AI New Social Media Platform:

Continues below advertisement


నేడు మనందరికీ ఒకరితో ఒకరు అనుసంధానం చేసుకోవడానికి సోషల్ మీడియా ఉంది. ఫేస్‌బుక్,, ఇన్‌స్టాగ్రామ్ ప్రపంచాన్ని మరింత దగ్గర చేసింది. ఎక్కడెక్కడ వారినో  ఒకచోటకు తీసుకొచ్చింది. మీరు ప్రపంచంలోని ఏ మూలన ఉన్న వ్యక్తితోనైనా ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా సంప్రదించవచ్చు. అయితే ఇప్పుడు AI త్వరలోనే ప్రజలకు ఫేస్‌బుక్,  ఇన్‌స్టాగ్రామ్‌లకు మించి ఒక కొత్త సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ తీసుకువచ్చే ప్రయత్నాల్లో ఉంది.   


ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ ఎంత పాపులరో ఇప్పుడు ఏఐ కూడా అంతే పాపులర్ అయిపోయింది. ఆఫీస్‌లో ప్రజెంట్ చేయాల్సిన పీపీ నుంచి కూరగాయలు మంచివా చెడ్డవా చెప్పే వరకు విస్తృతంగా ఈ ఏఐను వాడేస్తున్నారు జనాలు. ఒకప్పుడు ఏదైనా సమాచారం కావాలంటే గూగుల్‌లో సెర్చ్  చేసే వాళ్లంతా ఇప్పుడు చాట్‌బోట్‌, గ్రోక్‌, జెమినీలో సెర్చ్ చేస్తున్నారు. క్షణాల్లో కావాల్సిన సమాచారం వచ్చి పడుతోంది. 
మరి అలాంటి ఏఐ, సోషల్ మీడియా కలిస్తే ఎలా ఉంటుంది. ఇప్పుడు ఇదే ఆలోచనతో వివిధ కంపెనీలు పని చేస్తున్నాయి. ఈ రెండింటిని ఒకే యాప్ ద్వారా అందించే ప్రయత్నాల్లో నిమగ్నమై ఉన్నట్టు నివేదికలు అందుతున్నాయి. 


వాస్తవానికి ది వెర్జ్ ఒక నివేదికలో, ఓపెన్‌ఏఐ కూడా ఎక్స్ లాంటి సోషల్ నెట్‌వర్క్‌ను నిర్మించే ఆలోచనపై వర్క్ చేస్తున్నట్టు పేర్కొంది.  నేడు ఎక్స్ గా పేరు మార్చుకున్న ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ గతంలో ట్విట్టర్‌గా పిలిచేవాళ్లు. దాన్ని ఎలాన్ మస్క్ కొనుగోలు చేసి పేరు మార్చారు.


ఓపెన్‌ ఏఐ తన యాప్ ప్రోటోటైప్‌ను సిద్ధం చేసిందని సమాచారం అందుతోంది. అందులో చాట్‌జిపిటి సామర్థ్యం ఉంటుందని తాజా  నివేదికలో పేర్కొన్నారు. యాప్‌లో పబ్లిక్ ఫీడ్ ఉన్న భాగం ఉంటుంది, దీనిలో ప్రజలు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ లేదా ఎక్స్‌లో చేసినట్లే తమ కంటెంట్‌ను షేర్ చేయవచ్చు. అభిప్రాయాలు వ్యక్తం చేయవచ్చు.  


ఈ యాప్ గురించి అంతకంటే ఎక్కువ సమాచారం రాలేదు. కానీ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్‌లకు మించి ఒక కొత్త సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్  ప్రజలకు అందుబాటులోకి రాబోతోందని ఆ నివేదిక తెలిపింది. 


META కూడా సిద్ధం


META కూడా ఈ రకమైన ఛాలెంజెస్‌ను ముందే గుర్తించింది. అందుకే ఈ ఆలోచన తమ ఏఐలో ఇంప్లిమెంట్ చేసేందుకు కూడా వర్క్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.  ఫిబ్రవరిలో META AI యాప్‌ పై META పనిచేస్తోందని వార్త వచ్చింది. అలాంటప్పుడు రెండు యాప్‌లు ఒకేసారి ప్రారంభమైతే రెండింటి మధ్య పోటీ కూడా అదే స్థాయిలో ఉండబోతోంది. 


ఏఐ జనరేటెడ్ సోషల్ మీడియా వస్తే ఫేక్ ప్రచారానికి తెరపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ ప్రజలకను ఎంత దగ్గర చేస్తున్నాయో అదే స్థాయిలో ఫేక్ సమాచారాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. దీని వల్ల అనేక అనర్ధాలు జరుగుతున్నాయి. ఏఐతో కూడిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వస్తే మాత్రం కచ్చితంగా ఇలాంటి వాటికి చెక్ పడుతుందని అంటున్నారు. 


నివేదికల ప్రకారం, ఫేస్‌బుక్‌కు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3.07 బిలియన్ నెలవారీ క్రియాశీల వినియోగదారులు ఉన్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్. అలాంటప్పుడు ఒక కొత్త ప్లాట్‌ఫామ్ రావడం వల్ల పోటీ పెరగడానికి పూర్తి అవకాశం ఉంది.