Smriti Mandhana News: అంతర్జాతీయ క్రికెట్లో రికార్డుల పరంపరను కొనసాగిస్తూ దూసుకుపోతున్న భారత స్టార్ మహిళా బ్యాటర్ స్మృతి మంధాన తాజాగా ఐసీసీ ప్రకటించిన వన్డే, టీ20 ర్యాంకుల్లోనూ ఎగబాకింది. ఈ రెండు విభాగాల్లోనూ టాప్-2 ర్యాంకును దక్కించుకుని రికార్డులకెక్కింది. తాజా ఐసీసీ వన్డే ర్యాంకింగ్సలో ఆమె 739 పాయింట్లతో రెండో ర్యాంకులో నిలిచింది. తొలి స్థానంలో ఉన్న సౌతాఫ్రికా బ్యాటర్ లారా వోల్వర్ట్ (773) కేవలం 34 పాయింట్ల వెనుంజలోనే ఉండటం విశేషం. ఇక టీ20 ర్యాంకింగ్స్ లో 753 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. తొలి స్థానంలో ఉన్న బేత్ మూనీ (757 పాయింట్ల)కి చాలా చేరువగా స్మృతి నిలవడం విశేషం. ఇటీవల ముగిసి టీ20ల్లో వరసగా అర్థ శతకాలతో సత్తా చాటింది. ముఖ్యంగా 28 ఏళ్ల స్మృతి.. 41 బంతుల్లో 62, 47 బంతుల్లో 77 పరుగులుచేసి సత్తా చాటింది. అలాగే వెస్టిండీస్ తో జరిగిన వన్డేలో భారీ అర్థ సెంచరీ చేసి ఆకట్టుకుంది. 






పదోర్యాంకులో హర్మన్ ప్రీత్..
భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తాజా వన్డే ర్యాంకింగ్స్ లో మూడు స్తానాలు ఎగబాకింది. వడొదొర వన్డేలో 34 పరుగులతో ఆకట్టుకున్న హర్మన్.. 631 పాయింట్లతో టామీ బీమంట్ (ఇంగ్లాండ్) తో కలిసి సంయుక్తంగా పదో స్థానంలో నిలిచింది. ఇక భారత బౌలర్లలో రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్ తమ టీ20 ర్యాంకింగ్స్ లో పైకి ఎగబాకారు. 16వ ప్లేసులో రాధ నిలవగా, 20వ ర్యాంకును పాటిల్ దక్కించుకుంది. మరోవైపు భారత బౌలర్ రేణుక సింగ్.. వన్డే ర్యాంకింగ్స్ లో టాప్- 20లో చోటు దక్కించుకుంది. తొలి వన్డేలో విండీస్ పై ఐదు వికెట్లతో రాణించిన రేణుక తాజా ర్యాంకింగ్స్ లో కెరీర్ బెస్ట్ 20వ స్థానాన్ని దక్కిచుకుంది. 


Read Also: Pujara Comments: టీమిండియా అందులో బలహీనంగా ఉంది.. సరి చేసుకుంటేనే సిరీస్ లో ముందంజ


వరుసగా ఆరో ఫిఫ్టీ బాదిన స్మృతి..
వెస్టిండీస్ తో వడొదర వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో స్మృతి మరో ఫిఫ్టీ బాదింది. అంతర్జాతీయ క్రికెట్లో ఇది ఆమెకు వరుసగా ఆరో ఫిఫ్టీ కావడం విశేషం. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 50 ఓవర్లలో 5 వికెట్లకు 358 పరుగులు  చేసింది. ఇది జట్టు జాయింట్ అత్యధిక స్కోరు కావడం విశేషం. గతంలో కూడా ఇంతే స్కోరును టీమిండియా నమోదు చేసింది.   స్మృతి (47 బంతుల్లో 53, 7 ఫోర్లు, 2 సిక్సర్లు) తన అద్బుత పామ్ ను చాటు కోగా, హర్లీన్ డియోల్ సెంచరీ (103 బంతుల్లో 115, 16 ఫోర్లు) సత్తా చాటింది. ఓపెనర్ ప్రతీకా రావల్ (86 బంతుల్లో 76, 10 ఫోర్లు, 1 సిక్సర్), జెమీమా రోడ్రిగ్స్ (36 బంతుల్లో 52, 6 ఫోర్లు, 1 సిక్సర్) సత్తా చాటడంతో భారత్ భారీ స్కోరు సాధించింది. బౌలర్లలో దియేంద్ర డాటిన్, ఆఫీ ప్లెచర్, జైదా జేమ్స్, కియానా జోసెఫ్ లకు తలో వికెట్ దక్కింది. 


Read Also: 2036 Olympics: ఇండియాలో 2036 ఒలింపిక్స్!.. నిర్వహణకు వేగంగా పావులు కదుపుతున్న కేంద్రం.. ఆల్రెడీ హోస్ట్ సిటీ ఎంపిక!