యువ కథానాయిక 'మహానటి' కీర్తి సురేష్ (Keerthy Suresh)ను ఇక నుంచి శ్రీమతి అని సంబోధించాలి. ఈ రోజు (డిసెంబర్ 12, 2024న) గోవాలో అంగరంగ వైభవంగా ఆమె వివాహం జరిగింది. కీర్తి మెడలో ఆంటోనీ తట్టిల్ (Antony Thattil) మూడుముళ్లు వేశారు. అసలు వీళ్లిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉందో తెలుసా?
కీర్తి సురేష్ కంటే ఆంటోనీ ఎన్నేళ్లు పెద్ద?
Keerthy Suresh Date Of Birth, Age: కీర్తి సురేష్ అక్టోబర్ 17, 1992లో జన్మించారు. ప్రస్తుతం ఆమె వయసు 32 ఏళ్లు. కీర్తి తల్లిదండ్రుల గురించి ప్రత్యేకంగా ప్రేక్షక లోకానికి చెప్పాల్సిన అవసరం లేదు. మలయాళ నిర్మాత జి సురేష్ కుమార్, సీనియర్ హీరోయిన్ మేనకా సురేష్ దంపతుల రెండో కుమార్తె ఆవిడ.
కీర్తి సురేష్ భర్త ఆంటోనీ తట్టిల్ (Keerthy Suresh Husband Antony Thattil Age) పుట్టిన తేదీ బయటకు రాలేదు కానీ ఏడాది మాత్రం వచ్చింది. ఆయన 1989లో జన్మించారని తెలిసింది. ప్రస్తుతం ఆయన వయసు 35 ఏళ్లు. కీర్తి సురేష్ కంటే ఆంటోనీ మూడేళ్లు పెద్ద. అదీ సంగతి!
కీర్తి సురేష్‌కు 17 ఏళ్లు ఉన్నప్పటి నుంచి...
Keerthy Suresh Love Story: ఆంటోనీతో తన పెళ్లికి కేవలం పదిహేను రోజుల ముందు అసలు విషయాన్ని వెల్లడించింది కీర్తి సురేష్. తమ మధ్య ప్రేమ బంధం పదిహేనేళ్లుగా కొనసాగుతోందని చెప్పింది. అంటే... తనకు 17 ఏళ్ల వయసు ఉన్నప్పుడు కీర్తి సురేష్ ప్రేమలో పడ్డారన్నమాట. ఆంటోనీ ఆమెకు చిన్ననాటి స్నేహితుడు అని, ఎప్పటినుంచో ప్రేమలో ఉన్నారనేది తెలిసిన విషయాలే.
Also Read: అల్లు అర్జున్‌కు సారీ చెప్పలేదు కానీ... పుష్ప 2, జేసీబీ కామెంట్స్ మీద సిద్ధూ లేటెస్ట్ రియాక్షన్!
ప్రస్తుతం కీర్తి సురేష్ చేతిలో ఉన్న సినిమాలు ఏమిటి?
Keerthy Suresh Upcoming Movies: పెళ్లి తర్వాత కీర్తి సురేష్ సినిమాల్లో యాక్ట్ చేస్తారా? లేదా? అనే ప్రశ్న ఇక్కడ అనవసరం. ఎందుకంటే... పదిహేనేళ్ల ప్రేమ తర్వాత పెళ్లి అని చెప్పారు. ఆవిడ ఇన్నాళ్లూ సినిమాల్లో నటిస్తే లేని అభ్యంతరం ఇప్పుడు వస్తుందని అనుకోవాల్సిన అవసరం లేదు. సో... పెళ్లి తర్వాత కూడా కీర్తి సురేష్ సినిమాలు చేసే అవకాశం ఉంది.
ప్రస్తుతం కీర్తి సురేష్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. అందులో ముందుగా ప్రేక్షకుల ముందుకు వచ్చేది 'బేబీ జాన్'. బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ హీరోగా నటించిన హిందీ చిత్రమిది. తమిళ్ హిట్ 'తెరి'కి రీమేక్. డిసెంబర్ 25న ఈ సినిమా థియేటర్లలోకి వస్తుంది. హిందీలో కీర్తికి తొలి చిత్రమిది. ఆ తర్వాత తమిళ సినిమాలు 'రివాల్వర్ రీటా', 'కన్నెవీడి' విడుదల అవుతాయి.