Despatch: ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా బాలీవుడ్ సీనియర్ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ నటించిన ‘డిస్పాచ్’ (Despatch) అనే మూవీ సీన్లే. ఎందుకంత ప్రత్యేకంగా సీన్లే అని చెప్పాల్సి వస్తుందంటే.. ఎప్పుడూ లేనిది ఈ సినిమాలో ఆయన బోల్డ్ సీన్స్‌లో ఓ రేంజ్‌లో రెచ్చిపోయారు. నిజంగా మనోజ్ బాజ్‌పాయ్‌ని ఇలాంటి సీన్లలో చూస్తారని ఎవరూ ఊహించి ఉండరు. మాములుగా బాలీవుడ్ అంటే కాస్త బోల్డ్ కంటెంట్ మిక్స్ అయి ఉంటుంది. కాకపోతే అది కుర్ర హీరోల విషయంలో. కానీ మనోజ్ బాజ్‌పాయ్ వయసు రీత్యా అసలు ఇలాంటి బోల్డ్ సీన్లలో కనిపిస్తారని, నటిస్తారని ప్రేక్షకులు ఊహించి ఉండరు. సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని అనుకుంటున్నారో తెలియదు కానీ.. ఒక్కసారిగా మనోజ్ బాజ్‌పాయ్ అందరికీ షాక్ అయితే ఇచ్చేశారు.


Also Readబిగ్ బాస్ 8 విజేత నిఖిల్... అతని కంటే ముందు విన్నర్స్ ఎవరో గుర్తు ఉన్నారా? ఓ లుక్ వేయండి


మనోజ్ బాజ్‌పాయ్ తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితమే. పవన్ కళ్యాణ్ నటించిన ‘కొమరం పులి’ సినిమాలో విలన్‌గా బీభత్సమైన నటనతో అలరించిన ఆయన, అల్లు అర్జున్ ‘హ్యాపీ’ సినిమాలో ఓ వైవిధ్యమైన పాత్రలో కనిపించి మెప్పించారు. బాలీవుడ్‌లో బిజీ నటుడిగా ఉన్న మనోజ్ బాజ్‌పాయ్.. ఈ మధ్య కాలంలో సినిమాల కంటే వెబ్ సిరీస్‌లలోనే ఎక్కువగా కనిపిస్తున్నారు. అయితే ఏ వెబ్ సిరీస్‌లోనూ ఆయన శృతిమించలేదు. పెద్దరికం తరహా పాత్రలలోనే కనిపించారు. ఆఖరికి సమంత నటించిన వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’లోనూ ఆయన చాలా పద్ధతిగా, గౌరవ ప్రదమైన పాత్రలోనే కనిపించారు. మరి ఇప్పుడు ఏమయిందో తెలియదు కానీ.. ఒక్కసారిగా తన విశ్వరూపం ప్రదర్శించేశారు.


ఒక్క మనోజ్ బాజ్‌పాయ్ మాత్రమే కాదు.. ఇందులో నటించిన నటి షహానా గోస్వామి కూడా ఆడియెన్స్‌కి బోల్డ్ ట్రీట్ ఇచ్చేసింది. మనోజ్ బాజ్‌పాయ్, షహానా గోస్వామి మధ్య ఇంటిమేట్ సీన్స్ చూస్తే.. నిజంగా ఇది సినిమానా? లేక వెబ్ సిరీసా? అని ఆశ్చర్యపోతారు కూడా. బాత్రూమ్‌లో, బెడ్ రూమ్‌లో, కారులో.. ఇలా ఎక్కడపడితే అక్కడ ఇద్దరూ రొమాన్స్‌లోకి దిగిపోయారు. మనోజ్ బాజ్‌పాయ్ అయినా కాస్త పర్లేదు కానీ.. షహానా మాత్రం అడల్ట్ సీన్స్‌లో అరిపించేసింది. ఆ అరుపుల తాలుకూ వీడియోలే ఇప్పుడు నెట్టింట్లో హాట్ హాట్ టాపిక్‌గా మారాయి.


ఈ సినిమాలో ఉన్న బోల్డ్ సీన్స్‌తో మనోజ్ బాజ్‌పాయ్ ఏమో గానీ.. షహానా గోస్వామి మాత్రం సోషల్ మీడియాలో తెగ పాపులర్ అయిపోయింది. ఈ సినిమా విడుదల తర్వాత ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య అంతకు ముందు ఉన్న వారి కంటే 5 రెట్లు పెరిగిందంటే ఆశ్చర్యపోవాల్సిన విషయమేగా మరి. ఇప్పటి వరకు ఆమె పేరు అంతగా ఎక్కడా వినిపించలేదు కానీ.. ఈ సినిమా తర్వాత ఆమె గురించి సెర్చ్ చేసే వారి సంఖ్య పెరిగిపోతుండటం విశేషం.


ఏదిఏమయితేనేం.. విలక్షణ నటుడిగా పేరున్న మనోజ్ బాజ్‌పాయ్ ఫ్యాన్స్ మాత్రం.. ఈ సీన్లతో కాస్త ఇబ్బంది పడుతున్నారనేది మాత్రం వాస్తవం. మరి ఈ స్పందనపై ఈ బాలీవుడ్ నటుడు ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. డిసెంబర్ 13న జీ5 ఓటీటీలో ఈ చిత్రం విడుదలైంది.


Read Also :  Manchu Manoj Political Entry: రాజకీయాల్లోకి మంచు మనోజ్ దంపతులు! జనసేనలో చేరే అవకాశం!