రియల్‌మీ తన ఇయర్ ఎండ్ సేల్‌ను ప్రకటించింది. డిసెంబర్ 26వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఈ సేల్ జరగనుంది. రియల్‌మీ.కాంతో పాటు ఫ్లిప్‌కార్ట్‌లో కూడా ఈ సేల్‌ను కంపెనీ నిర్వహించనుంది. ఈ సేల్‌లో రియల్‌మీ స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్లు అందించనున్నారు. రియల్‌మీ సీ సిరీస్, నార్జో సిరీస్‌లతో పాటు ఫ్లాగ్ షిప్ డివైసెస్‌పై కూడా ఈ సేల్ జరగనుంది. స్మార్ట్ ఫోన్ మోడల్‌ను బట్టి రూ.500 నుంచి రూ.4,000 వరకు తగ్గింపును కంపెనీ అందించింది.
రియల్‌మీ జీటీ నియో 2 అసలు ధర రూ.35,999 కాగా, ఈ సేల్‌లో రూ.31,999కే కొనుగోలు చేయవచ్చు. ఇది 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర. ఇక హైఎండ్ వేరియంట్ అయిన 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.39,999 నుంచి రూ.35,999కు తగ్గింది.
దీంతోపాటు రియల్‌మీ జీటీ మాస్టర్ ఎడిషన్ ధర రూ.4,000 తగ్గింది. ఈ ఫోన్ ధర రూ.25,999 నుంచి ప్రారంభం కానుంది. ఈ ఫోన్ ఫీచర్లను కూడా చూసుకుంటే ఈ ధరలో ఈ ఫోన్ బెస్ట్ డీల్ కానుందని కచ్చితంగా చెప్పవచ్చు. వన్‌ప్లస్ నార్డ్ సిరీస్ కంటే మెరుగైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
రియల్‌మీ 8 5జీ, రియల్‌మీ 8ఎస్ 5జీలకు సంబంధించిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ల ధరలు రూ.2,000 మేర తగ్గాయి. ఇప్పుడు రియల్‌మీ 8ఎస్‌లో ఈ వేరియంట్ ధర రూ.19,999 కాగా, రియల్‌మీ 8 5జీలో ఇదే వేరియంట్ ధర రూ.18,499కు తగ్గింది.
ఇక రియల్‌మీ 8 4జీ వేరియంట్ ధర రూ.1,500 తగ్గించారు. ఈ ఫోన్ ప్రస్తుతం రూ.16,999కే అందుబాటులో ఉంది. నార్జో సిరీస్ విషయానికి వస్తే.. రియల్‌మీ నార్జో 50ఏ ప్రారంభ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.11,499కు తగ్గింది. 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.12,499కు కొనేయచ్చు.
ఇక బడ్జెట్ ఫోన్లు అయిన రియల్ సీ25వై, రియల్‌మీ సీ21 ధరలు కూడా తగ్గాయి. రియల్‌మీ సీ25వై ధర రూ.1,000 మేర తగ్గగా.. రియల్‌మీ సీ21 ధర రూ.500 తగ్గింది. దీంతోపాటు రియల్‌మీ సీ21వై ధర కూడా తగ్గించారు.
Also Read: Tecno Camon 18: ముందు, వెనక 48 మెగాపిక్సెల్ కెమెరాలు.. ధర రూ.15 వేలలోపే.. వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ ఫ్రీ!
Also Read: Honor 60: 108 మెగాపిక్సెల్ కెమెరాతో హానర్ కొత్త ఫోన్.. వ్లాగర్ల కోసం ప్రత్యేక ఫీచర్ కూడా!
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!
Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?
Also Read: Redmi New Phone: రెడ్‌మీ కొత్త ఫోన్ వచ్చేసింది.. 8 జీబీ ర్యామ్.. ధర ఎంతంటే?