Keelapatla Sri Konetirayaswamy Alayam  Annual Brahmotsavam:  2025 మే 5 నుంచి 13వ తేదీ వరకు కీలపట్ల శ్రీ కోనేటిరాయస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు టీటీడీ అధికారులు..ఆ వివరాలు ఇవే

కోనేటిరాయల దేవాలయం తిరుమల ఆలయాన్ని పోలి ఉంటుంది. శ్రీవారి ఆలయంలో మూలవిరాట్టు , కోనేటిరాయల ఆలయంలో మూలవిరాట్టు ఒకేలా ఉంటాయి. అందుకే ఈ గ్రామాన్ని చిన్న తిరుపతి అని పిలుస్తారు. బెంగళూరు నుంచి 141 కిలోమీటర్లు, చెన్నై నుంచి 203 కిలోమీటర్లు, హైదరాబాద్ నుంచి 471 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయం. భృగు మహర్షి విష్ణువు ఛాతీపై తన్నిన పాప పరిహారం కోసం విష్ణువు విగ్రహాన్ని ఏడు ప్రదేశాల్లో ప్రతిష్టించాడని చెబుతారు...అందులో ఇదొకటి అని స్థలపురాణం. మొదటఈ ఆలయాన్ని జనమేజయుడు నిర్మించానడి ఆ తర్వాత పల్లవులు, చోళులు  పునర్నిర్మించినట్లు ఆధారాలున్నాయి. తిరుమలలో వున్న శ్రీ వారి ఆలయాన్ని, కీల పట్లలో ఆలయాన్ని ఒకే శిల్పి రూపొందించాడని అందుకే రెండూ ఒకేలా ఉంటాయని చెబుతారు. హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్న సమయంలో ఇఖ్కడ మూలవిరాట్టును కోనేటిలో దాచారని..ఆ తర్వాత విజయనగర రాజుల కాలంలో బయటకు తీసి  పున: ప్రతిష్ఠించారని చెబుతారు. అప్పటి నుంచి  నిత్యపూజలు, బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు.

 శ్రీ కోనేటిరాయస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 5 నుంచి 13వ  వరకు జరగనున్నాయి. ఈ మేరకు ఏప్రిల్ 29న కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం, మే 4 సాయంత్రం 6 నుంచి రాత్రి 8.30 గంటలవరకు సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రాంభమవుతాయి.  బ్రహ్మోత్సవాల్లో భాగంగా  రోజూ ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహనసేవలు వైభవంగా జరగనున్నాయి. 

 కోనేటిరాయస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల వాహనసేవల వివరాలు  05-05-2025

ఉదయం – ధ్వజారోహణం (క‌ర్కాట‌క‌ లగ్నం మ‌ధ్యాహ్నం 12.05 నుంచి 12.20  వ‌ర‌కు)

సాయంత్రం – శేష వాహనం

06-05-2025

ఉదయం – తిరుచ్చిఉత్సవం

సాయంత్రం – హంస వాహనం

07-05-2025

ఉదయం – సింహ వాహనం

సాయంత్రం – ముత్యపుపందిరి వాహనం

08-05-2025

ఉదయం – కల్పవృక్ష వాహనం

సాయంత్రం – సర్వభూపాల వాహనం

09-05-2025

ఉదయం – మోహినీ ఉత్సవం

సాయంత్రం – కల్యాణోత్సవం, గరుడ వాహనం

10-05-2025

ఉదయం – హనుమంత వాహనం

సాయంత్రం – వసంతోత్సవం, గజ వాహనం

11-05-2025

ఉదయం – సూర్యప్రభ వాహనం

సాయంత్రం – చంద్రప్రభ వాహనం

12-05-2025

ఉదయం – రథోత్సవం

సాయంత్రం – అశ్వవాహనం

13-05-2025

ఉదయం – చక్రస్నానం

సాయంత్రం – ధ్వజావరోహణం

ఉత్సవాల్లో భాగంగా మే 9 సాయంత్రం 4 గంటలకు స్వామివారి కల్యాణోత్సవం జరుగుతుంది. ఇందులో పాల్గొనాలి అనుకునే జంటలు  రూ .500/- చెల్లిస్తే అవకాశం లభిస్తుంది. కల్యాణోత్సవంలో పాల్గొనే జంటలకు ఉత్తరీయం, రవికె, అన్నప్రసాదం అందిస్తారు. మే 14వ తేదీ సాయంత్రం 4 గంటలకు పుష్పయాగం జరుగుతుంది.  

కీలపట్లలో కొలువైన శ్రీ కోనేటిరాయస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు సందర్భంగా TTD హిందూ ధర్మప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో   ఆధ్యాత్మిక‌, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

తిరుమలలో ఉన్నది రాతి విగ్రహం కాదు.. సజీవంగా నిల్చున్న శ్రీ వేంకటేశ్వరుడు -  తిరుమలలో జరిగే సేవలేంటి? ఏ సేవలో ఏం చేస్తారు? ఏ సేవకు వెళితే మంచిది? ఈ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి 

ఉగాది 2025: శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మీ రాశి ఫలితం తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి