Amazon Offers Huge Discount on iPhone 15: ఆపిల్ ఐఫోన్ కొనాలని చాలామంది ఆశపడతారు. అయితే, అంత ధర పెట్టలేక వెనక్కు తగ్గుతారు. మీరు కూడా బడ్జెట్ కారణంగా మీ ఆలోచన మార్చుకుంటే, ఇప్పుడు ఒక గొప్ప అవకాశం మీ తలుపు తట్టింది. అమెజాన్‌లో ఆపిల్ ఐఫోన్ 15 మీద అద్భుతమైన ఆఫర్ నడుస్తోంది. ఈ ఆఫర్ కింద, మీరు ఐఫోన్ 15ను భారీ డిస్కౌంట్‌తో పొందవచ్చు.
అమెజాన్ ఆఫర్ ఏంటి?ఆపిల్ వెబ్‌సైట్‌లో ఐఫోన్ 15 వాస్తవ ధర దాదాపు రూ.69,900. ప్రస్తుతం, ఇదే ఫోన్ అమెజాన్‌లో రూ.61,390కే అందుబాటులో ఉంది. అంటే అమెజాన్ ఫ్లాట్‌ఫామ్ నుంచి కొనుగోలు చేయడం వల్ల మీరు రూ. 8,510 ప్రత్యక్ష ప్రయోజనం పొందుతారు, అది కూడా ఎటువంటి కూపన్ లేదా కోడ్ ఇబ్బంది లేకుండా!.
క్రెడిట్ కార్డ్‌తో 5% క్యాష్ బ్యాక్‌ఈ అవకాశం ఇక్కడితో ముగిసిపోలేదు, మీ దగ్గర అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ (Amazon Pay ICICI Bank Credit Card) ఉంటే ఇంకా ఎక్కువ ఆదా చేసుకోవచ్చు. ఈ క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపు చేస్తే మీకు 5% వరకు అదనపు క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు.
పాత ఫోన్ మార్చుకుంటే మరింత డిస్కౌంట్అమెజాన్‌లో ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అద్భుతంగా ఉంది. మీ దగ్గర పాత స్మార్ట్‌ఫోన్ ఉంటే, దాన్ని ఎక్స్ఛేంజ్ చేసుకుని రూ. 22,800 వరకు అడిషనల్ డిస్కౌంట్ పొందవచ్చు. అయితే, ఈ విలువ మీ పాత ఫోన్ బ్రాండ్, మోడల్, ఫోన్ ప్రస్తుత పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు.. మీ దగ్గర ఐఫోన్ 11 ఉండి, అది మంచి స్థితిలో ఉంటే, మీరు దాదాపు రూ. 13,500 ఎక్స్ఛేంజ్ వాల్యూ పొందవచ్చు. అంటే, మీ మొత్తం పొదుపు రూ. 20,000 పైగా ఉండవచ్చు!
ఐఫోన్ 15 ప్రత్యేకతలుHDR10, డాల్బీ విజన్ సపోర్ట్‌తో 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లే శక్తిమంతమైన ఆపిల్ A16 బయోనిక్ చిప్‌సెట్ 6GB RAM, 512GB వరకు స్టోరేజ్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 3,349 mAh బ్యాటరీ గొప్ప కెమెరా నాణ్యత, అద్భుతమైన పనితీరు
మీ పాత ఐఫోన్‌ను అప్‌గ్రేడ్ చేయాలనుకుంటున్నా లేదా మొదటిసారి ఐఫోన్‌ను ఉపయోగించాలని ఆలోచిస్తున్నా ఈ డీల్ మీకు సూటవుతుంది.
Samsung Galaxy S23పై గొప్ప డీల్స్మీరు ఆండ్రాయిడ్‌ను ఇష్టపడుతూ, శామ్‌సంగ్ నుంచి మంచి ఫోన్ కొనాలని ఆలోచిస్తుంటే.. శామ్‌సంగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ Galaxy S23 బెస్ట్ ఆప్షన్ కావచ్చు. ఈ ఫోన్ అమెజాన్‌లో దాదాపు రూ. 10,000-12,000 తగ్గింపుతో లభిస్తుంది. దీంతో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్ & బ్యాంక్ డిస్కౌంట్ ప్రయోజనం కూడా అందుకోవచ్చు.
OnePlus అభిమానుల కోసం OnePlus 12Rఇటీవలే లాంచ్ అయిన OnePlus 12R మీద కూడా అమెజాన్‌లో రివార్డ్స్ ఉన్నాయి. బ్యాంక్ ఆఫర్ & రూ. 5,000-8,000 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌తో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. శక్తిమంతమైన ప్రాసెసర్, గొప్ప డిస్‌ప్లే, లాంగ్‌లాస్టింగ్ బ్యాటరీతో OnePlus 12Rను ప్యాక్ చేశారు.
గూగుల్ పిక్సెల్ 7a మీద వేల రూపాయల డిస్కౌంట్‌మీరు ఫోటోగ్రఫీని ఇష్టపడితే, Google Pixel 7a ఒక గొప్ప ఎంపిక. దీని కెమెరా నాణ్యత ఫ్లాగ్‌షిప్ స్థాయిలో ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫోన్ అమెజాన్‌లో రూ. 6,000-7,000 డిస్కౌంట్‌లో లభిస్తుంది. ఎక్స్ఛేంజ్ & బ్యాంక్ ఆఫర్‌లను కూడా కలుపుకుంటే డిస్కౌంట్ బెనిఫిట్ ఇంకా పెరుగుతుంది.