దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో ఒక్క రోజే 33 ఒమిక్రాన్ కేసులు రిజిస్టర్ అయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో కేసుల సంఖ్య 88కి చెరింది. ,


Also Read: డెల్టా మరణమృదంగం - రైతు చట్టాల ఉపసంహరణ.. ! 2021లో భారత్‌కు మరపురాని మైలురాళ్లు ఎన్నో...
మహారాష్ట్రంలో నమోదైనా కేసుల్లో 16మంది వివిధ దేశాల నుంచి వచ్చిన వారిగా గుర్తించారు. మిగిలిన ఏడుగురు విదేశాల నుంచి వచ్చిన వారికి సన్నిహితంగా మెలిగిన వారు. ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఈ నెంబర్‌ ఎక్కువ. గురువారం ఒక్క కేసు కూడా రిజిస్టర్‌ కాలేదు. కాని శుక్రవారం అత్యధిక కేసులు నమోదు కావడంతో అధికారుల్లో కలవరం మొదలైంది. ఎక్కడికక్కడ కట్టడి చర్యలు తీసుకుంటున్నారు. 


Also Read: గులాబీకి పూలు - రాళ్లు కూడా .. తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులకు నాంది పలికిన 2021 !
కొత్తగా నమోదైన కేసుల్లో నలుగురు రోగులు 18 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న వాళ్లే. 23లో 17మందికి ఎలాంటి లక్షణాలు లేవు. ఆరుగురికి లక్షణాలు కనిపించాయి. 







వెలుగులోకి వచ్చిన కేసుల్లో 13 మంది పుణె జిల్లాకు చెందిన వారు. మరో ముగ్గురు పుణే మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన వారు. మరో ముగ్గురు రూరల్‌ ఏరియాకు చెందిన వారు. మిగిలిన ఏడుగురు పింప్రీచించ్వాడ్‌ టౌన్‌షిప్‌నకు చెందిన వారు. 
ఒమిక్రాన్ కొత్తగా సోకిన వారిలో ఇద్దరు రోగులు అరవైఏళ్లకు పై బడిన వాళ్లు ఉన్నారు. 


Also Read: దిగ్గజాల నీడలోంచి వెలుగుతున్న సూరీడులా..! 'కెప్టెన్‌ రోహిత్‌' మర్చిపోలేని 2021


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి