ఐటీఆర్ ఫైల్ చేయండి.. బుల్లెట్టు గెలవండి! అంటోంది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సీఎస్‌సీ. అంతే కాదండోయ్! లక్ష రూపాయలకు పైగా కమిషన్ కూడా పొందొచ్చు!
విలేజ్ లెవల్ ఆంత్రప్రిన్యూర్స్ (VLEs) కోసం ది కామన్ సర్వీస్ సెంటర్ (CSC) ఈ ఆఫర్‌ను తీసుకొచ్చింది. 2021, డిసెంబర్ 31లోపు వీఎల్‌ఈలు 1000కి పైగా ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను సీఎస్‌సీ ట్విటర్లో ప్రకటించింది.
'అటెన్షన్ వీఎల్‌ఈస్!! 2021, డిసెంబర్ 31లోపు 1000 ఐటీఆర్ ఫైల్ చేయండి. రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్టు గెలవండి. పైగా లక్ష రూపాయాలకు పైగా కమిషన్ పొందండి. ఐటీఆర్ దాఖలు చేసేందుకు చివరికి తేదీ 2021, డిసెంబర్ 31' అని సీఎస్‌సీ ట్వీట్ చేసింది. 2020-21కి చెందిన ఐటీఆర్లను 2021, డిసెంబర్ 31లోపు సీఎస్‌సీ వద్ద రిజిస్టరు చేసుకున్న వీఎల్‌ఈలు కూడా ఫైల్ చేస్తే కమిషన్ పొందొచ్చు.
కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ సీఎస్‌సీని నిర్వహిస్తుంటుంది. దేశంలోని మూలమూలకు ఇంటర్నెట్ సేవలు అందేలా చేయడం దీని బాధ్యత. గ్రామాల్లో తమ లక్ష్యాలను నెరవేర్చేందుకు వీఎస్‌ఈలను సీఎస్‌ఈ నియమించుకున్నారు. త్వరగా ఐటీఆర్‌లు ఫైల్ చేసేలా ప్రోత్సహించేందుకు వీఎల్‌ఈల కోసం ప్రస్తుతం బుల్లెట్టు ఆఫర్ ప్రకటించారు.
డిసెంబర్ 21 నాటికి చివరి వారం రోజుల్లోనే 46.77 లక్షల రిటర్నులు దాఖలయ్యాయని ఆదాయపన్ను శాఖ తెలిపింది. కేవలం 21 తేదీనే 8.7 లక్షల మంది దాఖలు చేశారు. సీఎస్‌సీ ప్రకారం 25 లక్షలకు పైగా పన్ను చెల్లింపు దారులు దేశవ్యాప్తంగా ఉన్న 75000+ వీఎల్‌ఈ కేంద్రాల్లో ఐటీఆర్ దాఖలు చేస్తారని అంచనా. గడువులోపు వెయ్యి ఐటీఆర్‌లు దాఖలు చేసిన వీఎల్‌ఈల్లో ర్యాండమ్‌గా ఎంపిక చేసి బుల్లెట్టు ఇస్తారు.
Also Read: PAN card Update: పెళ్లైన తర్వాత పాన్ కార్డులో ఇంటి పేరు మార్చుకోవాలా..? ఇలా చేయండి.
Also Read: 28 Days Validity: అమ్మో.. 28 రోజుల వ్యాలిడిటీ వెనుక ఇంత కథా.. రూ.వేల కోట్ల ఆదాయం!
Also Read: Four Day Work Week: 4 రోజులే పని.. పెరగనున్న బేసిక్ పే.. మారనున్న సాలరీ స్ట్రక్చర్!
Also Read: Cyber Crime: మీ మొబైల్ ఫోన్ సేఫేనా! పూర్తి వివరాలు కోసం క్లిక్ చేయండి
Also Read: Medplus IPO: మెడ్‌ప్లస్ లిస్టింగ్ సూపర్‌హిట్.. లాట్‌కు లాభం ఎంతొచ్చిందంటే?