Home Remedies for Hickey : అరేయ్ మచ్చా.. ఏంటి ఈ మచ్చ అని మిమ్మల్ని ఎవరైనా అడిగితే కంగారుగా దానిని కవర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ సిగ్గుపడుతున్నారా? అబ్బా.. ఎన్నిసార్లు చెప్పాను ఇలా చేయొద్దు అని.. ఇప్పుడు చూశావా వాడికి తెలిసి కూడా ఏంటిది అని కావాలని అడుగుతున్నాడు అని మీ పార్టనర్ మీద ప్రేమగా కోపం చూపిస్తున్నారా? అయితే కాస్త ఆగండి. మీ పార్టనర్ ప్రేమను కంట్రోల్ చేయడం ఎందుకు కానీ.. మీ లవ్బైట్ తాలుకూ మచ్చ(Love Bite Mark)ని కంట్రోల్ చేసేయండి. అయితే ముందుగా లవ్బైట్ (Love Bite) అంటే ఏంటో.. అది ఎందుకు ఏర్పడుతుందో తెలుసుకుందాం.
లవ్బైట్. దీనినే హికీస్ అని కూడా అంటారు. ఇది చర్మంపై.. కనిపించే ఓ గాయం. ఇది కొరకడం లేదా పెదవులతో ప్రెస్ చేయడం వల్ల అయ్యే తీపి గాయమని చెప్పవచ్చు. ఇద్దరి రొమాన్స్(Romance)లో తెలియకుండా జరిగే ఓ ప్రక్రియ లేదా తెలిసి ప్రేమగా చేసే ఓ గాయంగా చెప్పవచ్చు. ఈ లవ్ బైట్ ముదురు ఎరుపు, ఊదా రంగులో లేదా మీ చర్మం రంగు కంటే ముదురు రంగులో కనిపిస్తూ ఉంటుంది. సాధారణంగా ఇవి మెడపై ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి.
మెడదగ్గర ప్రాంతం చాలా సున్నితంగా ఉంటుంది. కాబట్టి ఆ ఏరియాలో మీ పార్టనర్(Partner) మీ చర్మాన్ని పెదవులతో గట్టిగా ప్రెస్ చేసినప్పుడు లేదా కొరికినప్పుడు కలిగే ఒత్తిడి.. మీ చర్మం కింద ఉండే రక్తనాళాలను విచ్ఛిన్నం చేస్తాయి. ఇలా రక్తనాళాలు విచ్చిన్నమై.. పెటెచియా అనే చిన్న మచ్చలను విడుదల చేయడం ప్రారంభిస్తుందని అధ్యయనాలు చెప్తున్నాయి. ఈ చిన్న మచ్చలన్నీ కలిసి ఒక పెద్ద డార్క్ స్పాట్‌ను ఏర్పరచుతుంది. దీనిని లవ్బైట్ లేదా హికీ(Hickey) అంటాము.
ఈ గాయం ఎంతకాలం ఉంటుంది?
లవ్బైట్ ఏర్పడే మూమెంట్ మధురంగానే ఉండొచ్చు కానీ.. దాని తర్వాత కలిగే పర్యావసనాలు ఎదుర్కోవడం సాహసమనే చెప్పాలి. ఇంట్లో ఉండేవారికి పర్లేదు కానీ.. కాలేజీలకు, ఆఫీస్‌లకు వెళ్లేవారికి దీనిని కవర్ చేయడం ఓ పెద్ద టాస్క్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ గాయమేంటి అనేది అందరికీ అర్థమైనా.. కావాలని దగ్గరికెళ్లి మరీ.. ఏమిటిది అని అడుగుతారు. దానికి మీ దగ్గర సిగ్గు తప్పా.. సమాధానం ఉండదనే చెప్పాలి. అమ్మాయిలైతే.. మేకప్‌తో దానిని కవర్ చేసుకోవచ్చు. మరి అబ్బాయిలైతే.. దానిని ఎలా కవర్ చేయాలి. అసలే లవ్బైట్ దాదాపు రెండు వారాలు ఉంటుందట. అయితే దీనిని త్వరగా తగ్గించుకోవడానికి కొన్ని హోమ్ రెమిడీస్ (Home Remedies for Hickey) ఉన్నాయి. అవేంటే మీరు ఓ లుక్కేయండి.
హాట్ కంప్రెస్..
లవ్బైట్ని తగ్గించుకోవడానికి మీరు హీట్ కంప్రెస్ (Heat Compress) ఉపయోగించవచ్చు. లేదంటే వేడి నీళ్లతో కాపడం పెట్టుకోవచ్చు. ఇది మచ్చను తర్వగా తగ్గేలా చేస్తుంది. ఎందుకంటే హీట్ కంప్రెస్ నుంచి వచ్చే వేడి.. హికీ ప్రాంతంలో మెరుగైన రక్తప్రసరణను ప్రోత్సాహిస్తుంది. తద్వారా నొప్పి తగ్గి.. మచ్చ కూడా త్వరగా తగ్గే అవకాశముంది. కాబట్టి రోజులో 2 నుంచి 3 సార్లు.. 5 నుంచి 10 నిమిషాలు కాపడం పెట్టండి.
అలోవెరా జెల్‌తో..
కలబంద జెల్ (Aloe Vera Gel) యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీవైరల్, యాంటీ సెప్టిక్ లక్షణాలు కలిగి ఉంటుంది. ఇది గాయాలను త్వరగా తగ్గేలా చేస్తుంది. దీనికోసం మీరు ఫ్రెష్ అలోవెరాను తీసుకుని దాని జెల్‌ను ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయండి. 15 నుంచి 20 నిముషాలు అలాగే ఉంచండి. ఆరిన తర్వాత నీటితో శుభ్రం చేయండి. దీనిని రోజుకు రెండు సార్లు చేస్తే తర్వగా మచ్చ మాయమవుతుంది.
కోల్డ్ కంప్రెస్..
హీట్ కంప్రెస్ (Cold Compress) మాత్రమే కాదు.. ఈ మచ్చను తగ్గించడానికి కోల్డ్ కంప్రెస్ కూడా బాగానే హెల్ప్ చేస్తుంది. చల్లని ఉష్ణోగ్రత వాపును తగ్గించడంలో హెల్ప్ చేస్తుందని పరిశోధనలు తెలిపాయి. ఇవి నాళాల నుండి చర్మానికి రక్తప్రవాహాన్ని తగ్గించి.. మచ్చలను ఏర్పరుస్తుంది. దీనికోసం మీరు ఐస్‌క్యూబ్స్ ఉపయోగించవచ్చు. రోజుకు రెండు, మూడుసార్లు ఐస్ క్యూబ్‌తో మసాజ్ చేసినా మంచి ఫలితముంటుంది.
మసాజ్ థెరపీ..
మసాజ్ థెరపీ నొప్పిని తగ్గించడంతో పాటు.. శరీరంలో రక్తప్రవాహాన్ని పెంచుతుంది. ఇది మచ్చ త్వరగా తగ్గడానికి హెల్ప్ చేస్తుంది. అయితే మచ్చ ఉన్న ప్రదేశంలో ఎక్కువ ప్రెజర్ ఇవ్వకూడదు. కాబట్టి కొద్దిగా నూనె తీసుకుని చేతులను బాగా రబ్ చేయండి. చేతుల మధ్య వేడికలిగినప్పుడు మీరు ప్రభావిత ప్రాంతంలో మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల నొప్పి, మచ్చ తగ్గుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ సింపుల్ చిట్కాలతో మీరు కూడా లవ్బైట్స్కి బాయ్ చెప్పేయండి.
Also Read : కలయికకు కూడా షెడ్యూల్ ఫిక్స్ చేయాలట.. ఎందుకంటే?