ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్, ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 12, ఐఫోన్ 11 స్మార్ట్ ఫోన్లపై రిటైల్ చెయిన్ విజయ్ సేల్స్‌లో భారీ ఆఫర్లు అందించారు. కంపెనీ మొదటి వార్షికోత్సవం సందర్భంగా యాపిల్ డేస్ సేల్‌లో భారీ ఆఫర్లు ఉన్నాయి. డిసెంబర్ 31వ తేదీ వరకు ఈ సేల్ జరగనుంది.
వీటితో పాటు మ్యాక్‌బుక్ ఎయిర్ (ఎం1), మ్యాక్‌బుక్ ప్రో (ఎం1), మ్యాక్‌బుక్ ప్రో (ఎం1 ప్రో), ఐప్యాడ్ (2021), ఐప్యాడ్ ఎయిర్ (2020), ఎయిర్‌పోడ్స్ (మూడో తరం), ఎయిర్‌పోడ్స్ ప్రో, ఎయిర్‌పోడ్స్ మ్యాక్స్, హోంప్యాడ్ మినీలపై కూడా భారీ ఆఫర్లు ఉన్నాయి. దీంతోపాటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డులు, ఈఎంఐ లావాదేవీలపై రూ.10 వేల వరకు తగ్గింపు లభించనుంది.
యాపిల్ వాచ్ సిరీస్ 7, యాపిల్ వాచ్ ఎస్ఈ, ఎయిర్‌పోడ్స్ రెండో తరం, ఐప్యాడ్ ప్రోలపై కూడా తగ్గింపు అందించారు. దేశంలో అందుబాటులో ఉన్న 110కి పైగా విజయ్ సేల్స్ రిటైల్ అవుట్‌లెట్స్‌తో పాటు Vijaysales.com వెబ్‌సైట్‌లో కూడా ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
ఈ ఎనిమిది రోజుల సేల్‌లో ఐఫోన్ 13 ధర రూ.75,900 నుంచి ప్రారంభం కానుంది. దీని అసలు ధర రూ.79,900. దీంతోపాటు హెచ్‌డీఎఫ్‌సీ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.6,000 తగ్గింపు లభించనుంది. దీంతోపాటు కనీసం రూ.5,000 విలువైన ఫోన్‌ను ఎక్స్‌చేంజ్ చేస్తే రూ.3,000 అదనపు తగ్గింపు లభించనుంది. అంటే అన్నీ ఆఫర్లూ కలుపుకుంటే రూ.61,900కే ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చన్న మాట.
ఐఫోన్ 13 మినీ ధర రూ.66,400కు, ఐఫోన్ 13 ప్రో ధర రూ.1,13,900కు, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ రూ.1,23,900కు లభించనున్నాయి. ఇక ఐఫోన్ 11 రూ.47,400కు, ఐఫోన్ 12 రూ.56,299కే కొనుగోలు చేయవచ్చు.హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డులు లేదా ఈఎంఐ లావాదేవీల ద్వారా కొనుగోలు చేస్తే ఈ తగ్గింపు లభించనుంది.
ఐప్యాడ్ (2021) కూడా రూ.29,600కే ఈ సేల్‌లో అందుబాటులో ఉంది. ఇక ఐప్యాడ్ ఎయిర్ (2020) ధర రూ.50,900కు, ఐప్యాడ్ ప్రో ధర రూ.67,500కు తగ్గింది. మ్యాక్‌బుక్ ఎయిర్ (ఎం1) రూ.83,610కే కొనుగోలు చేయవచ్చు. వీటితో పాటు మ్యాక్‌బుక్ ప్రో ఎం1 చిప్ వేరియంట్ ధర రూ.1,10,610కి, మ్యాక్‌బుక్ ప్రో ఎం1 ప్రో చిప్ వేరియంట్ ధర రూ.1,81,200కు తగ్గింది.
Also Read: Tecno Camon 18: ముందు, వెనక 48 మెగాపిక్సెల్ కెమెరాలు.. ధర రూ.15 వేలలోపే.. వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ ఫ్రీ!
Also Read: Honor 60: 108 మెగాపిక్సెల్ కెమెరాతో హానర్ కొత్త ఫోన్.. వ్లాగర్ల కోసం ప్రత్యేక ఫీచర్ కూడా!
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!
Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?
Also Read: Redmi New Phone: రెడ్‌మీ కొత్త ఫోన్ వచ్చేసింది.. 8 జీబీ ర్యామ్.. ధర ఎంతంటే?