Bigg Boss Telugu కొత్త సీజన్ మరో రెండు నెలల్లో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సారి వచ్చే Bigg Boss గంట సేపు కాదు.. 24X7 ప్రసారం కానుంది. అయితే, దీన్ని Bigg Boss సీజన్ 6గా ప్రసారం చేస్తారా లేదా ‘బిగ్ బాస్-ఓటీటీ’గా స్ట్రీమింగ్ చేస్తారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఓటీటీ వెర్షన్.. ప్రస్తుతం ఉన్న ఫార్మాట్‌లో కాకుండా సరికొత్తగా ఉంటుందని షో నిర్వాహకులు అంటున్నారు. 


విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఓటీటీలో ప్రసారమయ్యే ఈ బిగ్ బాస్.. కేవలం 6 వారాలు లేదా 49 రోజులు మాత్రమే ఉంటుందని తెలిసింది. ప్రైజ్ మనీ కూడా రెగ్యులర్ బిగ్ బాస్ కంటే తక్కువ ఉంటుందని, సుమారు రూ.25 లక్షలు ఉంటుందని సమాచారం. డిస్నీ ప్లస్ హాట్ స్టార్.. ఈ షోను ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తున్న నేపథ్యంలో తక్కువ రోజుల్లోనే ముగించేయాలని భావిస్తోంది. ఎందుకంటే.. జూన్ లేదా జులై నెలల్లో ‘బిగ్ బాస్’ సీజన్ 6 కూడా ప్రారంభం కానుంది.


హిందీ ‘Bigg Boss’‌ను ఫాలో అవుతారా?: సాధారణంగా బిగ్ బాస్ రెగ్యులర్ సీజన్స్‌లో 19 మంది కంటెస్టెంట్లు ఉంటారు. అయితే, హిందీలో ప్రసారమవుతున్న ‘బిగ్ బాస్’ ఓటీటీలో మాత్రం కేవలం 13 మంది కంటెస్టెంట్లు మాత్రమే ఉంటారు. హిందీ బిగ్‌బాస్ ఓటీటీ 42 రోజులు మాత్రమే. ఇది కేవలం Voot ఓటీటీలో మాత్రమే టెలికాస్ట్ అవుతుంది. లైవ్ టెలికాస్ట్‌ను చూడాలంటే Voot Selectకు సబ్‌స్క్రైబ్ కావాలి. అలాగే.. రోజంతా జరిగిన ఘటనలతో ప్రత్యేక ఎపిసోడ్స్‌ను కూడా ప్రసారం చేస్తారు. కొద్ది రోజులు ఈ ఎపిసోడ్స్ ‘కలర్స్’ టీవీలో అర్ధరాత్రి ప్రసారమయ్యాయి. ఆ తర్వాత ఏ జరిగిందో.. టీవీలో టెలికాస్ట్‌ను ఉపసంహరించుకున్నారు. 





Bigg Boss ఓటీటీ హోస్ట్ వేరు..: హిందీలో ప్రసారమవుతున్న రెగ్యులర్ ‘బిగ్ బాస్’ సీజన్స్‌కు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఓటీటీకి మాత్రం కరణ్ జోహార్ హోస్టింగ్ చేస్తున్నారు. అయితే, తెలుగులో మాత్రం రెగ్యులర్ సీజన్స్, ఓటీటీలకు నాగార్జునే హోస్ట్‌గా వ్యవహరిస్తారు. ఈ ఎపిసోడ్స్‌ను టీవీలో టెలికాస్ట్ చేస్తారా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. టీవీలో 24x7 కాకుండా ఎడిట్ చేసిన ఎపిసోడ్స్ ప్రసారం చేయనున్నట్లు తెలిసింది. 


Also Read: ఓటీటీలో ‘బిగ్ బాస్-6’: బాలకృష్ణ హోస్టింగ్‌పై స్పందించిన నాగార్జున


టాప్-5 కంటెస్టెంట్లకు బంపర్ ఆఫర్: హిందీలో ప్రసారమవుతున్న ఓటీటీ ఫార్మాట్ ప్రకారం.. 13 మంది కంటెస్టెంట్లలో చివరికి మిగిలే టాప్-5 కంటెస్టెంట్లకు ‘Bigg Boss’ రెగ్యులర్ సీజన్‌లో అంటే సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరించే షోలో కంటెస్టెంట్లుగా ఛాన్స్ కొట్టేస్తారు. ఇప్పటివరకు నామినేషన్లను కేవలం కంటెస్టెంట్లు చేయడం మాత్రమే చూశాం. కానీ, ఓటీటీ వెర్షన్‌లో ప్రేక్షకులే కంటెస్టెంట్లను నామినేట్ చేస్తారు. మొత్తం సీజన్లో ఒక వారం మాత్రమే కంటెస్టెంట్లకు తోటి కంటెస్టెంట్లను నామినేట్ చేసే అవకాశం వస్తుంది. ఈ షోలో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఉండవు. తెలుగులో ప్రస్తుతం ఉన్న Bigg Boss Telugu సెట్‌లోనే ఓటీటీ ‘బిగ్ బాస్’ ఉంటుందని సమాచారం. ఈ సందర్భంగా హౌస్‌లో స్వల్ప మార్పులు చేస్తారు. యూట్యూబ్, బుల్లితెర తారలనే కంటెస్టెంట్స్‌గా ఎంపిక చేసుకుంటారని తెలిసింది. అలాగే.. గత బిగ్ బాస్ సీజన్స్‌లో త్వరగా ఎలిమినేటైన కంటెస్టెంట్లకు కూడా ఓటీటీలో అవకాశం రావచ్చని సమాచారం. 


Note: ఇది ‘ఏబీపీ దేశం’ ఒరిజినల్ కంటెంట్. కాపీరైట్స్ కింద చర్యలు తీసుకోబడతాయి. 


Also Read: థియేటర్ కంటే కిరాణా కొట్టు పెట్టుకోవడం బెటర్... ఏపీ ప్రభుత్వం మీద నాని సెటైర్స్
Also Read: అది నా ఇష్టం! మీ క్యారెక్ట‌ర్ సంగ‌తేంటి?... సైలెంట్‌గా క్లాస్ పీకిన అన‌సూయ‌!
Also Read: శ్రీరామ చంద్ర కాళ్లు చూస్తే కన్నీళ్లు ఆగవు... ఎంత పని చేశావ్ 'బిగ్ బాస్'!
Also Read: కొమురం భీముడో... కొమురం భీముడో... ఎన్టీఆర్ సాంగ్ ప్రోమో వచ్చింది! చూశారా?
Also Read: 'భీమ్లా నాయక్' వాయిదా పడింది... నాగార్జున దూకుడు పెరిగింది!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి