Digital Arrest Scam: డిజిటల్ యుగంలో సైబర్ నేరాలు వేగంగా పెరుగుతున్నాయి. వీటిలో ఒకటి డిజిటల్ అరెస్ట్ స్కామ్. ఇది ప్రజలను భయపెట్టి మోసం చేసే కొత్త మార్గంగా మారింది. ఈ స్కామ్‌లో సైబర్ నేరగాళ్లు తమను తాము పోలీసులు, ప్రభుత్వ అధికారులు లేదా చట్టపరమైన సంస్థల ప్రతినిధులుగా పరిచయం చేసుకోవడం ద్వారా బాధితుడిని మోసం చేస్తారు. మీరు జాగ్రత్తగా ఉండకపోతే మీరు కూడా బాధితుడిగా మారవచ్చు. దాన్ని గుర్తించి నివారించే మార్గాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


డిజిటల్ అరెస్ట్ స్కామ్ అంటే ఏమిటి?
డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లో నేరస్తులు బాధితుడిని కాల్, ఈమెయిల్ లేదా మెసేజ్ ద్వారా సంప్రదిస్తారు. మీపై చట్టపరమైన కేసు నమోదు అయిందని లేదా మీ అరెస్ట్ కోసం వారెంట్ జారీ అయిందని వారు పేర్కొన్నారు.


వారు మిమ్మల్ని భయపెట్టడానికి అరెస్ట్ వారెంట్ లేదా కోర్టు సమన్లు ​​వంటి నకిలీ పత్రాలను పంపవచ్చు. నేరస్తులు వెంటనే జరిమానా చెల్లించాలని, బ్యాంక్ వివరాలను పంచుకోవాలని లేదా ఆన్‌లైన్ పేమెంట్ చేయాలని అడుగుతారు. కొన్ని సందర్భాల్లో వారు వ్యక్తిగత డేటాను దొంగిలించడానికి ఫిషింగ్ లింక్‌లను కూడా పంపుతారు. 



Also Read: విమానంలో ఫోన్ ఎందుకు ఫ్లైట్ మోడ్‌లో పెట్టాలి? - పెట్టకపోతే ఏం జరుగుతుంది?


డిజిటల్ అరెస్ట్ స్కామ్‌ను ఎలా గుర్తించాలి?
బెదిరింపులు: కాల్స్, మెసేజెస్ లేదా ఈమెయిల్స్‌లో బెదిరింపు భాషను ఉపయోగిస్తే అప్రమత్తంగా ఉండండి.
వెంటనే యాక్షన్ తీసుకుంటామని ప్రెజర్: మీరు వెంటనే జరిమానా చెల్లించమని లేదా వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయమని అడిగితే అది స్కామ్ కావచ్చు.
నకిలీ పత్రాలు: పంపిన పత్రాలు సరైనవా కాదా అని ఎల్లప్పుడూ చెక్ చేస్తూన ఉండండి.
అనుమానంగ అనిపించే కాంటాక్ట్ నంబర్స్: ఇటువంటి కాల్స్ లేదా మెసేజెస్ తరచుగా తెలియని లేదా ప్రైవేట్ నంబర్‌ల నుండి వస్తాయి.


డిజిటల్ అరెస్ట్ స్కామ్‌ను నివారించడానికి మార్గాలు
అధికారిక నిర్ధారణ పొందండి: ఏవైనా చట్టపరమైన విషయాల్లో సంబంధిత ప్రభుత్వ ఏజెన్సీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
వ్యక్తిగత డేటాను ఇవ్వకూడదు: మీ బ్యాంక్ వివరాలను లేదా ఇతర సున్నితమైన సమాచారాన్ని ఫోన్ లేదా ఈమెయిల్ ద్వారా ఎప్పుడూ షేర్ చేయవద్దు.
ఫిషింగ్ లింక్‌లపై క్లిక్ చేయకండ: మీకు తెలియని లింక్‌లపై అస్సలు క్లిక్ చేయవద్దు.
సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్: మీకు స్కామ్‌ అని అనుమానం వచ్చినట్లయిటే వెంటనే స్థానిక సైబర్ క్రైమ్ విభాగానికి తెలియజేయండి.


డిజిటల్ అరెస్ట్ స్కామ్ భయం, గందరగోళాన్ని సృష్టించడం ద్వారా ప్రజలను మోసగించే మార్గం. మీరు జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉంటే ఇటువంటి మోసాలను నివారించవచ్చు. ఎల్లప్పుడూ అఫీషయల్ సోర్స్‌లను మాత్రమే విశ్వసించండి. ఏదైనా తెలియని కాల్ లేదా మెసేజ్‌కి స్పందించే ముందు చెక్ చేసుకోండి.



Also Read: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!