రియల్‌మీ జీటీ 2, రియల్‌మీ జీటీ 2 ప్రో స్మార్ట్ ఫోన్లు చైనాలో లాంచ్ అయ్యాయి. ఇందులో ఫ్లాగ్ షిఫ్ స్పెసిఫికేషన్లు అందించారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఎల్టీపీవో ఓఎల్ఈడీ డిస్‌ప్లేను ఇందులో అందించారు. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాల సెటప్ కూడా ఇందులో ఉంది. ఫీచర్ల పరంగా చూసుకుంటే రియల్‌మీ జీటీ 2 ప్రో ఇప్పటివరకు కంపెనీ లాంచ్ చేసిన బెస్ట్ ఫోన్.
రియల్‌మీ జీటీ 2 ధర
ఇందులో మూడు వేరియంట్లు లాంచ్ అయ్యాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 2,699 యువాన్లుగా (సుమారు రూ.31,700) ఉంది. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 2,899 యువాన్లు (సుమారు రూ.34,000) కాగా, టాప్ ఎండ్ వేరియంట్ అయిన 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 3,199 యువాన్లుగా (సుమారు రూ.37,400) నిర్ణయించారు. పేపర్ గ్రీన్, పేపర్ వైట్, స్టీల్ బ్లాక్, టైటానియం బ్లూ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
రియల్‌మీ జీటీ 2 ప్రో ధర
ఇందులో మాత్రం నాలుగు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్‌లో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 3,899 యువాన్లుగా (సుమారు రూ.45,600) ఉంది. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 4,199 యువాన్లుగా (సుమారు రూ.49,300) ఉండగా, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 4,299 యువాన్లుగా (సుమారు రూ.50,500) నిర్ణయించారు. ఇక టాప్ ఎండ్ వేరియంట్ అయిన 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 4,799 యువాన్లుగా (సుమారు రూ.56,300) ఉంది. పేపర్ గ్రీన్, పేపర్ వైట్, స్టీల్ బ్లాక్, టైటానియం బ్లూ రంగుల్లోనే ఈ ఫోన్‌ను కూడా రియల్‌మీ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఫోన్లు మనదేశంలో కూడా త్వరలో లాంచ్ కానున్నాయి.
రియల్‌మీ జీటీ 2 స్పెసిఫికేషన్లు
ఇందులో 6.62 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఈ4 అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది.
వైఫై 6, 5జీ, బ్లూటూత్ వీ5.2, ఎన్ఎఫ్‌సీ కనెక్టివిటీ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, ఆ తర్వాత 65W ఫాస్ట్ చార్జింగ్‌ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది. యూఎస్‌బీ టైప్-సీ పోర్టు ద్వారా ఫోన్‌ను చార్జ్ చేయవచ్చు.
రియల్‌మీ జీటీ 2 ప్రో స్పెసిఫికేషన్లు
ఇందులో 6.7 అంగుళాల 2కే ఎల్టీపీవో అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. క్వాల్‌కాం 8 జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ కూడా ఇందులో ఉంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరాగా 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 766 ప్రాసెసర్‌ను అందించారు. దీంతోపాటు 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా కూడా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్‌లో కూడా 5000 ఎంఏహెచ్ బ్యాటరీనే అందించారు. 65W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.82 సెంటీమీటర్లు కాగా, బరువు 189 గ్రాములుగా ఉంది.
Also Read: Samsung Offers: గుడ్‌న్యూస్.. ఈ శాంసంగ్ ఫోన్ ధర తగ్గింపు.. ఇప్పుడు రూ.13 వేలలోపే!
Also Read: Cheapest 5G Phone: వేడెక్కుతున్న 5జీ మార్కెట్.. రూ.20 వేలలోపే మరో 5జీ ఫోన్!
Also Read: Tecno Camon 18: ముందు, వెనక 48 మెగాపిక్సెల్ కెమెరాలు.. ధర రూ.15 వేలలోపే.. వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ ఫ్రీ!
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!