ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిపై కేంద్రం మరోసారి రాష్ట్రాలను అలర్ట్ చేసింది. అంచనా వేసినట్లుగానే వేగంగా విస్తరిస్తోందని మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం సూచనలు జారీ చేసింది. ఒక్క రోజులో 122 కేసులు నమోదయినట్లుగా కేంద్రం ప్రకటించింది. మొత్తం 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి ఇప్పటిదాకా 358 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 244 యాక్టివ్ కేసులు ఉన్నట్లు, 114 మంది పేషెంట్లు ఒమిక్రాన్ వేరియెంట్ నుంచి కోలుకున్నారు. మహారాష్ట్రలో అధికంగా 88, ఢిల్లీలో 67, తెలంగాణ 38, తమిళనాడు 34, కర్ణాటక 31, గుజరాత్ 30, కేరళ 27, రాజస్థాన్ 22 కేసులు నమోదు అయినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
Also Read: డెల్టా మరణమృదంగం - రైతు చట్టాల ఉపసంహరణ.. ! 2021లో భారత్‌కు మరపురాని మైలురాళ్లు ఎన్నో...
హర్యానా, ఒడిషా, జమ్ము కశ్మీర్, ఆంధ్రప్రదేశ్, యూపీ, ఛండీగఢ్, లడక్‌లలో కూడా కేసులు నమోదు అయ్యాయి. ఒక్కరోజులో 122కేసులు రావడం ఆందోళన కలిగించే అంశమని కేంద్రం ప్రకటించింది. వారం కిందట వంద కేసులు, మంగళవారం నాటికి 200 కేసుల మార్క్‌ను చేరుకోగా.. శుక్రవారం నాటికే 350 మార్క్ దాటడం ఆందోళన కలిగిస్తోది. కేసుల్లో 27 శాతం పేషెంట్లు ఎలాంటి ప్రయాణాలు చేయలేదని, స్థానికంగానే వ్యాప్తిచెందింది. 91 శాతం ఒమిక్రాన్ పేషెంట్లు వ్యాక్సినేషన్ పూర్తైన వాళ్లే.
Also Read: గులాబీకి పూలు - రాళ్లు కూడా .. తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులకు నాంది పలికిన 2021
ఒమిక్రాన్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాలకు కేంద్రం మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. పండుగ-సెలవుల సీజన్ కావడంతో రాత్రిపూట కర్ఫ్యూ విధించాలని సూచించిది. ఇక మొత్తం 108 దేశాల్లో లక్షన్నర కేసులు ఒమిక్రాన్ వేరియెంట్‌కు సంబంధించినవి వెలుగుచూశాయి. యూకేలోనే 90వేలు, డెన్మార్క్‌లో 30వేలు నమోదు అయ్యాయి. ఇప్పటిదాకా ఒమిక్రాన్‌కు సంబంధించి 26 మరణాలు నమోదు అయ్యాయి. ఇండియాలో ఇంత వరకూ ఒమిక్రాన్ మరణం చోటు చేసుకోలేదు.
Also Read: కొంచెం తీపి.. ఏంతో చేదు ! 2021లో ఆంధ్రప్రదేశ్ మైలు రాళ్లేంటి ? మర్చిపోవాల్సినవి ఏంటి ?