి, మన్యం, తూర్పుగోదావరి, ఏలూరు, కాకినాడ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌కు పైగా పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. 


అల్లూరి సీతారామరాజు జిల్లా ఏడు మండలాల్లో విపరీతమైన వేడిగాలులు వీస్తాయని, ఉష్ణోగ్రత కనిష్టంగా 44 డిగ్రీల సెల్సియస్‌ను తాకుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అనకాపల్లి జిల్లాలోని ఐదు మండలాలు, తూర్పుగోదావరిలోని రెండు మండలాలు, కాకినాడలోని ఆరు మండలాలు, పార్వతీపురం జిల్లాలోని ఆరు మండలాల్లో కూడా వడగాలులు వీస్తాయని అప్రమత్తం చేశారు.


ఢిల్లీలో వాతావరణం ఇలా


ఏప్రిల్ తొలినాళ్లలో మండుతున్న ఎండలు రానున్న రోజుల్లో మరింత మండుటెండలు ఉండొచ్చని సూచిస్తోంది. వాతావరణ శాఖ (IMD) ప్రకారం, రాబోయే వారంలో ఉష్ణోగ్రత 3-5 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉంది. మధ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఈశాన్య భారతదేశంలో తేలికపాటి వర్షం కనిపించినప్పటికీ ప్రజలు ఏప్రిల్ నెలలోనే మే వేడిని అనుభవించవచ్చు.


40°C కంటే ఎక్కువ ఉష్ణోగ్రత
దేశంలోని చాలా ప్రాంతాలు ఉక్కపోతతో, చెమటలతో అల్లాడిపోతున్నాయి. రాబోయే రోజుల్లో భారతదేశంలోని చాలా ప్రాంతాలు తేమతో కూడిన వేడిని ఎదుర్కోవలసి ఉంటుందని నమ్ముతారు. మధ్య భారతదేశం మరియు దాని పరిసర ప్రాంతాలలో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్ మరియు ఆగ్నేయ భారతదేశం వంటి తూర్పు భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో, పాదరసం 40 డిగ్రీల సెల్సియస్‌ను దాటవచ్చు.


ఒడిశా, బీహార్‌, జార్ఖండ్‌, గుజరాత్‌, గోవాలో 40 డిగ్రీల సెల్సియస్‌ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా. ఆంధ్రప్రదేశ్‌లో కూడా తీవ్రమైన వేడి ఏర్పడవచ్చు, తెలంగాణ మరియు మహారాష్ట్రలో కూడా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. అయితే, రాబోయే 2-3 రోజులలో ఈ ప్రాంతాల్లో హీట్ వేవ్ పరిస్థితులపై ఎటువంటి హెచ్చరిక జారీ చేయలేదు.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.