BGT Series: భారత్ తో ఈనెల 26 నుంచి మెల్ బోర్న్ లో జరిగే నాలుగోదైన బాక్సింగ్ డే టెస్టుకు ఆస్ట్రేలియా తమ తుదిజట్టును ప్రకటించింది. మ్యాచ్ ఒకట్రెండు రోజుల ముందే తుది జట్టును ప్రకటించే ఆనవాయితీని కొనసాగించింది. తాజాగా జట్టులో రెండు మార్పులు చేసింది. గాయం కారణంగా సిరీస్ మొత్తానికి దూరమైన స్టార్ పేసర్ జోష్ హేజిల్ వుడ్ స్థానంలో 35 ఏళ్ల స్కాట్ బోలాండ్ ను జట్టులోకి తీసుకుంది. ఇదే సిరీస్ లో అడిలైడ్ లో జరిగిన రెండో టెస్టులోనూ తను ఆడిన సంగతి తెలిసిందే. మరోవైపు వరుసగా విఫలమవుతున్న నాథన్ మెక్ స్వినీ ని తప్పించి అతని స్థానంలో యువ ఓపెనర్ శామ్ కొన్ స్టాస్ ను తుదిజట్టులోకి తీసుకోంది. 


యంగెస్ట్ ఓపెనర్..
ఆసీస్ తరఫున అరంగేట్రం చేయబోతున్న యంగెస్ట్ ఓపెనర్ గా శామ్ కొన్ స్టాస్ రికార్డులకెక్కాడు. ఓవరాలగ్ యంగెస్ట్ డెబ్యూటెంట్ అవార్డు మాత్రం ప్రస్తుత కెప్టెన్ ప్యాట్ కమిన్స్ పేరు మీదే ఉంది. తను 2011లో సౌతాఫ్రికాపై అరంగేట్రం చేశాడు. ప్రస్తుతం 19వ పడిలో ఉన్న కోన్ స్టాస్.. దేశవాళీల్లో టన్నుల కొద్ది పరుగులు సాధించడంతోపాటు లిస్ట్-ఏ, వన్డే టోర్నీల్లో దూకుడుగా ఆడతాడు. అందుకే అతడిని జట్టులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇతను కూడా మెక్ స్వినీలాగే రైట్ హ్యాండర్.  ఓపెనింగ్ లో ఉస్మాన్ ఖవాజాతో బరిలోకి దిగుతాడు. దీంతో లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషనల్ కొనసాగుతుందని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. మరోవైపు ఈ సిరీస్ లో రెండో టెస్టులో ఆడిన బోలాండ్ ఇప్పటికే ఆకట్టుకున్నాడు. జైస్వాల్, శుభమాన్ గిల్, విరాట్ కోహ్లీ లాంటి హేమాహేమీల వికెట్లు తీశాడు. ఆ మ్యాచ్ లో తను ఐదు వికెట్లతో రాణించాడు. ఐదో టెస్టుకు కూడా తను తుది జట్టులో చోటు దక్కించుకోవం ఖాయంగా తెలుస్తోంది.


ట్రావిస్ హెడ్ ఫుల్ ఫిట్..
ఈ మ్యాచ్ లో విధ్వంసక బ్యాటర్ ట్రావిస్ హెడ్ బరిలోకి దిగుతాడా..? లేదా అన్న ఊహగానాలకు తెరపడింది. తొడ కండరాల గాయంతో ఇబ్బంది పడుతున్న హెడ్.. ఈ మ్యాచ్ కు ఫుల్ ఫిట్ గా మారాడని కమిన్స్ చెప్పుకొచ్చాడు. అతని ఫిట్ నెస్ లెవల్ ని పరీక్షించిన తర్వాతే ఈ నిర్ణయానికొచ్చినట్లు వెల్లడించాడు. తను ఈ మ్యాచ్ లో ఆడటం చాలా సంతోషంగా ఉందని, తొలి బంతి నుంచే ప్రత్యర్థి బౌలర్లను తను ఒత్తిడి పెంచగలడని పేర్కొన్నాడు. మూడో టెస్టు సందర్భంగా తను గాయపడ్డాడని, ప్రస్తుతం ను ఫుల్ ఫిట్ గా మారినట్లు వెల్లడించాడు. మూడు టెస్టులాడిన హెడ్.. 81కిపైగా సగటుతో 409 పరుగులు చేసి, సిరీస్ లోనే లీడింగ్ రన్ స్కోరర్ గా ఉన్నాడు.  ఇక ఐదు టెస్టుల బోర్డర్- గావస్కర్ (ట్రోఫీ) సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా ఉంది. తొలి టెస్టును భారత్ గెలుచుకోగా, రెండో టెస్టును ఆసీస్ దక్కించుకుంది. వర్షం అంతరాయం కలిగించడం వల్ల మూడో టెస్టు డ్రాగా ముగిసింది. 


ఆస్ట్రేలియా ప్లేయింగ్ లెవన్: కమిన్స్ (కెప్టెన్), కొన్ స్టాస్, ఖవాజా, లబుషేన్, స్మిత్, హెడ్, మార్ష్, కేరీ, స్టార్క్, బోలాండ్, లయోన్.


Also Read: Rohit Sharma Comments: కోహ్లీకి ఆ బలహీనతను ఎలా అధిగమించాలో తెలుసు- మీరే చూస్తారుగా: రోహిత్ శర్మ