విశాఖలో మొదటి ఒమిక్రాన్  కేసు నమోదు అయింది.  యూఏఈ నుంచి వచ్చిన 30 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్ సోకినట్లు గుర్తించారు అధికారులు. డిసెంబర్ 15న విశాఖ వచ్చిన వ్యక్తికి జ్వరం రావడంతో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. అనంతరం ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయగా పాజిటివ్ గా తేలింది. ఆ తర్వాత జీనోమ్ స్వీక్వెన్సింగ్ టెస్ట్ కి పంపించగా ఒమిక్రాన్ గా నిర్ధారణ అయింది. దీంతో ఆ వ్యక్తిని సెల్ఫ్ క్వారంటైన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. 


Also Read: మహారాష్ట్రలో ఒక్కరోజే 23 ఒమిక్రాన్ కేసులు... భయపెడుతున్న కేసుల సంఖ్య






ఏపీలో ఒమిక్రాన్ కేసులు


ఆంధ్రప్రదేశ్ లో మరో రెండు ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. విదేశాల నుంచి వచ్చిన విశాఖ, తూర్పుగోదావరి జిల్లా వాసులకు ఒమిక్రాన్‌ సోకినట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరానికి చెందిన 41 ఏళ్ల మహిళతో పాటు విశాఖకు చెందిన 30 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్‌ నిర్ధారణ అయింది. తాజాగా కేసులతో ఏపీలో ఒమిక్రాన్ కేసులు 4కు చేరాయి. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మహిళ ఈనెల 19న కువైట్‌ నుంచి, విశాఖకు చెందిన వ్యక్తి ఈనెల 15న యూఏఈ నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇద్దరూ క్వారంటైన్‌ ఉన్నారని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు విదేశాల నుంచి ఏపీకి 53 మంది వచ్చారని, వారిలో 9 మందికి కోవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయిందని వైద్యారోగ్యశాఖ తెలిపింది. వారి నమూనాలను సీసీఎంబీ జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపించామని తెలిపింది. తాజాగా నమోదైన ఒమిక్రాన్ కేసులతో రాష్ట్రంలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య నాలుగుకి చేరింది.


Also Read: ఒమిక్రాన్ తీవ్రత తక్కువ, వ్యాప్తి ఎక్కువ... హాస్పిటల్ కేర్ అవసరమయ్యే అవకాశం 70 శాతం తక్కువ... యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ వెల్లడి


ఒమిక్రాన్ బాధితులకు అందించే ఔషధాలు


దేశవ్యాప్తంగా ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బాధితులకు ఇస్తున్న ఔషధాలపై ఆసక్తి ఏర్పడింది. స్వల్ప లక్షణాలే కనిపిస్తుండటం, ప్రాణవాయువు అవసరం లేకపోవడంతో ప్రజలు, వైద్యులు, ప్రభుత్వాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి. దిల్లీలోని వైద్యశాలలో ఒమిక్రాన్‌ బాధితులకు కేవలం మల్టీ విటమిన్లు, పారాసిటమాల్‌తోనే వైద్యం చేస్తున్నారని తెలిసింది. ఇంకా మరేమీ ఇవ్వడం లేదు. దిల్లీలోని లోక్‌నాయక్‌ ఆస్పత్రిలో ఒమిక్రాన్‌ పేషెంట్లకు కేవలం మల్టీ విటమిన్లు, పారాసిటమాల్‌ మాత్రమే ఇస్తున్నామని అక్కడి వైద్యులు చెబుతున్నారు. మరే ఔషధాలు అవసరం పడటం లేదని పేర్కొన్నారు. ఇప్పటి వరకు దిల్లీలోని ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రిలో 40 మంది ఒమిక్రాన్‌ బాధితులకు చికిత్స అందించారు. అందులో 19 మందిని ఇప్పటికే డిశ్చార్జి చేశారు. 


'బాధితుల్లో 90 శాతం మందికి లక్షణాలేమీ కనిపించడం లేదు. అసింప్టమాటిక్‌గా ఉంటున్నారు. మిగిలిన వారికి గొంతు నొప్పి, తక్కువ స్థాయి జ్వరం, ఒళ్లునొప్పుల వంటి స్వల్ప లక్షణాలే ఉంటున్నాయి. చికిత్సలో భాగంగా వారికి కేవలం మల్టీ విటమిన్లు, పారాసిటమాల్‌ మాత్రలు ఇస్తున్నాం. మరే ఇతర ఔషధాలు ఇవ్వాల్సిన అవసరం కనిపించడం లేదు' అని ఎల్‌ఎన్‌జేపీలోని సీనియర్‌ వైద్యుడు ఒకరు తెలిపారు.


Also Read: ఒమిక్రాన్‌ చికిత్స..! దిల్లీలో పేషెంట్లకు ఇస్తున్న మందులివే..!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి