ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో భారీ పాపులారిటీ దక్కించుకున్న దర్శకులు రాజ్ అండ్ డీకే ఇప్పుడు మరో వెబ్ సిరీస్ ను ప్లాన్ చేస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ సంస్థ భారీ బడ్జెట్ తో ఈ సిరీస్ ను తెరకెక్కిస్తోంది. ఇందులో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ యాక్షన్ ప్యాక్డ్ సిరీస్ లో ఇప్పుడు సౌత్ బ్యూటీ సమంతను హీరోయిన్ గా తీసుకున్నట్లు సమాచారం. 

 

రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన 'ది ఫ్యామిలీ మ్యాన్ 2'లో సమంత నటించింది. ఇందులో ఆమె తన పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుంది. కొన్ని బోల్డ్ సీన్స్ లో కనిపించి షాకిచ్చింది. ఈ సిరీస్ కి సమంత పెర్ఫార్మన్స్ హైలైట్ గా నిలిచింది. ఇప్పుడు మరోసారి సమంతను తమ కొత్త వెబ్ సిరీస్ కోసం ఎంపిక చేసుకున్నారు రాజ్ అండ్ డీకే. తొలిసారి సమంత బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తో ఈ సిరీస్ లో రొమాన్స్ చేయబోతుంది. 

 

వీరిద్దరి పెయిర్ కథకు ఫ్రెష్ లుక్ తీసుకొస్తుందని భావిస్తున్నారు. 2022లో ఈ సిరీస్ సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సిరీస్ ను ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కి తగ్గట్లుగా తెరకెక్కించనున్నారు. వరుణ్ ధావన్, సమంత ఇద్దరూ కూడా తమ పాత్రల కోసం స్పెషల్ ట్రైనింగ్ తీసుకోబోతున్నారట. ఇప్పటివరకు అమెజాన్ ప్రైమ్ ఇండియాలో టేకప్ చేసిన అన్ని ప్రాజెక్ట్ లలో ఇది బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ గా నిలవనుంది. 

 

మొత్తానికి 2022లో సమంత చాలా బిజీగా మారనుంది. ఇప్పటికే 'యశోద' సినిమాలో నటిస్తోన్న సమంత దీని తరువాత తాప్సి నిర్మాణంలో బాలీవుడ్ లో ఓ సినిమా చేయబోతుందని సమాచారం. అలానే ఓ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ లో నటించనుంది. ఇది కాకుండా.. ఓ బైలింగ్యువల్ సినిమా కూడా ఆమె లిస్ట్ లో ఉంది. ఇంత బిజీగా ఉన్నప్పటికీ.. ఇంకా అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే ఉంది సమంత. 

 



Also Read: 'వారసత్వానికి, అర్హతకి మధ్య జరిగే ఘర్షణ'.. హాట్ స్టార్ లో అలరిస్తోన్న 'పరంపర' వెబ్ సిరీస్..


Also Read: 'అర్జున ఫల్గుణ' ట్రైలర్ టాక్.. మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో శ్రీవిష్ణు..


Also Read:2 మిలియన్ క్లబ్ లో 'పుష్ప'.. బన్నీ క్రేజ్ అలాంటిది..


Also Read:హృతిక్ రోషన్ తో సమంత.. క్రేజీ ప్రాజెక్ట్ సెట్ కానుందా..?


Also Read:రైతులకు చిరు సెల్యూట్.. ప్రజలను మొక్కలు నాటమంటూ రిక్వెస్ట్..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి