Prabhas injured during filming : రెబల్ స్టార్ ప్రభాస్ మళ్లీ గాయపడినట్లుగా తెలుస్తోంది. ‘ఆదిపురుష్’ సమయంలో ఆయన తన కాలికి పలుమార్లు శస్త్ర చికిత్స చేయించినట్లుగా వార్తలు వచ్చాయి. తిరుపతిలో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో కూడా నడిచేందుకు ఆయన మరొకరి సపోర్ట్ తీసుకున్నారు. ఇప్పుడు మరోసారి ఆయన షూటింగ్‌లో గాయపడినట్లుగా స్వయంగా ఆయన చెప్పిన లేఖ ఒకటి సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోంది. ఆ గాయం కారణంగానే జపాన్ ప్రేక్షకులకు ప్రభాస్ సారీ చెప్పారు. ప్రభాస్‌కి గాయమైతే జపాన్ ప్రేక్షకులకు సారీ చెప్పడం ఏమిటని అనుకుంటున్నారా? అసలు విషయంలోకి వస్తే.. 


Read Also :  Manchu Manoj Political Entry: రాజకీయాల్లోకి మంచు మనోజ్ దంపతులు! జనసేనలో చేరే అవకాశం!


నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 AD’ చిత్రం ఇండియాలో సంచలనాలను సృష్టించి, ప్రభాస్ కెరీర్‌లో మరో రూ. 1000 కోట్లు బీట్ చేసిన సినిమాగా రికార్డ్ సృష్టించింది. ఇప్పుడీ సినిమాను జపాన్‌లో గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 2025, జనవరి 3వ తేదీన ఈ సినిమా జపాన్‌లో గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ నిమిత్తం ప్రభాస్ జపాన్ వెళ్లాల్సి ఉంది. ఇంతకు ముందు బాహుబలి టైమ్‌లో జపాన్ ప్రేక్షకులు ప్రభాస్‌ని ఎలా ఆదరించారో తెలిసిందే. ప్రభాస్ రాకకోసం ఆయన జపాన్ ఫ్యాన్స్ ఎంతగానో వేచి చూస్తున్నారు. కానీ, సడెన్‌గా ప్రభాస్‌కి గాయం కావడంతో.. ఈ సినిమా ప్రమోషన్స్‌కి ప్రభాస్ జపాన్ రావడం లేదని తెలిపారు. అందుకే అక్కడి డిస్ట్రిబ్యూటర్‌కి, అభిమానులకు సారీ చెబుతూ ఓ మెసేజ్‌ని ప్రభాస్ పాస్ చేశారు. దీంతో అక్కడి ఫ్యాన్స్ అంతా డిజప్పాయింట్ అయ్యామని చెబుతూనే.. ప్రభాస్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు.






ఇంతకీ ఈ రెబల్ స్టార్ తన మెసేజ్‌లో ఏం చెప్పారంటే.. ‘‘నాపై, నా వర్క్‌పై ప్రేమ చూపిస్తున్న వారందరికీ ధన్యవాదాలు. ‘బాహుబలి’ తర్వాత జపాన్ వెళ్లే అవకాశం రాలేదు. నేను అక్కడకు వెళ్లాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు అవకాశం వచ్చినప్పటికీ వెళ్లలేకపోతున్నాను. కారణం సినిమా షూటింగ్ సమయంలో నా కాలు బెణికింది.. అందుకే వెళ్లలేకపోతున్నాను. ఈ విషయాన్ని మా డిస్ట్రిబ్యూటర్ ట్విన్‌‌కి చెప్పగా ఆయన ఎంతో సపోర్ట్ అందించారు. జనవరి 03వ తేదీ శుక్రవారం ఈ సినిమా విడుదల చేసేందుకు వారు పెట్టిన ఎఫర్ట్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ అందరినీ త్వరలోనే కలుస్తాను’’ అని ప్రభాస్ తన మెసేజ్‌లో తెలిపారు.


మరో వైపు ప్రభాస్ ‘సలార్ 2’ చిత్రీకరణలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆ సినిమా షూట్‌లోనే గాయపడి ఉంటారనేలా టాక్ నడుస్తుంది. అలాగే మారుతితో చేస్తున్న ‘ది రాజా సాబ్’ సినిమాకు సంబంధించి ఇటీవలే ప్రభాస్ తన షూట్‌ని పూర్తి చేశారు. ‘కల్కి 2898 AD’ పార్ట్ 2 స్క్రిప్ట్ వర్క్‌లో ఉండగా.. సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ చిత్రం 2025 ఫస్ట్ క్వార్టర్‌లో సెట్స్‌పైకి వెళ్లనుంది. హను రాఘవపూడితో సినిమా ఇటీవల పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఇవి కాకుండా ఇంకో మూడు సినిమాలకు ఆయన సైన్ చేసి ఉన్నారు.



Also Readబిగ్ బాస్ 8 విజేత నిఖిల్... అతని కంటే ముందు విన్నర్స్ ఎవరో గుర్తు ఉన్నారా? ఓ లుక్ వేయండి