అవికా గోర్ (Avika Gor)... బాలీవుడ్ ప్రేక్షకులకు 'బాలికా వధు'గా తెలుసు. బుల్లితెరపై ఆ సీరియల్ ఆమెకు ఎంతో గుర్తింపు తెచ్చింది. అదే సీరియల్ తెలుగు బుల్లితెరకు 'చిన్నారి పెళ్లికూతురు'గా వచ్చింది. ఇక్కడ కూడా హిట్టే. ఆ తర్వాత 'ఉయ్యాలా జంపాలా'తో అవికా గోర్ కథానాయికగా మారడం, హిట్ సినిమాలు చేయడం తెలిసిన సంగతే. అయినా... చాలా మంది ఆమెను చిన్నారిగా చూస్తారు. కానీ, అవికా గోర్ పెరిగి పెద్దయ్యారు. ప్రేమలో పడ్డారు. ఐఐఎం అహ్మదాబాద్ లో ఎంబీఏ చేసిన మిళింద్ చాంద్‌వానీ (Milind Chandwani) తో ఆమె రిలేషన్షిప్‌లో ఉన్నారు. కొన్ని రోజుల క్రితం తన ప్రేమ గురించి ఆమె ఓపెన్ అయ్యారు. లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే... వాళ్లిద్దరూ లివ్-ఇన్ రిలేషన్ (Avika Gor and Milind Chandwani in Live-In Relationship?) లో ఉన్నారట.
అవికా గోర్ బాయ్‌ఫ్రెండ్ రీసెంట్‌గా బీఏండబ్ల్యూ కారు కొన్నారు. లగ్జరీ, ఎస్‌యువి మోడల్‌కు చెందిన కారు ఇంటికి వచ్చింది. "వెల్కమ్ థిస్ బీస్ట్ హోమ్. కంగ్రాట్స్ మిళింద్" అని అవికా గోర్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పేర్కొన్నారు. దాన్ని బట్టి ఇద్దరూ ఒకే ఇంటిలో ఉంటున్నారని కొందరు అనుకుంటున్నారు. వ్యక్తిగతంగా, మానసికంగా తనకు మిళింద్ ఎంతో సహాయం చేశాడని అవికా గోర్ గతంలో తెలిపారు. అన్నట్టు... కాంప్ డైరీస్ అనే సంస్థకు మిళింద్ సీఈవోగా పని చేస్తున్నారు.
Also Read: ఏపీలో టికెట్ రేట్స్ ఎఫెక్ట్... ఇండియాలో భారీ స్క్రీన్ మూసివేతAlso Read: పవన్ కి సపోర్ట్ చేసి ఉంటే.. పరిస్థితి ఇలా ఉండేదా..?Also Read: బిగ్ బాస్-ఓటీటీ 49 రోజులే.. టాప్-5 కంటెస్టెంట్లకు బంపర్ ఆఫర్! ప్రైజ్ మనీ.. ఫుల్ డిటైల్స్..Also Read: టికెట్ రేట్స్... కెసిఆర్‌కు థాంక్స్ చెప్పిన చిరంజీవి!Also Read: మనసుకి కళ్లెం వేయొద్దన్న మహేంద్ర.. వసుని ఇంట్లోంచి పంపించే ప్రాసెస్ మొదలెట్టిన జగతి.. గుప్పెడంత మనసు డిసెంబరు 25 శనివారం ఎపిసోడ్Also Read: ప్రజా వైద్యశాల ఓపెన్ చేద్దాం డాక్టర్ బాబు అన్న దీప.. బస్తీలో అదే పని చేసిన మోనిత, కార్తీకదీపం డిసెంబరు 25 శనివారం ఎపిసోడ్ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి