గంజాయి రవాణా బుర్రకో బుద్ధిలా మారింది. గంజాయి రవాణా చేసేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో, బైక్ సీట్ కింద ఇలా అనేక విధాలుగా గంజాయి తరలిస్తూ పట్టుబడిన ఘటనలు చూస్తున్నాం. గంజాయిని పొడిలా చేసి రవాణా చేస్తుంటారు దుండగులు. అలా అయితే పోలీసులకు పట్టుబడతా అనుకున్నాడో ఏమో గానీ గంజాయి లిక్విడ్ రూపంలో బ్యాగ్ లో దర్జాగా పట్టుకుపోతున్నాడు. పోలీసులు కనుక్కోలేరన్న కాన్ఫిడెన్స్ బైక్ పై ఏదో విహారయాత్రకు వెళ్లినట్లు ప్రయాణం చేస్తున్నాడు. పోలీసుల కళ్లుగప్పాలనుకున్న యువకుడు ఇప్పుడు కటకటాల పాలయ్యాడు. 



Also Read: బూతులు తిడుతూ తీన్మార్ మల్లన్నపై దాడి.. ఏకంగా ఆఫీసులోకి దూసుకొచ్చి దుండగులు రచ్చ రచ్చ.. కేటీఆర్ పనేనని ఆరోపణలు 


లిక్విడ్ గంజాయి రవాణా


పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ఐపీఎస్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పీ జయ రామరాజు ఆదేశాలపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో  స్టేట్ టాస్క్ ఫోర్స్, జిల్లా టాస్క్ ఫోర్స్ సిబ్బంది శుక్రవారం ఉమ్మడిగా వాహన తనిఖీలు చేపట్టాయి. భీమడోలు  మండలం గుండుగొలను నేషనల్ హైవే పై వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులకు రాజమహేంద్రవరం నుంచి గుంటూరు వైపు AP 05 EJ 1965  యమహా ఫజర్ మోటర్ సైకిల్ పై వెళ్తోన్న ఇద్దరు వ్యక్తులను ఆపారు. తనిఖీలు నిర్వహించిగా అతని వద్ద ద్రవ రూప గంజాయి ఉన్నట్లు గుర్తించారు. ఇద్దరు వ్యక్తులను అదుపులో తీసుకొని వారి నుంచి 6 కేజీ 250 గ్రాముల ద్రవ రూప గంజాయి స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ బహిరంగ మార్కెటలో రూ.5 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. గంజాయిని స్వాధీనం చేసుకొని ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పీ సి. జయ రామరాజు తెలిపారు. ఈ తనిఖీల్లో స్టేట్ టాస్క్ ఫోర్స్(విజయవాడ) ఎస్ఈబీ సీఐ. భాను సత్యనారాయణ, ఈఎస్ఐ శ్రీనివాసు, డివిజనల్ టాస్క్ ఫోర్స్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(ఏలూరు) సీఐ జి.ఎస్. కె ధనరాజు, ఎస్ఐ అల్లుర్రయ్య, సిబ్బంది పాల్గోన్నారు. 




Also Read: వరంగల్‌లో డ్రగ్స్ మాఫియా.. సైడ్ ట్రాక్ పట్టి జీవితాలు కోల్పోతున్న యువత, బీటెక్ స్టూడెంట్స్!


Also Read: Delmicron Varient: ఒమిక్రాన్ తర్వాత పొంచి ఉన్న మరో వేరియంట్, ఆ రెండూ కలిసిపోయి కొత్తగా.. దీని తీవ్రత ఎంతంటే..!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి