కరాటే కళ్యాణిపై కేసు..

సినీ నటి కరాటే కళ్యాణిపై జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. కొన్నిరోజుల క్రితం సింగరేణి కాలనీలో అత్యాచారం, హత్యకు గురైన బాలిక వివరాలను సోషల్ మీడియా ద్వారా బయట పెట్టడంతో రంగారెడ్డి జిల్లా జగద్గిరిగుట్టకు చెందిన నితేష్ అనే వ్యక్తి కరాటే కళ్యాణిపై ఫిర్యాదు చేశారు. కంప్లైంట్ ను పరిశీలించిన తరువాత ఆమెపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో జగద్గిరి గుట్ట పోలీస్ స్టేషన్ లో ఆమెపై కేసు నమోదైంది. తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు చేసిన ఈమె బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్ గా కూడా పాల్గొంది. 

 

'ఆర్జీవీ' పేరుతో హోటల్.. 

తారలపై అభిమానాన్ని ఒక్కొక్కరూ ఒక్కో విధంగా చాటుకుంటూ ఉంటారు. తాజాగా ఓ అభిమాని అయితే తన ఫేవరెట్ సెలబ్రిటీ పేరు మీద ఏకంగా హోటల్ పెట్టుకొని ఫేమస్ అయ్యాడు. అతడు అంతగా ఆరాధించే సెలబ్రిటీ ఎవరంటే.. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. అతని తల్లి, సోదరుడు కూడా రామ్ గోపాల్ వర్మ అభిమానులే అని.. ఆ అభిమానంతోనే ఆర్జీవీ పేరుతో హోటల్ పెట్టినట్లు చెప్పారు. దీనిపై రామ్ గోపాల్ వర్మ సైతం స్పందించారు. 'నా పేరుతో హోటల్‌ ఉందంటే చచ్చిపోయినట్లు అనిపిస్తుంది' అంటూ తనదైన స్టైల్ లో ట్వీట్ పెట్టారు. దీనిపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. 





 

బిగ్ బాస్ జెస్సీ ఫస్ట్ మూవీ పోస్టర్.. 

బిగ్ బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్ గా పాల్గొన్న జెస్సీ.. తన అనారోగ్య సమస్యల వలన పదో వారంలో హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు. అలా బయటకు వచ్చిన తరువాత అతడికి సినిమా అవకాశాలు వస్తున్నాయి. తాజాగా తన ఫస్ట్ సినిమా పోస్టర్ ను రిలీజ్ చేశాడు జెస్సీ. 'ఎర్రర్ 500' అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. గాయాలతో గన్ పట్టుకొని టెరిఫిక్ లుక్ లో కనిపించాడు జెస్సీ. సందీప్ మైత్రి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను మైత్రి మోషన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. 

 





 



Also Read:అవమానకర రీతిలో డాన్స్.. సన్నీలియోన్ ను ఇండియా నుంచి తరిమేయమంటూ ఫైర్..


Also Read:పవన్ కి సపోర్ట్ చేసి ఉంటే.. పరిస్థితి ఇలా ఉండేదా..?


Also Read:'ఆర్ఆర్ఆర్'కి పెద్ద దెబ్బే.. కలెక్షన్స్ పై ఎఫెక్ట్ తప్పదు..


Also Read:స్టార్ కమెడియన్ కి ఒమిక్రాన్‌..? హాస్పిటల్ లో ట్రీట్మెంట్..


Also Read:హీరోయిన్ తో ఆమిర్ ఖాన్ సీక్రెట్ మ్యారేజ్.. అసలు నిజమిదే..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి