Mahindra Thar Discount Offer in December 2024: భారత మార్కెట్లో మహీంద్రా థార్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ ఎస్‌యూవీని చాలా మంది కొనుగోలు చేస్తున్నారు. మీరు మహీంద్రా థార్‌ని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లయితే ఇది మీకు బెస్ట్ ఆప్షన్. ఈ ఫేమస్ ఆఫ్‌రోడర్‌పై కంపెనీ రూ. మూడు లక్షల కంటే ఎక్కువ తగ్గింపును ఇస్తోంది.
ఈ సంవత్సరం తయారు అయిన మోడళ్ల జాబితాను వీలైనంత త్వరగా క్లియర్ చేయడానికి కంపెనీ 3 డోర్ థార్‌పై మెరుగైన తగ్గింపును అందిస్తుంది. మహీంద్రా థార్ 3 డోర్ మోడల్ 2డబ్ల్యూడీ వేరియంట్లపై కస్టమర్‌లు భారీ తగ్గింపులను పొందుతున్నారు. థార్ ఆర్‌డబ్ల్యూడీ 1.5 లీటర్ డీజిల్ వేరియంట్‌పై అత్యల్ప తగ్గింపు ఉంది. దీని ధర రూ. 56 వేలు తగ్గించారు.
ఏ వేరియంట్‌పై ఎంత తగ్గింపు లభిస్తుంది?
పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లో రియల్ వీల్ డ్రైవ్ వేరియంట్లపై మీరు రూ. 1.31 లక్షల వరకు ప్రయోజనం పొందుతారు. దీంతో పాటు మహీంద్రా థార్ ఎర్త్ ఎడిషన్‌పై అత్యధిక తగ్గింపు అందుబాటులో ఉంది. మీరు ఎల్ఎక్స్ ట్రిప్ వేరియంట్లపై రూ. మూడు లక్షల కంటే ఎక్కువ తగ్గింపును పొందుతారు. 2025 నుంచి కంపెనీ అన్ని కార్లపై ధరలను సుమారు మూడు శాతం పెంచుతుంది. పెరుగుతున్న ఇన్‌పుట్ కాస్ట్ కారణంగా దీని ధర పెరగనుందని కంపెనీ తెలిపింది.
Also Read: నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
ధరల పెరుగుదలకు ప్రధాన కారణం ద్రవ్యోల్బణమేనని కంపెనీ పేర్కొంది. రాబోయే నెలల్లో ఎక్స్ఈవీ 7ఈ, బీఈ 07, బీఈ 09, ఎక్స్‌యూవీ 400లను లాంచ్ చేయడానికి కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ఇది కాకుండా కంపెనీ ఈవీ రేంజ్‌ని కూడా పెంచుతుందని భావిస్తున్నారు.
మహీంద్రా థార్ ఇంజిన్ ఎలా ఉంది?
మహీంద్రా థార్ డీజిల్ ఇంజన్ 2184 సీసీ, 1497 సీసీ అయితే పెట్రోల్ ఇంజన్ కెపాసిటీ 1997 సీసీగా ఉంది. ఇది ఆటోమేటిక్, మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లతో మార్కెట్లోకి వచ్చింది. వేరియంట్, ఇంధన రకాన్ని బట్టి థార్ మైలేజ్ లీటర్‌కు 15.2 కిలోమీటర్ల వరకు అందుబాటులో ఉండనుంది. థార్ 4 సీటర్, పొడవు 3985 మిల్లీమీటర్లు గానూ, వెడల్పు 1820 మిల్లీమీటర్లు గానూ, వీల్‌బేస్ 2450 మిల్లీమీటర్లుగానూ ఉంది.
Also Read: రోజుకి 1000 బుకింగ్స్ - మార్కెట్లో దూసుకుపోతున్న కొత్త డిజైర్ - ధర అంత తక్కువా?