Kiara Advani shoutout to Jani Master : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'గేమ్ ఛేంజర్' సినిమా జనవరిలో తెరపైకి రాబోతున్న సంగతి తెలిసిందే. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్లను షురూ చేశారు మేకర్స్. అందులో భాగంగానే ఇటీవల అమెరికాలో బిగ్ ఈవెంట్ నిర్వహించగా, 'ధోప్' అనే పాటను కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ 'ధోప్' పాటలో హీరో హీరోయిన్లు చేసిన డాన్స్ మూమెంట్స్ పై ట్రోలింగ్ నడుస్తోంది. దానికి కారణం జానీ మాస్టర్. అలాంటిది తాజాగా జానీ మాస్టర్ పై సోషల్ మీడియా వేదికగా కియారా అద్వాని ప్రశంసల వర్షం కురిపించింది. దీంతో ఇప్పుడు కియారా అద్వానీని టార్గెట్ చేస్తున్నారు నెటిజెన్లు.
కియారా అద్వానీ చేసిన పోస్ట్
కియారా అద్వాని తాజాగా ధోప్' పాటకు సంబంధించిన ప్రాక్టీస్ సెషన్ పిక్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో "ఈ ధోప్ సాంగ్ ను డైరెక్టర్ శంకర్ అద్భుతంగా చిత్రీకరించారు. ఓ మూవీ సాంగ్ కోసం ఫస్ట్ టైమ్ 13 రోజులు షూటింగ్ లో పాల్గొన్నాము. ఇక సెట్ లో ఉన్నప్పుడు నేను డిస్నీల్యాండ్ లో ఉన్నట్టుగా ఫీల్ అయ్యాను. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ ఆల్రెడీ చూసి ఉండడంతో ఈ సాంగ్ ని ఎలా చేయబోతున్నామో అనే ఒక ఆలోచన ఉండేది. అయితే ఇదే మా జాబ్స్ లో ఉన్న అందం. ప్రతిసారి కొత్త విషయాన్ని నేర్చుకుంటాము. ఈసారి డాన్స్ లో డబ్ స్టెప్/ క్లాసికల్/ రోబోటిక్/ హిప్ హాప్ అన్ని స్టైల్స్ ఉన్న డాన్స్ చేశాను. ఎలా ఉందో మీరు కామెంట్స్ లో చెప్పండి. ఇక నాకు తెలిసిన అద్భుతమైన డాన్సర్ లో ఒకరైన రామ్ చరణ్ తో కలిసి డాన్స్ చేయడం అంటే కచ్చితంగా ఫన్ గా ఉంటుంది" అంటూ పోస్ట్ చేసింది. అయితే ఇందులో రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ తో పాటు జానీ మాస్టర్ ని ట్యాగ్ చేసింది.
కియారాపై ట్రోలింగ్
దీంతో ఒక్కసారిగా ఆమె చేసిన పోస్ట్ వైరల్ అయింది. పోక్సో చట్టం కింద కేసు నమోదైన ఒక వ్యక్తిని తన పోస్టులో ట్యాగ్ చేయడంతో ఆమెపై మండిపడుతున్నారు. 'లైంగిక ఆరోపణలతో జైలుకెళ్లిన జానీ మాస్టర్ నుంచి తాను ఎంత నేర్చుకుందో తెలియజేస్తూ పోస్ట్ చేసింది' చూడండి అంటూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో కియారా అద్వానీ తాను చేసిన పోస్టులో నుంచి జానీ మాస్టర్ పేరును తొలగించింది. కియారా మాత్రమే కాదు, జానీ మాస్టర్ తో కలిసి పని చేసిన పలువులు సెలబ్రిటీలపై కూడా నెటిజెన్లు విరుచుకుపడుతున్నారు.
జానీ మాస్టర్ వర్క్ చేసిన సినిమాలు
జానీ మాస్టర్ లోకల్ కాదు నేషనల్ అన్నట్టుగా సౌత్ నుంచి నార్త్ వరకు అన్ని సినిమాల్లోనూ సాంగ్స్ లో తన మార్క్ చూపిస్తున్నారు. తాజాగా జానీ మాస్టర్ 'స్త్రీ 2'లో 'ఆయీ నాయ్' అనే పాటకు, 'బేబీ జాన్'లో 'నైన్ మాటక్క' సాంగ్ కు కొరియోగ్రఫీ అందించారు. గతంలో 'పుష్ప: ది రైజ్', 'బీస్ట్'లో 'అరబిక్ కుతు' సాంగ్ కి , 'జైలర్'లో 'కావాలయ్యా' పాటకు, 'అఖియాన్ బాతోన్ మే ఐసా ఉల్ఝా జియా' వంటి సూపర్ హిట్ సాంగ్స్ కు కొరియోగ్రఫీ అందించారు.
Read Also : Dil Raju Comments: సీఎంను కలిశా... అల్లు అర్జున్ కలుస్తా... రేవతి ఫ్యామిలీని ఆదుకునే బాధ్యత నాదే: దిల్‌రాజు