ఒమిక్రాన్ సోకిన వారికి గత వేరియంట్‌లతో పోలిస్తే హాస్పిటల్ కేర్ అవసరమయ్యే అవకాశం 50% నుండి 70% తక్కువగా ఉంటుందని ఓ అధ్యయనంలో తేలింది. యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ చేసిన అధ్యయనంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ అధ్యయన ఫలితాలు కొంత ప్రోత్సాహకరంగా ఉన్నా... ఒమిక్రాన్ వల్ల ఇప్పటికీ పెద్ద సంఖ్యలో ఆసుపత్రిలో చేరుతున్నట్లు తెలుస్తోంది.  బూస్టర్ డోస్ తీసుకున్న 10 వారాల తర్వాత ఒమిక్రాన్ క్షీణించడం మొదలవుతుందని శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. దక్షిణాఫ్రికా, డెన్మార్క్, ఇంగ్లండ్, స్కాట్లాండ్ పరిశోధనలలో ఒమిక్రాన్ తీవ్రత తక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. 


ఒమిక్రాన్ తీవ్రత తక్కువ, వ్యాప్తి ఎక్కువ


నవంబర్ నుంచి యూకేలో ఒమిక్రాన్, డెల్టా కేసులు నమోదయ్యాయి. ఇందులో 132 మంది ఈ వేరియంట్‌తో ఆసుపత్రిలో చేరారు. ఓమిక్రాన్‌ను సోకినప్పటి నుంచి 28 రోజులలో 14 మంది మరణించారు. ఒమిక్రాన్ కేసుల వ్యాప్తి ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ వైరస్ కారణంగా అనారోగ్య తీవ్రత తక్కువగానే ఉంటున్నట్టు యూకే వైద్యుల తాజా అధ్యయనంలో పేర్కొన్నారు. డెల్టా వేరియంట్ తో పోలిస్తే ఒమిక్రాన్ రకంలో ప్రభావం తక్కువగా ఉంటున్నట్టు తెలిపారు.  ఒమిక్రాన్ కారణంగా వ్యాధి తీవ్రత తక్కువగానే ఉన్నప్పటికీ వేగంగా వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని అధ్యయనంలో తేలింది. ఒమిక్రాన్ కేసులు భారీగా సంఖ్యలో నమోదు కావడంతో ఆసుపత్రులలో రద్దీకి దారితీయవచ్చని అంచనా వేస్తున్నారు. డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ అంత హానికరం కాదని తెలిపారు. అప్రమత్తంగా వ్యవహరించడమే వైరస్ ను అడ్డుకోవడంలో మెరుగైన విధానమని వెల్లడించారు.  


40 ఏళ్ల లోపు వారే ఎక్కువ


పెద్ద సంఖ్యలో ప్రజలు ఓమిక్రాన్‌ బారిన పడినా వైరస్ ప్రభావం తక్కువగా ఉందని వైద్యులు అంటున్నారు. యూకేలో తాజాగా 1,19,789 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ వృద్ధులకు సోకితే ఎటువంటి ప్రభావం చూపుతుందనే అనిశ్చితి ఇంకా ఉందని వైద్యులు అంటున్నారు. ఇప్పటివరకూ ఆసుపత్రిల్లో చేరిన వారిలో ఎక్కువ మంది 40 ఏళ్లలోపు వారే ఉన్నారు. బ్రిటన్ లో ఒమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితులు డెల్టా రకంతో పోలిస్తే 20 శాతం తక్కువగా ఉంటాయని అధ్యయనంతో తేలింది. ఒక రోజు కంటే ఎక్కువగా ఆసుపత్రిలో ఉండాల్సిన పరిస్థితి 40 శాతం తక్కువగా ఉంటుందని వైద్యులు అంటున్నారు. ఒమిక్రాన్ వేరియంట్‌ కాంట్రాక్ట్ వ్యక్తులు ఇతర వేరియంట్‌లను కాంట్రాక్ట్ చేసే వారి కంటే ఆసుపత్రిలో చేరే ప్రమాదం చాలా తక్కువ అని మా విశ్లేషణలో తెలింది' అని UKHSA చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ జెన్నీ హారీస్ తెలిపారు. ప్రస్తుతం యూకేలో కేసులు చాలా ఎక్కువగా ఉన్నా, తక్కువ నిష్పత్తిలో ఆసుపత్రిలో చేరుతున్నారన్నారు.