Breaking News Live: వనమా రాఘవ అరెస్టు... విచారణ చేస్తున్న భద్రాద్రి పోలీసులు...!

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 07 Jan 2022 11:19 PM
వనమా రాఘవ అరెస్టు... 

కొత్తగూడెం కుటుంబం ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వనమా రాఘవను భద్రాద్రి పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ, ఏపీ సరిహద్దుల్లో రాఘవను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. దమ్మపేట, చింతలపూడి మధ్య రాఘవ పోలీసులకు చిక్కాడు. విచారణ కోసం రాఘవను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనలో ఎ-2గా వనమా రాఘవ ఉన్నాడు. 

పీఆర్సీపై ఏపీ సర్కారు ప్రకటన.. 23.29 ఫిట్‌మెంట్‌ ప్రకటన

ప్రభుత్వ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్‌ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. ఎప్పటి నుంచో సాగుతున్న హైడ్రామాకు తెరదించింది. 23.29 శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటిస్తూ జగన్ స్టేట్ మెంట్ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో సమావేశం అనంతరం ప్రకటించారు. 

వనమా రాఘవపై వేటు

నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న కొత్త గూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్రరావును టీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకే వనమా రాఘవపై వేటు వేసినట్లుగా తెలుస్తోంది. అంతేకాక, ఆయన్ను త్వరగా వెతికి పట్టుకోవాలని పోలీసులకు కూడా ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.

మధ్యాహ్నం 3 గంటలకు ఉద్యోగ సంఘాలతో సీఎం జగన్ సమావేశం.. పీఆర్సీపై ప్రకటన వచ్చే ఛాన్స్

ఏపీ సీఎం జగన్ తో సమావేశం తరువాత పీఆర్సీపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఉద్యోగులు భావిస్తున్నారు. నేటి మధ్యాహ్నం 3 గంటలకు ఉద్యోగ సంఘాలతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. అనంతరం 11వ పీఆర్సీపై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఉదయం ఉన్నతాధికారులు, ఆర్థిక శాఖ అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.

వనమా రాఘవ ఇంటికి నోటీసులు అంటించిన పోలీసులు

వనమా రాఘవ ఆచూకీపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. ఎమ్మెల్యే కుమారుడు కావడంతోనే పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని విపక్ష నేతలు మండిపడుతున్నారు. రాఘవపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌తో కొత్తగూడెం బంద్‌ను కొనసాగిస్తున్నారు. తన కుమారుడిని అప్పగిస్తానని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు చెప్పినా ఇప్పటి వరకు రాఘవ పోలీసుల ఎదుటకు రాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా పోలీసులు రాఘవ ఇంటికి నోటీసులు అతికించారు. 2001లో నమోదైన కేసులో విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చారు. ఈరోజు మధ్యాహ్నం 12.30 గంటల్లోపు రావాలని అందులో పేర్కొన్నారు. మణుగూరు ఏఎస్పీ శబరీష్‌ ఎదుట హాజరుకావాలని స్పష్టం చేశారు.

వరంగల్‌ నిట్‌లో కరోనా కలకలం.. సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు

వరంగల్‌ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్‌)లో కరోనా కలకలం సృష్టిస్తోంది.. ఐదుగురికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. నిట్‌లో చదువుతున్న నలుగురు విద్యార్థులు, మరో ఫ్యాకల్టీకి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయ్యింది.. దీంతో అప్రమత్తమైన నిట్‌ అధికారులు.. ఈ నెల 16వ తేదీ వరకు కళాశాలకు సెలవులు ప్రకటిస్తూ నిట్ డైరెక్టర్ ఉత్తర్వులు విడుదల చేశారూ. ఇటీవల క్రిస్మస్‌ వేడుకలకు ఇంటికి వెళ్లి వచ్చిన 200 మంది విద్యార్థులకు అధికారులు కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు

ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలతో షర్మిల ముఖాముఖి

◆ ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలతో షర్మిల ముఖాముఖి నేడు


◆ మధ్యాహ్నం 12 గంటలకు లోటస్ పాండ్ లో సమావేశం


◆ మధ్యాహ్నం 2 గంటలకు రైతు కుటుంబాలతో కలిసి షర్మిల మీడియా సమావేశం


◆ ఏపీలో రాజకీయ పార్టీ ఏర్పాటుపై క్లారిటీ ఇవ్వనున్న షర్మిల


◆ ఏపీ నుంచి పార్టీ పెట్టాలని వ్యక్తం అవుతున్న డిమాండ్


◆ తెలంగాణలోనే పార్టీ బలోపేతంపై ఫోకస్ చేయాలని షర్మిల నిర్ణయించుకున్నట్లు సమాచారం.

కర్నూలు జిల్లా కటారుకొండ గ్రామంలో ఉద్రిక్తత

కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం కటారుకొండ గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఓ స్థలం వివాదంలో రెండు వర్గాలు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇరువర్గాలు కట్టెలు, రాళ్లతో పరస్పరం దాడులు చేసుకునేందుకు సిద్దమయ్యారు. పోలీసులు అక్కడే ఉండటంతో ఇరువర్గాలను చెదరగొట్టారు.

వనమా రాఘవేంద్రరావు కోసం కొనసాగుతున్న గాలింపు

‘‘పాల్వంచ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనలో పరారీలో ఉన్న నిందితుడు వనమా రాఘవేంద్రరావు కోసం జిల్లా పోలీసు బృందాలు విస్తృతంగా గాలిస్తున్నాయి. రాఘవేంద్రరావును గుర్తించి పట్టుకుని అరెస్ట్ చేసేందుకు ఇతర జిల్లాల పోలీసుల సహకారం కూడా తీసుకుంటున్నాము. వీలైనంత త్వరలోనే అతడిని అదుపులోకి తీసుకోవడానికి అన్ని రకాల చర్యలు చేపడుతున్నాము.’’ అని కొత్తగూడెం ఎస్పీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

పీఆర్సీపై ఏపీ సీఎం వైఎస్ జగన్ మరోసారి సమీక్ష

అమరావతి...
నేటి ఉదయం 11 గంటలకు పీఆర్సీపై ఏపీ సీఎం వైఎస్ జగన్ మరోసారి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షకు సీఎస్, ఆర్ధిక శాఖ అధికారులు హాజరుకానున్నారు.

మాజీ ఎమ్మెల్సీ అరెస్టు

కొత్తగూడెం నియోజకవర్గంలో జరిగిన అమానీవియ ఘటన రామకృష్ణ  కుటుంబ సభ్యులు మొత్తం సజీవ దహనం అయిన కేసులో పరారీలో ఉన్న నిందితుడు అరెస్ట్ చేయాలని నిందతుడును కఠినంగా శిక్షించాలని ప్రజాస్వామ్య యుతంగా బంద్ కార్యక్రమం చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ పొట్ల నాగేశ్వరరావును పోలీసులు అరెస్టు చేశారు.

మాజీ మంత్రులు పల్లె రఘునాథ్ రెడ్డి, కాల్వ శ్రీనివాసులు అరెస్ట్

* మాజీ మంత్రులు పల్లె రఘునాథ్ రెడ్డి, కాల్వ శ్రీనివాసులు అరెస్ట్
* బుక్కరాయసముద్రం పోలీస్ స్టేషన్‌లో నిర్బంధం
* పుట్టపర్తి బంద్‌లో పాల్గొనేందుకు వెళుతుండగా ముందస్తు అరెస్టు
* అమరావతి నుంచి వస్తున్న ఇద్దరు నేతల వాహనాలను బుక్కరాయసముద్రంలో నిలిపివేసిన పోలీసులు
* పుట్టపర్తిలో స్మశానంలో హెల్త్ కేర్ క్లినిక్‌ను నిర్మిస్తున్నందుకు నిరసనగా పుట్టపర్తి బంద్‌కు పిలుపు ఇచ్చిన టీడీపీ

Background

రాఘవను అరెస్ట్ చేయలేదు.. గాలిస్తున్నాం.. : కొత్తగూడెం పోలీసులు
పాల్వంచకు చెందిన నాగ రామకృష్ణ ఆత్మహత్యోదంతంలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవ అరెస్టయ్యాడనే అంశంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. వనమా రాఘవను హైదరాబాద్ లో అరెస్ట్ చేసినట్లు ప్రధాన మీడియాతోపాటు సోషల్ మీడియా సైతం వార్తా కథనాలను నివేదించింది. తన కుమారుని వ్యవహరంలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు నియోజకవర్గ ప్రజలకు బహిరంగ లేఖను విడుదల చేసిన నేపథ్యంలోనే వనమా రాఘవ అరెస్టయినట్లు వార్తలు వచ్చాయి. కొత్తగూడెం పోలీసులే రాఘవను అరెస్ట్ చేసినట్లు ప్రచురితమైన వార్తల సారాంశం.


అయితే, వనమా రాఘవను తాము అరెస్ట్ చేయలేదని పాల్వంచ ఏఎస్పీ రోహిత్ రాజ్ కొద్దిసేపటి క్రితం ప్రకటించడం విశేషం. ఏడెనిమిది పోలీసు టీమ్ లతో తాము రాఘవ కోసం గాలిస్తున్నామని, అతను దొరకడం లేదని ఏఎస్పీ ప్రకటించడం గమనార్హం. వనమా రాఘవ దొరికితే తాము అరెస్ట్ చేస్తామని, గతంలో నమోదైన కేసులు ప్రామాణికంగా రౌడీషీట్ కూడా ఓపెన్ చేస్తామని ఏఎస్పీ రోహిత్ రాజ్ వెల్లడించారు.


పెట్రోల్, డీజిల్ ధరలు
హైదరాబాద్‌లో పెట్రోల్ డీజిల్ ధరలు గత కొద్ది రోజులుగా నిలకడగానే ఉంటున్నాయి. నేడు కూడా పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20గా.. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 గా నిలకడగానే కొనసాగుతోంది. ఇక వరంగల్‌లో నేడు (జనవరి 7) పెట్రోల్ ధర గత ధరతో పోలిస్తే స్థిరంగా రూ.107.69 గా ఉంది. డీజిల్ ధర కూడా అలాగే రూ.94.14 గా కొనసాగుతోంది. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి. నిజామాబాద్‌లో ఇంధన ధరలు నేడు కాస్త తగ్గాయి. పెట్రోల్ ధర లీటరుకు నేడు రూ.0.29 పైసలు పెరిగి రూ.110.03 గా ఉంది. డీజిల్ ధర రూ.0.27 పైసలు పెరిగి రూ.96.32 గా ఉంది. గత కొన్ని రోజులుగా నిజామాబాద్‌లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇంధన ధరల్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా కనిపిస్తుండగా తాజాగా స్వల్పంగా తగ్గాయి.


ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
విజయవాడ మార్కెట్‌లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.0.43 పైసలు తగ్గి రూ.110.08గా ఉంది. డీజిల్ ధర బెజవాడలో రూ.0.40 పైసలు తగ్గి రూ.96.19 గా ఉంది.


తగ్గిన బంగారం ధర
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు తగ్గింది. నేడు గ్రాముకు రూ.20 మేర తగ్గింది. వెండి ధర నేడు గ్రాముకు రూ.0.70 పైసలు తగ్గి.. కిలోకు రూ.700 మార్పు కనిపించింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్‌ మార్కెట్‌లో రూ.44,950 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.49,040 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.65,400గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.


ఇక విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,950 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,040గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.65,400 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర తగ్గింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.44,950 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.49,040గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.65,400గా ఉంది.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.