Breaking News Live Updates: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్ట్
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
Kakinada Youth Murder: ఏపీలో మరో దారుణం చోటుచేసుకుంది. పట్ట పగలే యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. అది కూడా పుట్టినరోజు నాడు ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని నింపింది. నిందితుడు ఓ యువకుడ్ని వేట కత్తితో నరికి హత్య చేశాడు. ఈ విషాదం కాకినాడ జిల్లా సామర్లకోటలో ఆదివారం మధ్యాహ్నం జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
సామర్లకోటకు చెందిన యువకుడు శివ పుట్టినరోజు నేడు. బర్త్ డే సందర్భంగా శివ మూవీ చూసేందుకు థియేటర్‌కు వెళ్లాడు. కొందరు గుర్తుతెలియని దుండగులు శివపై ఒక్కసారిగా కత్తులు, రాడ్లతో దాడికి పాల్పడ్డారు. కత్తితో నరకడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు శివ. నిందితుడ్ని మణి అని పోలీసులు గుర్తించినట్లు సమాచారం. వివాహేతర సంబంధమే కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.
JaggaReddy Arrest: ఏఐసీసీ నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మే 6,7వ తేదీల్లో తెలంగాణలో పర్యటించనున్నారు. రాహుల్ పర్యటనలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీలో సభ నిర్వహించాలని కాంగ్రెస్ నేతలు భావించారు. అయితే రాహుల్ సభతో పాటు ఎలాంటి సభలను ఓయూలో నిర్వహించడానికి అనుమతి ఇవ్వలేమని ఓయూ వీసీ, ఓయూ కమిటీ నిర్ణయం స్పష్టం చేసింది. దాంతో ఓయూ విద్యార్థులు మిస్టర్ క్వార్టర్స్‌ను ముట్టడించే ప్రయత్నం చేశారు. కొందరు ఓయూ విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేయగా.. వారిని పరామర్శించేందుకు కాంగ్రెస్ నేతలు వెళ్లారు. విద్యార్థులను పరామర్శించేందుకు వెళ్లిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Visakha Road Accident: విశాఖ ... గాజువాకలోని అగనంపూడి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆంజనేయస్వామి దేవాలయం దగ్గర కంటైనర్ ఢీకొనడంతో భార్యభర్తలు మృతిచెందారు. అనకాపల్లి నుండి గాజువాకకు పల్సర్ బైక్‌పై వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను కేజిహెచ్ కు తరలించారు.
హైదరాబాద్ నగర శివారులో దారుణం జరిగింది. ఓ యాచకురాలిపై ఐదుగురు యువకులు కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వారిలో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకోగా మరో నలుగురు పరారీలో ఉన్నారు. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గండి మైసమ్మ చౌరస్తాలో ఈ ఘటన జరిగింది.
Background
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్న వేళ వచ్చే మూడు రోజులు వానలు పడనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్, అమరావతిలోని వాతావరణ కేంద్రాలు విడివిడిగా ప్రకటనలు జారీ చేశాయి. అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం.. ఏపీలో వాతావరణం వచ్చే మూడు రోజులు ఇలా ఉండనుంది.
ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో నైరుతి గాలులు వీస్తున్నాయి. దక్షిణ అండమాన్ సముద్రం, పరిసరాల్లో మే 4వ తేదీ కల్లా ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తదుపరి 24 నాటికి అదే ప్రాంతంలో అల్ప పీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉంది. మళ్లీ ఇది తర్వాతి 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉంటుంది.
వీటి ప్రభావంతో ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం ప్రాంతాల్లో ఈ రోజు (మే 1), రేపు తేలికపాటి వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు, రేపు ఉరుములతో కూడిన మెరుపులు కొన్ని చోట్ల సంభవించే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తాంధ్రలో మాత్రం నేడు పొడిగా వాతావరణం ఉండే అవకాశం ఉంది. రేపు తేలికపాటి వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.
రాయలసీమ ప్రాంతంలో ఈ రోజు తేలికపాటి వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు, రేపు ఉరుములతో కూడిన మెరుపులు కూడా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.
Telangana Weather News తెలంగాణలో వాతావరణం ఇలా
ఇక తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం ప్రకటించింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కూడా పడతాయని అంచనా వేశారు. దీనికి సంబంధించి ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తెలంగాణలో ఆదిలాబాద్, కొమురం భీం - ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లా్ల్లో ఒకటి రెండుప్రదేశాల్లో మాత్రం వడగాడ్పులు వీచే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు.
- - - - - - - - - Advertisement - - - - - - - - -