శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఏ8 అమెరికాలో గత కొన్ని నెలల క్రితం అమెరికాలో లాంచ్ అయింది. దీనికి సంబంధించిన సపోర్ట్ పేజీ కూడా ఆన్‌లైన్‌లో కనిపించింది. దీన్ని బట్టి ఈ ట్యాబ్ మనదేశంలో త్వరలో లాంచ్ కానుందని అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా దీనికి సంబంధించిన అధికారిక టీజర్ కూడా విడుదల అయింది.
అమెజాన్ ఇండియా వెబ్‌సైట్లో కూడా దీనికి సంబంధించిన ల్యాండింగ్ పేజీ కనిపించింది. దీన్ని బట్టి ఇందులో 10.5 అంగుళాల డిస్‌ప్లే ఉండనుంది. దీని మందం 0.69 సెంటీమీటర్లుగా ఉండనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 7040 ఎంఏహెచ్‌గా ఉండనుంది. 1 టీబీ మైక్రో ఎస్‌డీ కార్డును ఇది సపోర్ట్ చేయనుంది. 2020లో లాంచ్ అయిన శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఏ7కి తర్వాతి వెర్షన్‌గా ఈ ట్యాబ్ లాంచ్ కానుంది.
అమెరికాలో దీని ధర 229 డాలర్ల నుంచి ప్రారంభం కానుంది. అంటే మనదేశ కరెన్సీలో రూ.19,700 అన్నమాట. మనదేశంలో దీని ధర ఎంతగా ఉండనుందో తెలియాల్సి ఉంది.
శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఏ8 స్పెసిఫికేషన్లు
శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఏ8లో 10.5 అంగుళాల డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిజల్యూషన్ 2000 x 1200 పిక్సెల్స్‌గా ఉండనుంది. ఇందులో ఆక్టాకోర్ యూనిసోక్ టీ618 ప్రాసెసర్‌ను అందించారు. దీంతోపాటు ఇందులో 3 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఉండనున్నాయి.
ఫోన్ వెనకవైపు 8 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది. ఇక ముందువైపు 5 మెగాపిక్సెల్ సెన్సార్‌ను అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 7040 ఎంఏహెచ్‌గా ఉంది. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ట్యాబ్లెట్ పనిచేయనుంది.
ఇందులో క్వాడ్ స్టీరియో స్పీకర్ సిస్టంను అందించారు. డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది. దీని బరువు 508 గ్రాములుగా ఉంది. 4జీ ఎల్టీఈ, వైఫై, వైఫై డైరెక్ట్, బ్లూటూత్ 5 ఎల్ఈ, జీపీఎస్, గ్లోనాస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు ఇందులో ఉన్నాయి.
Also Read: Tecno Camon 18: ముందు, వెనక 48 మెగాపిక్సెల్ కెమెరాలు.. ధర రూ.15 వేలలోపే.. వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ ఫ్రీ!
Also Read: Honor 60: 108 మెగాపిక్సెల్ కెమెరాతో హానర్ కొత్త ఫోన్.. వ్లాగర్ల కోసం ప్రత్యేక ఫీచర్ కూడా!
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!
Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?
Also Read: Redmi New Phone: రెడ్‌మీ కొత్త ఫోన్ వచ్చేసింది.. 8 జీబీ ర్యామ్.. ధర ఎంతంటే?