వివో వీ23 5జీ సిరీస్ మనదేశంలో జనవరి 5వ తేదీన లాంచ్ కానుంది. ఈ విషయాన్ని కంపెనీ ట్విట్టర్ ద్వారా టీజ్ చేసింది. దీనికి సంబంధించిన మైక్రో సైట్‌ను కూడా కంపెనీ టీజ్ చేసింది. ప్రస్తుతం ఇందులో ఏ ఫోన్లు ఉండనున్నాయో కంపెనీ తెలపలేదు కానీ వివో వీ23 5జీ, వివో వీ23 ప్రో 5జీలు ఇందులో ఉండే అవకాశం ఉంది.
ఈ ట్వీట్ ప్రకారం.. వివో వీ23 5జీ సిరీస్ జనవరి 5వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కానున్నాయి. మరో ట్వీట్‌లో ఈ సిరీస్ ఫోన్లలో కలర్ మార్చుకునే బ్యాక్ ప్యానెల్ ఉండనుందని పేర్కొన్నారు. దీన్ని దేశంలో మొదటి రంగులు మార్చుకునే స్మార్ట్ ఫోన్‌గా కంపెనీ ప్రమోట్ చేస్తుంది. లైట్ మారేకొద్దీ గోల్డ్ నుంచి గ్రీన్ వరకు దీని బ్యాక్ ప్యానెల్ రంగులు మారనున్నాయి.
దీని మైక్రో సైట్‌లో ఈ ఫోన్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్లు కూడా రివీల్ చేశారు. వివో వీ23 ప్రో 5జీలో అల్ట్రా స్లిమ్ 3డీ కర్వ్‌డ్ డిస్‌ప్లే ఉండనుంది. వివో వీ23 5జీలో మెటల్ ఫ్లాట్ ఫ్రేమ్ ఉండనుంది. ఐఫోన్ 13 మోడల్స్‌లో ఈ డిజైన్ అందించనున్నారు. దీంతోపాటు ఈ ఫోన్లలో మీడియాటెక్ డైమెన్సిటీ 1200 5జీ ప్రాసెసర్ ఉండనుందని కూడా తెలిపారు.
వీటిలో 8 జీబీ వరకు ర్యామ్ ఉండనుంది. ర్యామ్ ఎక్స్‌టెన్షన్ ఫీచర్ ద్వారా మరో 4 జీబీ ర్యామ్ కూడా పెంచుకోవచ్చు. ఇందులో 5జీ ఫీచర్ కూడా అందించనున్నారు. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 108 మెగాపిక్సెల్‌గా ఉండనుంది. దీంతోపాటు సూపర్ వైడ్ యాంగిల్ సెన్సార్, మాక్రో సెన్సార్ కూడా ఉండనున్నాయి. ఇక ముందువైపు 50 మెగాపిక్సెల్ డ్యూయల్ సెల్ఫీ కెమెరాలు ఉండనున్నాయి.
అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి సన్ షైన్ గోల్డ్ కలర్ ఆప్షన్‌లో మాత్రమే రంగులు మార్చే ఆప్షన్ ఉంటుందని వివో అధికారికంగా ప్రకటించింది. కాబట్టి వినూత్నమైన డిజైన్ కావాలనుకుంటే ఈ వేరియంట్ కొనక తప్పదు.
Also Read: Tecno Camon 18: ముందు, వెనక 48 మెగాపిక్సెల్ కెమెరాలు.. ధర రూ.15 వేలలోపే.. వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ ఫ్రీ!
Also Read: Honor 60: 108 మెగాపిక్సెల్ కెమెరాతో హానర్ కొత్త ఫోన్.. వ్లాగర్ల కోసం ప్రత్యేక ఫీచర్ కూడా!
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!
Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?
Also Read: Redmi New Phone: రెడ్‌మీ కొత్త ఫోన్ వచ్చేసింది.. 8 జీబీ ర్యామ్.. ధర ఎంతంటే?