పబ్జీ: న్యూ స్టేట్‌కు కొత్త మ్యాప్‌ను అందించనున్నారు. దీంతోపాటు మేజర్ అప్‌డేట్స్ కూడా అందించనున్నారు. ఈ విషయాన్ని కంపెనీ న్యూ ఇయర్ మెసేజ్ ద్వారా అందించింది. ఈ దక్షిణ కొరియా కంపెనీ త్వరలో లాంచ్ చేయనున్న మ్యాప్‌కు సంబంధించిన టీజర్‌ను కూడా విడుదల చేసింది.


ఈ గేమ్ ఇటీవలే మనదేశంలో లాంచ్ అయింది. పబ్జీ మొబైల్, భారత్‌లో మాత్రమే అందుబాటులో ఉన్న బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (బీజీఎంఐ) తర్వాత కంపెనీ లాంచ్ చేసిన మూడో గేమ్ ఇదే. క్రాఫ్టన్ కొత్త మ్యాప్‌కు సంబంధించి మూడు ఫొటోలను కూడా విడుదల చేసింది.


ఈ సంవత్సరం మధ్యలో ఈ మ్యాప్ లాంచ్ కానుంది. ఇందులో కొండలు, మైదానాలతో పాటు మోడర్న్ బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. అలాగే సెంట్రల్ సిటీ టవర్ కూడా ఈ మ్యాప్‌లో అందించారు. ఈ కొత్త మ్యాప్‌తో పాటు పబ్జీ: న్యూ స్టేట్‌కు సంబంధించిన రెండు మేజర్ అప్‌డేట్స్ 2022లో మొదటి రెండు నెలల్లో రానున్నాయి.


అంచనాలను అందుకునేందుకు అప్‌డేట్స్, ఇంప్రూవ్‌మెంట్స్ చేస్తూ గేమ్‌ను డెవలప్ చేయడమే తమ లక్ష్యమని క్రాఫ్టన్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా గేమ్ ఆడుతున్న తమ యూజర్లందరికీ.. ఉత్తమ సర్వీస్, గేమింగ్ సర్వీస్ అందించడమే తమ లక్ష్యమని కంపెనీ తెలిపింది.


దీంతోపాటు క్రాఫ్టన్ గేమర్లతోనే కొత్త సంవత్సరాన్ని కూడా జరుపుకుంది. ఆరు చికెన్ మెడల్స్, మూడు రాయల్ చెస్ట్ క్రేట్ టికెట్లను ఇందులో అందించారు. గేమర్లకు ‘HAPPYNEWSTATE’ అనే కూపన్‌ను అందించారు. దీన్ని ప్రత్యేకమైన పేజీలో రిడీమ్ చేసుకోవచ్చు.