ఈ రోజుల్లో సంతానోత్పత్తి సమస్యలు బాగా పెరుగుతున్నాయి. బిజీ లైఫ్, మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్లు నేరుగా సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతున్నాయి. ఈ సమస్య కేవలం ఇండియాలోనే కాదు.. యూకే వంటి దేశాలను కూడా వేదిస్తోందట. ఇటీవల ఓ సంస్థ నిర్వహించిన అధ్యయనంలో కీలక విషయాలు బయటపడ్డాయి. ముఖ్యంగా భారతీయులు నిత్యం ఉపయోగించే మసాలా వంటకాలు మగాళ్లకు దివ్యౌషదమని, ముఖ్యంగా సంతానలేమితో బాధపడుతున్నవారు తప్పకుండా వీటిని ప్రయత్నించాలని పేర్కొంది.
యూకేకు చెందిన ‘ది సన్’ వార్తా సంస్థ కథనం ప్రకారం.. మద్రాస్, గోవాల్లో ఎక్కువగా తయారు చేసే కూరల్లోని మసాలాలు పురుషులకు ఎంతో మేలు చేస్తోందన్నారు. ముఖ్యంగా మెంతులు, కొత్తిమీరతో తయారు చేసే వంటలు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని పేర్కొంది. అధ్యయనంలో భాగంగా మెంతులతో తయారు చేసిన ఫ్యూరోసాప్ (Furosap) అనే ఔషదాన్ని 35 నుంచి 60 ఏళ్ల వయస్సు గల వ్యక్తులకు వరుసగా మూడు నెలలు ఇచ్చారట.
ఫలితాలను పరిశీలించగా.. ఆ ఔషదాన్ని తీసుకున్న పురుషుల్లో సెక్స్ సామర్థ్యం, వీర్యం నాణ్యత బాగా పెరిగిందట. అలాగే మెదడు కూడా చురుగ్గా పనిచేయడమే కాకుండా గుండె కూడా హెల్దీగా మారినట్లు గుర్తించారు. యూకేలోని ప్రతి ఏడు జంటల్లో ఒక జంట సంతానలేమితో బాధపడుతున్నారు. అక్కడి జనాభాలో సుమారు ఏడు శాతం పురుషులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారట.
Also Read: ఇలా హగ్ చేసుకుంటే.. శృంగారానికి ‘సై’ అన్నట్లే.. ఒక్కో కౌగిలింతకు ఒక్కో అర్థం!
లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్శిటీ బృందం తెలిపిన వివరాలు ప్రకారం.. ‘‘Furosap పురుషుల్లో టెస్టోస్టెరాన్ స్థాయిలు పెంచేందుకు, ఆరోగ్యకరమైన వీర్యాన్ని వృద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది. మెంతుల వల్ల మహిళల్లో ఆరోగ్యకరమైన రుతుక్రమంతోపాటు లైంగికంగానూ చురుగ్గా ఉంటారని గత అధ్యయనాలు వెల్లడించాయి. చూశారుగా.. మెంతులు కేవలం ఆరోగ్యాన్నే కాదు.. లైంగిక శక్తి, సంతానోత్పత్తికి కూడా మేలు చేస్తాయ్. అయితే, మీరు ఏం చేసినా.. ఏ ఔషదాన్ని తీసుకున్నా.. తప్పకుండా వైద్యుల సలహా, సూచన తీసుకోవాలి.
Note: ఇది ‘ఏబీపీ దేశం’ ఒరిజినల్ కంటెంట్. కాపీరైట్స్ చర్యలు తీసుకోబడతాయి.
గమనిక: ఈ కథనం కేవలం మీకు అవగాహన కలిగించడం కోసమే. ఇందులో పేర్కొన్న ఔషదాలు లేదా పదార్థాలను వైద్యుడి సలహ, సూచనలను తీసుకున్న తర్వాతే తీసుకోవాలి.
Read Also: ప్రియుడు మాట్లాడటం లేదని పోలీసులకు ప్రియురాలు ఫిర్యాదు.. పెళ్లి చేసి తిక్కకుదిర్చారు
Read Also: ‘కిమ్’ కర్తవ్యం?.. ఉత్తర కొరియా నియంత భార్యకు ఇన్ని రూల్సా? పిల్లలను కనే విషయంలోనూ..
Read Also: ఈ ఏడాది మనదేశంలో ఎక్కువ మంది వెతికిన టాప్ 10 రెసిపీలు ఇవే
Read Also: ఏడవండి.. గట్టిగా ఏడ్చి మీ బాధను తగ్గించుకోండి, కొత్తగా ఏడుపు గదుల ప్రాజెక్ట్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి