Telangana CM Revanth Reddy On Police: లగచర్ల దాడి కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న రైతు హీర్యానాయక్‌కు సంగారెడ్డి జైలులో (Sangareddy District) వైద్య పరీక్షల సమయంలో ఛాతీ నొప్పి వచ్చింది. దీంతో అతన్ని జైలు నుంచి ఆస్పత్రికి తరలిస్తోన్న సమయంలో పోలీసులు బేడీలు వేసి తీసుకెళ్లడం విమర్శలకు తావిచ్చింది. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పందించారు. ఘటనపై అధికారులను ఆరా తీసిన ఆయన.. రైతుకు బేడీలు వేసి తీసుకెళ్లాల్సినంత అవసరం ఏమొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై పూర్తి విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రజా ప్రభుత్వం ఇలాంటి చర్యలను సహించదని హెచ్చరించారు. రైతుకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. కాగా, ఛాతీ నొప్పి రావడంతో రైతు హీర్యానాయక్‌కు తొలుత సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అందించారు. అతని ఆరోగ్యం నిలకడగా ఉందని.. మెరుగైన చికిత్స కోసం పంజాగుట్ట నిమ్స్‌కు తరలించారు. నిమ్స్ ఎమర్జెన్సీ విభాగంలో రైతుకు చికిత్స అందిస్తున్నారు.
Also Read: Mohan Babu discharge: ఆస్పత్రి నుంచి మోహన్ బాబు డిశ్చార్జ్ - హత్యాయత్నం కేసులో అరెస్టు చేస్తారా ?