నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఆహా యాప్ లో 'అన్ స్టాపబుల్' అనే షోని ప్లాన్ చేయగా.. అది సూపర్ సక్సెస్ అయింది. ఈ షోకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ షోకి సంబంధించిన ప్రతీ ఎపిసోడ్ కి మిలియన్లలో వ్యూస్ వస్తున్నాయి. మోహన్ బాబు, నాని, బ్రహ్మానందం, అనీల్ రావిపూడి, రాజమౌళి లాంటి సెలబ్రిటీలు గెస్ట్ లుగా వచ్చారు. రవితేజ కూడా ఈ షోలో కనిపించబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రోమో వచ్చింది. వారం రోజుల్లో పూర్తి ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది. 


ఇదిలా ఉండగా.. ఈ షోలో అల్లు అర్జున్ అండ్ 'పుష్ప' టీమ్ గెస్ట్ లుగా కనిపించబోతున్నారని డిసెంబర్ 25న ఎపిసోడ్ ను టెలికాస్ట్ చేస్తామని అనౌన్స్ చేసింది 'ఆహా'. దీంతో బన్నీ-బాలయ్యల మధ్య సంభాషణ ఎలా ఉంటుందా..? అని ఆసక్తిగా ఎదురుచూశారు ప్రేక్షకులు. రేపు ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతుండడంతో ఎగ్జైట్మెంట్ మరింత పెరిగింది. 


కానీ ఈ ఎపిసోడ్ ని టెలికాస్ట్ చేయలేకపోతున్నామని చెప్పి షాకిచ్చింది 'ఆహా' టీమ్. 'అన్ స్టాపబుల్' ఎంటర్టైన్మెంట్ కంటిన్యూ అవుతుందని కానీ చిన్న బ్రేక్ తో అని చెప్పిన 'ఆహా'.. కొన్ని కారణాల వలన పుష్ప స్పెషల్ ఎపిసోడ్ ని రేపు ప్రసారం చేయడం లేదని తెలిపింది. ఆలస్యమైనా బెస్ట్ ఎపిసోడ్ తో మీ ముందుకొస్తామని రాసుకొచ్చింది. 


అయితే ఈ విషయంలో నెటిజన్లు 'ఆహా'ను ట్రోల్ చేస్తున్నారు. కనీసం ప్రోమో రిలీజ్ చేయనప్పుడైనా అర్ధం చేసుకోవాల్సిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఒక్కసారైనా చెప్పిన టైంకి రిలీజ్ చేశారా అంటూ మరో యూజర్ కామెంట్ చేశాడు. రిలీజ్ చేసే ఆలోచన లేనప్పుడు హాడావిడి ఎందుకు చేశారంటూ 'ఆహా'ని ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు. 






Also Read: 'వారసత్వానికి, అర్హతకి మధ్య జరిగే ఘర్షణ'.. హాట్ స్టార్ లో అలరిస్తోన్న 'పరంపర' వెబ్ సిరీస్..


Also Read: 'అర్జున ఫల్గుణ' ట్రైలర్ టాక్.. మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో శ్రీవిష్ణు..


Also Read:2 మిలియన్ క్లబ్ లో 'పుష్ప'.. బన్నీ క్రేజ్ అలాంటిది..


Also Read:హృతిక్ రోషన్ తో సమంత.. క్రేజీ ప్రాజెక్ట్ సెట్ కానుందా..?


Also Read:రైతులకు చిరు సెల్యూట్.. ప్రజలను మొక్కలు నాటమంటూ రిక్వెస్ట్..



 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి