Hidden Dangers of Love Bites (Hickeys) : లవ్ బైట్స్ అంటే దాదాపు అందరికీ తెలుస్తుంది. మెడపై లేదా శరీరంలోని ఇతర ఏ భాగంపై అయినా.. గట్టిగా ముద్దు పెట్టడం, స్మూచ్ చేయడం వల్ల వచ్చే మార్క్​ను లవ్​బైట్​ లేదా హిక్కీ అంటారు. మీకు ఎక్స్​పీరియన్స్ లేకపోయినా.. ఇంకొకరి మెడపై ఆ మార్క్​ ఎప్పుడో ఒకప్పుడు చూసే ఉంటారు. వాళ్లకంటే లవ్​ బైట్స్​ ఇచ్చే వాళ్లు ఉన్నారు.. మనకి ఎవరు ఇస్తారులే అని ఫీల్ అవుతున్నారా? అస్సలు అలా అనుకోకండి. ఆ లవ్​ బైట్స్ చాలా డేంజర్​ అంటున్నారు నిపుణులు. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం. 


లవ్ బైట్స్ లేదా హిక్కీలు ప్రేమకు, ఎఫెక్షన్​కు గుర్తే. కానీ కొన్ని సందర్భాల్లో ఇది అత్యంత ప్రమాదం కావొచ్చు. బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ మధ్య ఫన్నీ మూమెంట్స్​లో అయినా చేతులపై కరుస్తూ ఉంటారు. కొందరికి మాత్రం వ్యాంపైర్స్​లాగా కొరికే అలవాటు ఉంటుంది. చేతులపై కాకుండా.. మెడపై కరిచే సందర్భాలు కూడా కొన్ని ఉంటాయి. ఆ సమయంలో ఇది మీకు ప్రమాదాన్ని కలిగించవచ్చు. 


మెడపై యమ డేంజర్


మెడ అనేది సెన్సిటివ్ ఏరియా. ఆ ప్రాంతంలో చర్మం కాస్త డెలికేటెడ్​గా ఉంటుంది. అక్కడ కరిచినప్పుడు లేదా సక్ చేసినప్పుడు బ్లడ్ వెజెల్స్​పై ప్రెజర్​ పడి బ్రేక్ అవుతాయి. అలా బ్రేక్​ అయినప్పుడు కొందరికి పెటెచీ అని బ్లడ్ స్పాట్​ ఏర్పడుతుంది. దానినే హిక్కీ, లవ్​ బైట్​ అంటున్నాము. ఇక్కడివరకు ఓకే కానీ.. కాస్త గట్టిగా మెడపై కరికినప్పుడు డేంజర్​లో పడే అవకాశముంది. 


ఇన్​ఫెక్షన్ రావొచ్చు..


గట్టిగా మెడపై కరిచినప్పుడు అక్కడ వాపు రావొచ్చు. కొందరికి అది నొప్పిని, వాపును కలిగిస్తుంది. ఇది తగ్గడానికి ఎక్కవ సమయం పడుతుంది. మరికొందరికి ఈ బైట్​ ద్వారా బాక్టీరియా శరీరంలోనికి ప్రవేశించి ఇన్​ఫెక్షన్​కి గురించేస్తుంది. ఇది గాయంగా మారి మరింత ప్రమాదం కావొచ్చు. మరికొందరికి ఆ ప్రాంతంలో దురద ఎక్కువగా వచ్చి.. గాయంగా మారే అవకాశం ఎక్కువ అవుతుంది. 


ప్రాణాంతక సమస్యలు


బ్లడ్ బ్రోన్ సమస్య ఉన్న వాళ్లు.. హెచ్​ఐవీ లేదా హెపటైటీస్ సమస్య ఉన్నవారు మీకు లవ్​ బైట్​ ఇచ్చినప్పుడు.. వారి పంటి ద్వారా మీకు ఆ వైరస్ వ్యాపించే ప్రమాదం ఉంది. మరికొందరిలో బ్లడ్ క్లాట్ అయిపోతుంది. కొందరిలో ఇది డిసార్డర్​గా మారుతుంది. మరికొందరిలో అలెర్జీలు కూడా వస్తాయి. 


తీసుకోవాల్సిన జాగ్రత్తలు


మీ పార్టనర్​కి లవ్​ బైట్​ ఓకేనో కాదో తెలుసుకోండి. వారి కన్సర్న్ లేకుండా ఎలాంటి బైట్స్ ఇవ్వొద్దు. అలాగే హైజీన్​గా ఉండేలా చూసుకోండి. ముద్దు పెట్టుకునే ముందు లేదా లవ్ బైట్ ఇచ్చే ముందు బ్రష్ చేసుకోవడం, మౌత్ వాష్ చేసుకోవడం చేయాలి. అలాగే లవ్ బైట్ తర్వాత ఆ ప్రాంతాన్ని సోప్​ లేదా నీటితో కడగాలి. దీనివల్ల ఇన్​ఫెక్షన్ రాకుండా ఉంటుంది. బ్లడ్ బ్రోన్ డీసీజ్ ఉన్నవాళ్లు లవ్ బైట్స్ చేయకపోవడమే మంచిది. చివరిగా.. లవ్​ బైట్​ అనేది ఘాటుగానే కాదు.. కాస్త ప్రేమగా స్మూచ్​ చేసిన సరిపోతుంది. కరిచేయాల్సిన పని లేదని గుర్తించుకుంటే.. లవ్ బైట్ బెస్ట్ మెమోరీని ఇస్తుంది. 



Also Read : మచ్చలందు లవ్​బైట్​ వేరయా? దీనిని ఎలా తగ్గించుకోవచ్చంటే