Internet Restrictions : ఇరాన్ ఇంటర్నెట్ పరిమితులను సడలించింది. మెటా మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp), గూగుల్ ప్లే (Google Play)పై నిషేధాన్ని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుందని ఇరాన్ స్టేట్ మీడియా తెలిపింది. ఈ చర్య ప్రపంచంలోని కొన్ని కఠినమైన ఇంటర్నెట్ నియంత్రణలకు ప్రసిద్ధి చెందిన దేశంలో గణనీయమైన మార్పును సూచిస్తుంది. ఇరాన్ రాష్ట్ర వార్తా సంస్థ IRNA ప్రకారం, అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ ఆంక్షలను ఎత్తివేయాలని నిర్ణయం తీసుకున్నారు. "కొన్ని ప్రముఖ విదేశీ ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సెస్‌పై పరిమితులను ఎత్తివేయడానికి సానుకూల మెజారిటీ ఓటు దక్కింది" అని ఏజెన్సీ తెలిపింది. సమాచార మంత్రి సత్తార్ హషేమీ ఈ నిర్ణయం ఇంటర్నెట్ పరిమితులను తొలగించడంలో "మొదటి అడుగు" అని పేర్కొన్నారు.


తీవ్రమైన ఆంక్షలు ఉన్నప్పటికీ, చాలా మంది ఇరానియన్లు ఫేస్ బుక్ (Facebook), ఎక్స్ (X), యూట్యూబ్ (YouTube) వంటి బ్లాక్ చేసిన ప్లాట్‌ఫారమ్‌లను యాక్సెస్ చేయడానికి వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్‌లపై (VPNలు) ఆధారపడుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో సోషల్ మీడియా వేదికలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి.


Also Read : Google Chrome AI Mode: గూగుల్ సెర్చ్‌లో ఏఐ మోడ్ - ఛాట్‌జీపీటీ పోటీని తట్టుకోవడానికి!


అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో మసూద్ పెజెష్కిన్.. ఇరాన్ లో ఇంటర్నెట్ ఆంక్షలు ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని అమలు చేసే ప్రయత్నంలో భాగంగానే ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే అక్కడ వాట్సాప్, గూగుల్ ప్లేస్టోర్ వంటి అంతర్జాతీయ సేవలను పునరుద్ధరించినప్పటికీ.. స్థానిక మాధ్యామల వినియోగానికే తాము ఎక్కువ ప్రయారిటీ ఇస్తామని ఈ సందర్భంగా ఇరాన్ సర్కార్ స్పష్టం చేసింది. తాజా నిర్ణయం వ్యక్తిగత వినియోగదారుసు, స్థానిక వ్యాపారులపై ఎలాంటి మార్పులు తీసుకువస్తుందో ఇప్పుడే అంచనా వేయలేమని ఇరాన్ వాసులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనప్పటికీ ఈ ఆంక్షల సడలింపు అనేది కీలక ముందడుగు అని ఆ దేశ అధికారులు భావిస్తున్నారు.


హిజాబ్ ధరించడానికి నిరాకరించిన మహిళలపై కఠినమైన జరిమానాలు విధించే వివాదాస్పద చట్టాన్ని కూడా ఇరాన్ నిలిపివేసింది. గతేడాది పార్లమెంటు ఆమోదించిన చట్టం అమలు కోసం ప్రభుత్వానికి పంపలేదు. అణు కార్యక్రమంతో ముడిపడి ఉన్న ఆంక్షలకు సంబంధించి పాశ్చాత్య దేశాలతో ఇరాన్ చర్చలపై దాని ప్రభావంపై అధ్యక్షుడు పెజెష్కియన్ ఆందోళన వ్యక్తం చేసిన తర్వాత ఈ నిర్ణయం వచ్చింది. సీనియర్ పార్లమెంటరీ అధికారి షహరామ్ దబిరి ఈ విరామాన్ని ధృవీకరించారు. "ప్రస్తుతానికి ఈ చట్టాన్ని పార్లమెంటు ప్రభుత్వానికి సూచించకూడదని నిర్ణయించారు" అని అతను చెప్పాడు.


ఇరాన్  ఇంటర్నెట్ విధానాలు ప్రపంచ విమర్శలను ఎదుర్కొంటా యునైటెడ్ స్టేట్స్ వంటి దేశాలు ఆన్‌లైన్ సెన్సార్‌షిప్‌ను ఎదుర్కోవాలని సాంకేతిక కంపెనీలను కోరుతున్నాయి. ప్రస్తుతానికి, యూట్యూబ్, ఫేస్ బుక్ వంటి ప్లాట్‌ఫారమ్‌లు బ్లాక్ చేశారు. వాట్సాప్, గూగుల్ ప్లేకి అనియంత్రిత యాక్సెస్ కోసం టైమ్‌లైన్ ఇంకా నిర్ణయించలేదు.


Also Read : Government Banned OTT Apps: 18 ఓటీటీ యాప్స్ బ్యాన్ చేసిన ప్రభుత్వం - ఎందుకో తెలుసా?