Garuda Aerospace Funding:ప్రఖ్యాత డ్రోన్ స్టార్టప్ గరడ ఏరో స్పేస్‌కు భారీ ఫండింగ్ వచ్చింది.  ప్రముఖ క్రికెటర్ ఎంఎస్ ధోనీ కూడా పెట్టుబడి పెట్టిన ఈ సంస్థకు ఏకంగా 100 కోట్ల ఫండింగ్ వచ్చింది.  వెంచర్ క్యాటలిస్ట్స్ (VCAT) నుంచి ₹100 కోట్ల సీరీస్ Bడింగ్‌ను సమీకరించింది. ఈ ఫండింగ్‌తో కంపెనీ విలువ 250 మిలియన్ డాలర్లకు ( 2000కోట్లకుపైగా) చేరుకుంది.

డ్రోన్ల తయారీ , ఇన్నోవేషన్‌లో అగ్రగామిగా ఉన్న గరడ ఏరోస్పేస్, ఈ ఫండింగ్ సాధించడాన్ని కీలకమైన మైలురాయిగా భావిస్తోంది. ఈ నిధులతో గరుడ ఏరోస్పేస్ తన డ్రోన్ తయారీ సామర్థ్యాన్ని మెరుగుపరచనుంది. ప్రస్తుత ప్రొడక్షన్‌ను మరింత పెంచడంతోపాటు.. రక్షణ వ్యవస్థల డ్రోన్ డిజైన్ కోసం అత్యాధునిక R&D మరియు టెస్టింగ్ సెంటర్‌ను వేగంగా పూర్తి చేయనుంది.   ఇది కేవలం ఇండియన్ ఏరోస్పేస్‌లో గరడు స్థానాన్ని బలపరచడమే కాకుండా..  ఇండియన్ డిఫెన్స్‌ సిస్టమ్‌ను ఆత్మనిర్భర్ సాధించాలన్న భారత్ సంకల్పానికి కూడా ఊతం ఇస్తుందని గరడ ఏరోస్పేస్ పేర్కొంది.

ధోనీ పెట్టుబడులు

2022-23లో 100 మిలియన్ డాలర్ల విలువతో సీరీస్ A ఫండింగ్ పూర్తి చేసిన గరుడ, 2024 సెప్టెంబర్‌లో క్రికెట్ లెజెండ్ ఎం.ఎస్. ధోనీ నుంచి పెట్టుబడిని స్వీకరించింది. ఇప్పుడు  B సిరీస్  ద్వారా షుమారు 100కోట్లు సమీకరించారు. కంపెనీ వ్యవసాయ డ్రోన్లు , రక్షణ అనువర్తనాలపై దృష్టి సారించనుంది. దిగుమతుల సవాళ్లు ఉన్నప్పటికీ, 85% స్వదేశీ కంటెంట్‌ను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం 20కి పైగా పేటెంట్లతో గరుడ ఏరోస్పేస్ డ్రోన్ రంగంలో నూతన  ఆవిష్కరణలు చేస్తుంది. 

భారీ వృద్ధిపై దృష్టి

ఒక చిన్న యూనిట్‌గా ప్రారంభమైన గరుడ ఏరోస్పేస్ చాలా వేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం ఉన్న యూనిట్ పక్కనే TataElxi తో కలిపి  35,000 చదరపు అడుగుల గరుడ డ్రోన్ పార్క్‌ను నిర్మిస్తోంది. ఇది అత్యాధునిక R&D కేంద్రంగా ఉంటుంది.. HAL, BEMLతో కాంట్రాక్ట్ తయారీ భాగస్వామ్యాలను కొనసాగిస్తోంది. స్థిరమైన మరియు కస్టమర్‌-కేంద్రీకృత వ్యాపార మోడల్‌ను గరుడ అనుసరిస్తుంది. దీని వల్ల 30-32% గ్రాస్ మార్జిన్, 24% EBITDA, మరియు 15% PAT సాధించింది. FY20-21లో ₹2 కోట్ల ఆదాయంతో ప్రారంభమైన గరుడ, ఈ ఏడాది 122కోట్ల ఆదాయాన్ని సాధించనున్నట్లు అంచనా వేస్తోంది.  భారీ విస్తరణ, తయారీపై దృష్టి సారించిన కంపెనీ వచ్చ FY25-26లో 2-3 రెట్ల వృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది.

గ్లోబల్‌గా విస్తరిస్తాం. - CEO Agnishwar Jayaprakash

సిరీస్‌ B ఫండింగ్ అనేది గరుడ గ్రోత్ జర్నీలో ఓ ముఖ్యమైన మైలురాయి. ఇది కేవలం మా సామర్ఖ్యాన్ని పెంచడం మాత్రామే కాదు.. తర్వాతి తరం డ్రోన్ టెక్నలజీని అభివృద్ధిచేయడంలో అత్యంతం కీలకం. స్వదేశీ పరిజ్ఞానంతో ప్రపంచస్థాయి డ్రోన్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావాలన్న మా లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ ఫండింగ్ ఉపయోగపడుతుంది. అలాగే భారత ఆర్థిక ప్రగతికి, రక్షణరంగంలో స్వయం సంవృద్ధికి సహకరిస్తుంది. -గరుడ ఏరోస్పేస్ సీఈఓ, స్థాపకుడు అగ్నిశ్వర్ జయప్రకాష్

 

 దేశీయంగా ఎదుగుతున్న చాంఫియన్లకు తోడ్పాటు అందించాలన్నది మా వ్యూహంలో భాగం.  మా ఆలోచనలకు అనుగునంగా గరడ ఏరోస్పేస్‌కు సహకారం అందించాం. భవిష్యత్‌లో గరడ ఏరోస్పేస్‌  గ్లోబల్ లీడర్‌గా ఎదుగుతుంది. -. Apoorva Ranjan Sharma, Co-founder and Managing Director of VCAT

 

2015లో స్థాపితమైన గరుడ ఏరోస్పేస్ భారత్‌లో అతిపెద్ద డ్రోన్ ఫ్లీట్‌ను కలిగి ఉంది. 400 డ్రోన్లు, 500 పైలట్లతో 84 నగరాల్లో సేవలు అందిస్తోంది. 30 రకాల డ్రోన్లను తయారు చేస్తూ, 50 రకాల సేవలను అందిస్తోంది. టాటా, రిలయన్స్, అదానీ, స్విగ్గీ, అమెజాన్ వంటి 750 క్లయింట్లకు సేవలు అందించింది. ఎం.ఎస్. ధోనీ ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టి, బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు.