Running The Refrigerator Continuously For 24 hours: వేసవి కారణంగా ఇప్పుడు వాతావరణంలో వేడి రోజురోజుకూ పెరుగుతోంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల తాపానికి తట్టుకోవడానికి ప్రతి ఒక్కరి ఇంటిలో కూలర్లు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు (ఫ్రిజ్‌లు) నిరంతరం పని చేస్తున్నాయి. ముఖ్యంగా, ఈ సమ్మర్‌ సీజన్‌లో ఫ్రిజ్‌లు చేయాల్సిన పని ఇంకా పెరుగుతుంది. చల్లటి నీరు అందించడం, కూల్‌డ్రింక్స్‌ & ఐస్‌క్రీమ్‌లను నిల్వ చేయడం, కూరగాయలు & ఆహార పదార్థాలు చెడిపోకుండా కాపాడడం వంటి పనులతో ప్రతి ఇంటి ఫ్రిజ్‌ ఇప్పుడు బిజీగా ఉంటుంది. సామాన్యుడికి అయినా, సంపన్నుడికి అయినా సమ్మర్‌ సీజన్‌లో రిఫ్రిజిరేటర్ అతి పెద్ద మద్దతుగా నిలుస్తుంది. అయితే, రిఫ్రిజిరేటర్‌ను ఉపయోగించడం గురించి ప్రజల మనస్సుల్లో చాలా ప్రశ్నలు ఉంటాయి. ఆ సందేహాలలో ఒకటి - రిఫ్రిజిరేటర్‌ నిరంతరం పని చేస్తుంటే ఎటువంటి సమస్య రాదా, దానిని రోజులో కొన్ని గంటలైనా ఆపివేయాలా?. ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం.

Continues below advertisement

రిఫ్రిజిరేటర్ గురించి వేర్వేరు వ్యక్తులకు, వారి అనుభవాల ఆధారంగా లేదా తెలుసుకున్న విషయాల ఆధారంగా వేర్వేరు అభిప్రాయాలు ఉంటాయి. కొంతమంది రిఫ్రిజిరేటర్‌ను రోజులో కొంతసేపు ఆపివేయాలని చెబుతారు. దీనికి వాళ్లు చెప్పే కారణం ఏంటంటే.. రిఫ్రిజిరేటర్ నిరంతరం పనిచేస్తూ ఉంటే మోటారు పాడైపోతుంది & దానిని మరమ్మతు చేయడానికి చాలా ఖర్చు అవుతుంది. మరికొందరి అభిప్రాయం ఇంకోలా ఉంటుంది. రిఫ్రిజిరేటర్‌ను ప్రతి రోజూ కాదు, వారానికి ఒకసారి రెండు, మూడు గంటలు స్విచ్ఛాఫ్‌ చేయాలని, ఆ విరామం సరిపోతుందని అంటారు. ఇప్పుడు మీరైనా, నేనైనా ఎవరి మాట నమ్మాలి, ఏ అభిప్రాయం నిజం అనుకోవాలి?.

సరైన సమాధానం ఏమిటి?ఫ్రిజ్‌ను రోజులో కొంతసేపు ఆపాలా, వారానికి ఒకసారి ఆపాలా, ఎంతసేపు ఆపాలి అని రిఫ్రిజిరేటర్‌ కంపెనీ నిపుణులను అడిగినప్పుడు, వారు చెప్పిన సమాధానం ఏమిటంటే - ప్రతిరోజూ లేదా వారానికి ఒకసారి రిఫ్రిజిరేటర్‌ను ఆపాల్సిన పని లేదు. ఎందుకంటే, ఈ రోజుల్లో టెక్నాలజీ పూర్తిగా అప్‌డేట్‌ అయింది & ఇప్పుడు వచ్చే రిఫ్రిజిరేటర్లు వాంఛనీయ ఉష్ణోగ్రతను నిర్వహించే విధంగా తయారవుతున్నాయి. దీని అర్ధం, సరైన చల్లదనం వద్దకు చేరుకోగానే ఫ్రిజ్‌ మోటారు దానంతట అదే ఆగిపోతుంది, సరిగ్గా ఎయిర్‌ కండిషనర్‌ (AC) తరహాలోనే ఆగి ఆగి పని చేస్తుంది. మీ రిఫ్రిజిరేటర్‌ను రోజంతా ఆన్‌లోనే ఉంచినప్పటికీ, ఉష్ణోగ్రతలను సొంతంగా నిర్వహించునే సాంకేతికత కారణంగా దాని మోటారుపై ఎటువంటి ప్రభావం ఉండదు. కాబట్టి, రిఫ్రిజిరేటర్‌ను స్విచ్ఛాఫ్‌ చేయాల్సిన అవసరం లేదు.

Continues below advertisement

రిఫ్రిజిరేటర్‌ను తప్పనిసరిగా ఆపాల్సిన సందర్భంఅవును, మీరు మీ ఇంట్లోని ఫ్రిజ్‌ను శుభ్రం చేస్తుంటే, దానిని "తప్పనిసరిగా స్విచ్ఛాఫ్‌ చేయాలి". అంతేకాదు, ఫ్రిజ్‌ ప్లగ్‌ను కూడా సాకెట్‌ నుంచి తొలగించాలి. దీనివల్ల, అనుకోని కరెంట్‌ షాక్‌ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. అప్పుడు తప్ప, మీ ఫ్రిజ్‌ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 

ఆధునిక రిఫ్రిజిరేటర్లు ఉష్ణోగ్రతను నిర్వహించడం కోసం అవసరమైనప్పుడు ఆటోమేటిక్‌గా ఆన్ & ఆఫ్ జరిగేలా రూపొందుతున్నాయి. కాబట్టి వాటిని మాన్యువల్‌గా ఆన్ & ఆఫ్ చేయవలసిన అవసరం లేదు.