మెటాకు చెందిన మెస్సేజింగ్ యాప్ ‘వాట్సాప్’కు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో వినియోగదారులు ఉన్నారు. భారత్ లో స్మార్ట్ ఫోన్ ఉపయోగించే ప్రతి ఒక్కరి దగ్గర వాట్సాప్ ఉంది. ఈ యాప్ ద్వారా చాలా మంది తమ తమ పనులను పర్యవేక్షించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో వాట్సాప్ ఎప్పటికప్పుడు తమ వినియోగదారులకు మెరుగైన ఫీచర్లను తీసుకురావడంలో ముందుంటుంది. మరింత సులభంగా వాట్సాప్ వినియోగించుకునేలా ఏర్పాటు చేస్తోంది.


ఆటో మేటిక్‌గా గ్రూపు పేరు!


వాట్సాప్ తన వినియోగదారులకు మరో సూపర్ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. తాజాగా ఈ విషయాన్ని Meta CEO మార్క్ జుకర్‌బర్గ్  వెల్లడించారు. ఈ కొత్త ఫీచర్ ద్వారా ఆటో మేటిక్ గా గ్రూపు పేరు క్రియేట్ చేసుకుంటుందని తెలిపారు. ఇటీవల ఆయన తన ఫేస్‌బుక్ పోస్ట్‌ లో, “మీరు హడావిడిలో ఉన్నప్పుడు , గ్రూపు కు పేరు పెట్టే సమయం లేప్పుడు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. తనంతట తానే గ్రూపునకు పేరు పెడుతుంది” అని తెలిపారు. సుమారు ఆరుగురు సభ్యులు ఉండే పేరులేని గ్రూపునకు సభ్యుల ఆధారంగా డైనమిక్‌ పేరు పెడుతుంది. ఉదాహరణకు, 'మాట్',  'లుపిన్' అనే పేరుతో ఉన్న గ్రూప్‌లో ఇద్దరు పార్టిసిపెంట్‌లు ఉంటే, వాట్సాప్ ఆటో మేటిక్ గా ఈ గ్రూపునకు 'మాట్ అండ్ లుపిన్'గా పేరు పెడుతుంది. 


కొత్త  ఫీచర్‌తో యూజర్లకు ప్రైవసీ


గ్రూపు లోని ప్రతి పార్టిసిపెంట్‌కి వారి ఆన్-డివైస్ కాంటాక్ట్‌ లో వారు ఏ పేరు పెట్టారు అనే దాని ఆధారంగా గ్రూప్ పేరుతో క్రియేట్ అవుతుంది. ఈ ఫీచర్ యూజర్ కు సంబంధించిన ప్రైవసీని కూడా కాపాడుతుందని WhatsApp వెల్లడించింది. ఒకవేళ గ్రూపులో పరిచయం లేని వ్యక్తులను యాడ్ చేస్తే, వారు మీ ఫోన్ నంబర్‌ను మాత్రమే గ్రూప్‌లో చూసే అవకాశం ఉంటుంది. వారి ఫోటోలు, స్టేటస్ లు చూసే వీలు ఉండదని తెలిపింది. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్ త్వరలోనే వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. ఇకపై ఏర్పాటు చేసే గ్రూపునకు డైనమిక్ పేరు వచ్చేస్తుంది. ఒకవేళ గ్రూపు పేరు నచ్చకపోతే మనకు నచ్చిన పేరు పెట్టుకోవచ్చు.


రీసెంట్ గా వాట్సాప్ పలు ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వాట్సాప్ వినియోగదారులు ఇతరులకు  HDలో ఫోటోలు, వీడియోలను పంపుకునే అవకాశం కల్పిస్తోంది. సరికొత్త AI-ఆధారిత స్టిక్కర్లను రూపొందించుకునేలా కొత్త ఫీచర్ ను పరిచయం చేసింది. ఒకే వాట్సాప్ అకౌంట్ ను మల్టీఫుల్ డివైజెస్ లో వాడునే అవకాశం కల్పిస్తోంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లలో క్యాప్షన్ మెసేజ్ ఎడిట్ ఫీచర్‌ను విడుదల చేసింది.  ఈ ఫీచర్‌తో వినియోగదారులు మెసేజ్‌ని పంపిన 15 నిమిషాలలోపు వీడియోలు, జిఫ్‌లు, డాక్యుమెంట్స్ కోసం క్యాప్షన్‌లను ఎడిట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది.


Read Also: మీ ఆధార్ వివరాలను WhatsApp, Gmail ద్వారా పంచుకుంటున్నారా? అయితే, ఈ ముప్పు తప్పదు!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial