Kissing Someone after Eating : పుష్ప 2 సినిమాలో అన్ని సాంగ్స్ మంచి హిట్ అందుకున్నాయి. వాటిలో Peelings-U సాంగ్​కి కూడా మంచి క్రేజ్ వచ్చింది. ఆ సాంగ్​లోని లిరిక్స్​ని అబ్జర్వ్ చేస్తే ''అన్నం కలిపి నోట్లో ముద్దు పెట్టినప్పుడు.. ఎంగిలి మూతితో నువ్వు ముద్దు పెట్టినప్పుడు వచ్చుండాయి పీలింగ్సు'' అని హీరోయిన్ పాడుతూ ఉంటుంది. అయితే ఇలా ఎంగిలి మూతితో ముద్దు పెట్టుకుంటే రొమాంటిక్​గానే ఉంటుంది కానీ.. దానివల్ల కొన్ని సమస్యలు కూడా ఉంటాయట. 


ముద్దు పెట్టుకోవడం అనేది కచ్చితంగా ఓ ప్యూర్ ఫీలింగ్ అనే చెప్పొచ్చు. ప్రేమించిన వ్యక్తిపై ఈ తరహా ఫీలింగ్ కచ్చితంగా వస్తుంది. అందుకే సరసాలు, సరదాల్లో భాగంగా ప్రేమికులు చుంబించుకుంటూ ఉంటారు. ఎంత ప్రేమ ఉన్నా.. ముద్దు పెట్టుకుంటున్నప్పుడు కొన్ని టిప్స్ ఫాలో అవ్వకుంటే.. సమస్యలు తప్పవట. రొమాంటిక్​ డిన్నర్​ చేసిన తర్వాత లేదా.. తింటున్నప్పుడు మీకు మీ పార్టనర్​ని ముద్దు పెట్టుకోవాలనిపిస్తే.. కిస్ చేయొచ్చా? లేదా? చేస్తే నష్టాలున్నాయా? లాభాలున్నాయా?


లాభాలివే.. 


ముద్దు వల్ల మీ మధ్య బంధం మరింత స్ట్రాంగ్ అవుతుంది. మీ మధ్య సాన్నిహిత్యాన్ని పెంచే ప్రక్రియ. కాబట్టి మీరు తింటున్నప్పుడు ఎంగిలి మూతితో ముద్దు ఇచ్చినా అది మీ రిలేషన్​ని పెంచే అవకాశమే ఎక్కువ. మీ పార్టనర్​ ఓరల్(నోటి శుభ్రత) విషయంలో మంచి జాగ్రత్తలు తీసుకుంటే ఎంగిలి మూతితో అకేషనల్​(అప్పుడప్పుడు)గా ముద్దు పెట్టుకున్నా మంచిదే. దానివల్ల పెద్ద హాని జరగదు. 


నష్టాలివే.. 


ఎంగిలి మూతితో ముద్దు పెట్టుకుంటే ప్రేమతో పాటు బాక్టీరియా కూడా బదిలీ అవుతుందట. మీరు తినేటప్పుడు మీ ఫుడ్​ నుంచి బాక్టీరియా నోటిలోకి వస్తుంది. అలా ఎంగిలి నోటితో ముద్దు పెట్టుకున్నప్పుడు ఈ బాక్టీరియా భాగస్వామికి బదిలీ అవుతుంది. దీనివల్ల ఇన్​ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనారోగ్యాలు కూడా రావొచ్చు. 


వెల్లుల్లి, ఉల్లిపాయ, చేపలు వంటి ఆహారాలు తిన్నప్పుడు నోటి నుంచి ఓ తరహా వాసన వస్తుంది. అలాంటి సమయంలో మీరు నోరు కడుక్కోకుండా ముద్దు పెట్టుకుంటే.. ఈ వాసన మీ భాగస్వామికి కూడా బదిలీ అవుతుంది. దీనివల్ల మీ భాగస్వామికి ఇబ్బంది కలగవచ్చు. అంతేకాకుండా చిగురువాపు, చిగుళ్ల వ్యాధిలను పెంచే బాక్టీరియా వ్యాప్తి పెరుగుతుంది. 


ఓరల్ హైజీన్ మైంటేన్ చేస్తూ ఉంటే నోటిలో బాక్టీరియా పెరుగుదల ఉండదు. అలాగే తిన్న తర్వాత నోటిని నీటితో లేదా మౌత్​ వాష్​తో శుభ్రం చేసుకుంటే.. బాక్టీరియా పెరగకుండా.. ఫ్రెష్ బ్రీత్ మీ సొంతమవుతుంది. లంచ్ లేదా డిన్నర్ తర్వాత షుగర్ ఫ్రీ గమ్స్ తినొచ్చు. దీనివల్ల సలైవా పెరుగుతుంది. ఇది యాసిడ్స్​ని న్యూట్రలైజ్ చేసి.. బాక్టీరియాను దూరం చేస్తుంది. దీనివల్ల ఇబ్బందులు ఉండవు. 



అకేషనల్​గా అప్పుడప్పుడు ప్రేమ ఎక్కువై ఎంగిలి మూతితో ముద్దు పెట్టుకుంటే పర్లేదు కానీ.. అదే పనిగా ముద్దొస్తుందంటూ కిస్ చేస్తే ఆరోగ్య సమస్యలు వస్తాయి. దానికంటే మీ ఫీలింగ్స్​ని కంట్రోల్ చేసుకుని.. మౌత్​ వాష్ చేసుకుని.. ఫ్రెష్​గా కిస్​ చేసుకుంటే.. ఇద్దరూ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఎంజాయ్ చేవచ్చు. 


Also Read : అమ్మో లవ్ బైట్స్ అంత డేంజరా.. మెడ మీద ఘాటైన ముద్దు ఇచ్చే లేదా కరిచే ఫాంటసీ ఉంటే జాగ్రత్త